
సాక్షి, హైదరాబాద్: ఇరాన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కార్టూన్ క్యారికేచర్ పోటీల్లో ‘సాక్షి’ కార్టూనిస్ట్ పామర్తి శంకర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. మొత్తం 64 దేశాల కార్టూనిస్టులు పాల్గొంటున్న 11వ టెహ్రాన్ అంతర్జాతీయ ద్వైవార్షిక కార్టూన్ పోటీల్లో శంకర్‌తోపాటు గ్రీస్, పోర్చుగల్‌కు చెందిన ఇద్దరు కార్టూనిస్టులను అంతర్జాతీయ జ్యూరీకి ఎంపిక చేశారు.
నిర్వాహకుల ఆహ్వానం మేరకు శంకర్ మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ బయలుదేరారు. ఈ నెల 15న అవార్డుల ప్రదానం జరగనుంది. ఆ తర్వాత జరిగే వర్క్‌షాప్‌లోనూ ఆయన పాల్గొంటారు. గతంలోనూ శంకర్ పలు అంతర్జాతీయ కార్టూన్ పోటీల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.