
తిరువొత్తియూరు: తమిళనాడు సీఎం పళనిస్వామితో పాటు తిరునల్వేలి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లపై వ్యంగ్య చిత్రం గీసిన కేసులో అరెస్టయిన కార్టూనిస్టు జి.బాల అలియాస్ బాలక్రిష్ణన్(36) సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన ఇసక్కిముత్తు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక జిల్లా కలెక్టరేట్‌లో కుటుంబంతో సహా నిప్పు అంటించుకుని ఆత్మాహతి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వ్యంగ్య కార్టూన్ గీయడంతో జిల్లా కలెక్టర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బాలను అరెస్టుచేసి చెన్నైలో కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. బాలకు బెయిల్ జారీచేస్తూ నవంబర్ 9న కోర్టుకు హాజరు కావాలని నిబంధన విధించారు. కాగా, బాల గీసిన వ్యంగ్య కార్టూన్లను సామాజిక మాధ్యమాల్లో 25 లక్షల మంది చూసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment