సాక్షి ఇంటర్నెట్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లడ్డూలో ఉపయోగించిన నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని చెబుతూ.. ‘కొవ్వు’ కామెంట్లు చేశారాయన. దానికి కొనసాగింపుగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత టీటీడీ బోర్డు చైర్మన్‌లతోపాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పనిలో పనిగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.
ఏపీలో లడ్డూ రాజకీయంపై హైడ్రామా కొనసాగుతున్న తరుణంలోనే.. సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర దరాప్తు జరిపించాలని కోరారు పిటిషనర్లు. వీటన్నింటిని కామన్‌గా విచారణకు స్వీకరించింది ద్విసభ్య ధర్మాసనం. తొలిరోజు విచారణలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: దేవుడికే ఆగ్రహం తెప్పించిన ప్రభుత్వమిది!
తిరుపతి లడ్డూ ప్రచారంలో తొలుత జాతీయ మీడియా ఛానెల్స్ సైతం చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆనక.. ఆ వ్యాఖ్యలను నిపుణులతో విశ్లేషించి.. బాబు రాజకీయాల్ని గ్రహించి.. దిద్దుబాటు కథనాలు ఇచ్చాయి. మరోవైపు ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య లడ్డూ వ్యవహారంపై తన బ్రష్‌కు పని చెప్పారు. తొలి నుంచి జరుగుతున్న పరిణామాలను.. చంద్రబాబు, పవన్‌లకు ఎదురవుతున్న అనుభవాలను ఆయన తన కార్టూన్‌లలో భలేగా చూపించారు. అందులో కొన్నింటిని ఫస్ట్‌పోస్ట్ పబ్లిష్ చేయగా.. మరికొన్నింటిని ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు. మొత్తంగా.. ఈ లడ్డూ రాజకీయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, నవ్వులపాలైంది పవనే అనే కామెంట్ ఎక్కడ చూసినా కనిపిస్తోంది.
Images Courtesy: Satish Acharya
Comments
Please login to add a commentAdd a comment