
మదురై: కార్టూనిస్ట్ బాలాపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తనపై విచారణను రద్దుచేయాలని కోరుతూ బాలా వేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఆదేశాలిస్తూ దీనికి కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు అనుమతి లేకుండా విచారణ జరిపే అధికారం పోలీసులకు లేదని బాలా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తానేం క్రిమినల్ నేరానికి పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో లేదని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా తాజా ఎఫ్‌ఐఆర్ ఉందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment