unnav
-
కానిస్టేబుల్ ఆత్మహత్య.. శరీరంపై గాయాలు.. ఏం జరిగింది?
లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతదేహంపై 500కుపైగా గాయాల గుర్తులు కనిపించడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆమె మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో పోలీస్ లైన్‌లోని వసతిగృహంలో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్.. గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, పోస్టుమార్టం నివేదికలో మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయిందని, మృతదేహాంపై 500కుపైగా గాయాల గుర్తులు ఉన్నట్లు వెల్లడైంది. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీను.. తననుతాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
బిల్డింగ్‌కు వేలాడుతూ నర్సు డెడ్‌బాడీ.. అత్యాచారం చేసి ఆ తర్వాత..?
Nurse Suicide.. ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్న నర్సు.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నర్సింగ్ హోమ్ గోడకు వేలాడుతున్న మహిళ మృతదేహం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉన్నావ్‌లోని న్యూ జీవన్ హాస్పిటల్లో ఓ మహిళా నర్సు శుక్రవారమే విధుల్లో చేరింది. తర్వాత రోజు శనివారమే నర్సింగ్ హోమ్ గోడకు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆమె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్న తర్వాత వారు షాకింగ్ విషయాలు చెప్పారు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఇలా హత్య చేశారని ఆరోపించారు. నర్సింగ్‌హోమ్ నిర్వాహకుడితో సహా మరో ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఉన్నావ్ అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఆమెపై అత్యాచారం జరిగిందా..? లేక ఆమెనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. Very Disturbing Visuals : In #UttarPradesh's #Unnao, a 19-year-old girl was found hanging from a hospital terrace. She was employed as a nurse in the newly inaugurated hospital in the #Bangarmau area. A case under IPC sections of murder and gangrape has been registered. pic.twitter.com/JQ1NkNVAw0 — Hate Detector 🔍 (@HateDetectors) April 30, 2022 ఇది కూడా చదవండి: విద్యార్థినితో మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని.. -
ఉన్నావ్ కేసు : ఢిల్లీ హైకోర్టుకు సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ సామూహిక లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనకు విధించిన యావజ్జీవ ఖైదును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఉన్నావ్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో గత ఏడాది డిసెంబర్ 20న సెంగార్‌కు తీస్‌హజారి కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. జీవిత ఖైదుతో పాటు రూ 25 లక్షల జరిమానా విధించింది. ఆయనకు జైలు శిక్ష రెండేళ్లకు పైగా విధించడంతో యూపీ అసెంబ్లీకి సెంగార్ ఎన్నిక రద్దయింది. ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద సెంగార్‌పై లైంగిక దాడి అభియోగాలను ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు ధ్రువీకరించింది. సెంగార్‌పై ఆరోపణలను సీబీఐ నిరూపించగలిగిందని తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి ధర్మేష్ శర్మ పేర్కొన్నారు. సెంగార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. -
సెంగార్..ద రేపిస్ట్!
-
ఉన్నావ్ తీర్పుకు సర్వం సిద్ధం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై తుది తీర్పు వెల్లడించేందుకు ఢిల్లీ హైకోర్టు సిద్ధమైంది. రేపు (సోమవారం) ఉదయం 10 గంటల తరువాత ఉన్నావ్ అత్యాచార కేసుపై తీర్పును వెల్లడించనుంది. కేసులో పూర్తి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ ధర్మేశ్ శర్మ తెలిపారు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా 2017లో కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 2018లో ఉన్నావ్‌కు చెందిన యువతి ఆరోపించగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి లాకప్‌లోనే ఆయన చనిపోయేలా చేయడం తెలిసిందే. బాధిత యువతి తన ఇద్దరు సమీప బంధువులు, లాయర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారును ట్రక్కుతో ఢీకొట్టి వారందరినీ చంపే ప్రయత్నం జరిగింది. యువతి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించగా, యువతి, ఆమె లాయర్ తీవ్ర గాయాలపాలై.. తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద ఘటనపై విచారణన చేపట్టిన సీబీఐ, 10 మందిపై హత్యానేరం మోపింది. కాగా కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులు సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అత్యాచార ఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఐదు కేసులనూ ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని గత ఆగస్ట్‌లో సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 120 బీ (క్రిమినల్ కుట్ర), 363 కిడ్నాప్, 376 అత్యాచారం, పోక్సో చట్టం వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంగార్‌ను బీజేపీ ఇదివరకే పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. -
‘ ఉన్నావ్’ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి
లక్నో: కుటుంబసభ్యులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి అంతిమసంస్కారాలు ముగిశాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రావాల్సిందేనని పట్టుబట్టిన బాధిత కుటుంబం... అధికారులు మాట ఇవ్వడంతో అంత్యక్రియలు పూర్తిచేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలి మృతిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ప్రజాసంఘాలు ధర్నాలు చేపడుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వెంటనే స్పందించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఘటన మాదిరిగా తమ కూతురును దారుణంగా హత్య చేసిన.. రాక్షసులను ఎన్కౌంటర్ చేయాలని కుంటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారికి స్థానికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. మహిళలపై అత్యాచార ఘటనలు జరగకుండా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. తనపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై గురువారం ఉదయం నిందితులు పెట్రోల్ పోసి, నిప్పంటించిన విషయం తెలిసిందే. దాదాపు 40 గంటల పాటు మృత్యువుతో పోరాడి, ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసింది. కుటుంబసభ్యులు శనివారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టి, త్వరలోనే బాధితులకు శిక్షలు పడేలా చూస్తామని సీఎం తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం తరుఫున తమకు ఎలాంటి సహాయం అవసరంలేదని, నిందితులకు కఠినంగా శిక్షిస్తే చాలని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
రేప్ చేయలేదు కదా? చేశాక చూద్దాం : పోలీసులు
లక్నో : ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిపై దాడి ఘటనపై దేశం అట్టుడికిపోతుండగా, అదే జిల్లాలో మరో విస్మయకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నావ్ జిల్లాలోని సిందుపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి తనపై ఐదుగురు యువకులు అత్యాచారయత్నం చేశారంటూ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే అత్యాచారం ఇంకా జరగలేదు కదా! జరిగాక వచ్చి ఫిర్యాదు చేయు. అప్పుడు చూద్దామని బదులిచ్చారు. బాధితురాలి కథనం ప్రకారం.. ‘స్వగ్రామంలో మందులు తీసుకురావడానికి వెళ్తున్న తనను ఐదుగురు యువకులు అడ్డగించి బలాత్కారం చేయబోయారు. వారిలో ముగ్గురిని గుర్తుపట్టగలను. వారి పేర్లు కూడా నాకు తెలుసు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి మొదట నేను 1090 కి కాల్ చేశాను. వాళ్లు 100కు ఫోన్ చేయమన్నారు. 100కు ఫోన్ చేస్తే ఉన్నావ్ స్టేషన్‌కి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్తే సంఘటన జరిగిన ప్రదేశం స్థానిక బిహార్ పోలీస్ స్టేషన్ పిరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లమన్నారు. మూడు నెలల నుంచి నన్ను ఇలాగే తిప్పించుకుంటున్నారు. నేను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి ఆ యువకులు రోజూ మా ఇంటికి వచ్చి కేసు ఫైల్ అయితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అయినా ఏదైనా ఘోరం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలి గానీ, జరిగాక హడావిడి చేస్తే న్యాయం ఎలా జరుగుతుంద’ని ఆమె ఓ జాతీయ మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ విషయంపై అక్కడి ఐజీని మీడియా వివరణ కోరగా ఆయన అలాంటిదేమీ లేదని పేర్కొనడం గమనార్హం. (చదవండి) : ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి -
ఆమె పోరాటం ముగిసింది!
న్యూఢిల్లీ/లక్నో/ఉన్నావ్: నేరస్తుల బెదిరింపులు.. స్పందించని ప్రభుత్వం.. చలించని పోలీసులు..ఇలా అడ్డంకులెన్ని ఎదురైనా వెరవకుండా న్యాయం కోసం ముందుకు సాగిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి(23) జీవన పోరాటం ముగిసింది. దాదాపు 40 గంటల పాటు మృత్యువుతో పోరాడి, ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. తనపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై గురువారం ఉదయం నిందితులు పెట్రోల్ పోసి, నిప్పంటించిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసింది. కుటుంబసభ్యులు శనివారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆమె మృతిపై విపక్షాలు భగ్గుమన్నాయి. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని, బాధితురాలికి న్యాయం చేయలేకపోయిందని విమర్శించాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టి, త్వరలోనే బాధితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వెంటాడి చంపాలి: మృతురాలి తండ్రి తన కుమార్తె మరణానికి కారణమైన వారిని వెంటాడి, చంపాలని మృతురాలి తండ్రి ఆవేశంతో అన్నారు. ‘మాకు డబ్బూ వద్దు. ఎలాంటి సాయమొద్దు. హైదరాబాద్ ఎన్కౌంటర్ మాదిరి దోషుల్ని కాల్చి చంపాలి లేదా ఉరి తీయాలి’అని అన్నారు. తన సోదరి మరణానికి కారణమైన దోషులకు జీవించే హక్కు లేదని బాధితురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దోషులంతా చస్తేనే నా సోదరికి న్యాయం జరిగినట్లవుతుంది. ఆ కిరాతకులందరినీ యమపురికి పంపాలి’అని అన్నారు. అత్యాచారాల రాజధానిగా భారత్: రాహుల్ దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. యూపీ ప్రభుత్వం విఫలం: ప్రియాంకా గాంధీ ఉన్నావ్ రేప్ బాధితురాలికి న్యాయం అందించడంలో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రియాంక శనివారం బాధితురాలి స్వగ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమెకు న్యాయం దక్కకపోవడానికి ప్రతి ఒక్కరిదీ బాధ్యతేనన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: మాయావతి మహిళలపై పెరుగుతున్న నేరాలను సుమోటోగా పరిగణించి, వీటికి అడ్డుకట్టపడేలా కేంద్రానికి తగు సూచనలివ్వాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టును కోరారు. మాయావతి శనివారం యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్‌ను కలిశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్ననేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. యోగి ప్రభుత్వాన్ని తొలగించాలి: అఖిలేశ్ ‘ఉన్నావ్’బాధితురాలికి రక్షణ కల్పించడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. ఇది చీకటి దినమనీ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ఎలాంటి సాయం అందించారు? మీరు ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? అని నిలదీశారు. పోస్టుమార్టం నివేదిక ఏం చెప్పింది? ఉన్నావ్ రేప్ బాధితురాలి మృతదేహానికి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు శనివారం పోస్టుమార్టం జరిపారు. ‘తీవ్రంగా కాలిన గాయాల కారణంగా బాధితురాలు చనిపోయింది. విష ప్రయోగం, మారణాయుధాలు, ఊపిరాడకపోవడం వంటి కారణాలతో చనిపోయినట్లు ఆధారాలు కనిపించలేదు’అని వైద్యుడొకరు చెప్పారు. ‘శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించింది. రాత్రి 11 గంటలపుడు అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. గుండెను తిరిగి పని చేయించడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. 11.40 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచింది’అని ఆస్పత్రి వైద్యుడు శలబ్ కుమార్ ప్రకటించారు. మృతురాలి ఇంటివద్ద జనం. బాధితురాలి బంధువులను పరామర్శించి వస్తున్న ప్రియాంక గాంధీ. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న దృశ్యం -
ఉన్నావ్: రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
లక్నో : ఉన్నావ్ అత్యాచారం, హత్య ఘటనలోని బాధితురాలి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బీజేపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్‌తో కలిసి శనివారం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యానాథ్ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఉన్నావ్ బాధితురాలు మరణం దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి నుంచి మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. సీఎం ఆదిత్యనాథ్‌తోపాటు ప్రభుత్వం బాధితురాలికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని, ఈ విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. కాగా గురువారం కోర్టు విచారణకు వెళ్తున్న ఉన్నావో బాధితురాలిని రైల్వేస్టేషన్ సమీపంలో నిందితులు అడ్డుకొని పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించింది. ఈ ఘటన అనంతరం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దారుణం జరిగినా బీజేపీ ప్రభుత్వ సరిగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జరిగిన ఘోరమంతా జరిగాక ఏం చేసినా ఏం లాభమని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని మహిళకు భద్రత లేదు : మాయావతి ఉన్నావ్: వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష అత్యాచారాలకు రాజధానిగా భారత్: రాహుల్ -
ఉన్నావ్ బాధితురాలి మృతి: వెల్లువెత్తిన నిరసనలు
లక్నో: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి హత్యకు నిరసనగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర విధానసభ వద్ద ధర్నాకు దిగారు. హత్యకు ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని విమర్శించారు. ఉన్నావ్ బాధితురాలి హత్యకు కారణమైన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు యోగి సర్కారే ప్రథమ దోషి అని అన్నారు. ఉత్తరప్రదేశ్ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని అఖిలేష్ విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ వర్గాల చెందిన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలని మహిళలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బాధితురాలి మృతికి నిరసనగా ఢిల్లీలోనూ పలువురు ధర్నా చేపట్టారు. కాగా బాధిత యువతి కుటుంబ సభ్యులను ప్రియాంక గాంధీ పరామర్శించే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఆమె ఇదివరకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఘటనపై విచారణ చేపడుతామని సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. కాగా బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఢిల్లీ నుంచి లక్నోకు తరలించారు. ఈ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా ఆమె ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. -
‘నా సోదరిని చంపినోళ్లు బతకడానికి వీళ్లేదు’
లక్నో: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి హత్యకు ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించారు. బాధిత యువతి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. ఈ నేపథ్యంలో వారి వద్ద ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ దేశాన్ని ఎవరూ రక్షించలేరు. మహిళలకు కనీస రక్షణ లేదు. నిందితుల చావును నా సోదరి కోరుకుంటోంది. వారిని వెంటనే శిక్షించాలి. నా సోదరిని హత్యచేసిన ఐదుగురు నిందితులు బతకడానికి అనర్హులు’ అంటూ ఉన్నావ్ బాధితురాలి సోదరుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తన బిడ్డ ఆత్మ శాంతించాలంటే నిందితులను వెంటనే ఉరితీయాలని ఆమె తల్లి డిమాండ్ చేసింది. (ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి) కాగా ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఘటనపై విచారణ జరుపుతామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. -
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి
సాక్షి, ఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. అనంతరం ఆమెను లక్నోలో ఓ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. -
వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు
మౌంట్ అబూ: మహిళలపై జరుగుతున్న వరుస పైశాచిక దాడులు దేశాన్ని వణికిస్తున్నాయని, నైతికంగా దెబ్బ తీస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాజస్తాన్‌లోని అబూరోడ్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి తీసుకువచ్చిన ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే హక్కు లేకుండా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో దిశ హత్యాచారం, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి మహిళల భద్రత గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘అత్యాచార నేరాల్లో ఉరి శిక్ష పడిన వారందరూ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. వారికి రాజ్యాంగం ఆ హక్కుని కల్పించింది. అయితే పోక్సో చట్టం కింద శిక్ష పడిన వారికి ఆ హక్కు ఉండకూడదు. ఆ దిశగా కేంద్రం అడుగులు వెయ్యాలి. చట్టాలను పునఃసమీక్షించాలి’అని సూచించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దోషి క్షమాభిక్ష పెట్టుకున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడాన్ని అభినందిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం -
దిశ నిందితుల ఎన్కౌంటర్: అట్టుడికిన పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పార్లమెంట్లో ఎంపీలు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్‌కౌంటర్‌పై లోక్‌సభలో తొలుత విపక్ష కాంగ్రెస్ స్పందించింది. దేశంలో మహిళలపై దాడులు దారుణంగా పెరిగిపోతున్నాయని, ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు కనీసం అమలుకు నోచుకోవడం లేదని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అదీర్ రంజన్ చౌదరి సభలో పేర్కొన్నారు. అనంతరం షాద్‌నగర్ ఘటనపై తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన లోక్‌సభలో ప్రస్తావించారు. ఎన్‌కౌంటర్‌ను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ సభ్యులతో పాటు పలు పార్టీలకు చెందిన ఎంపీలూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు మద్దతుగా తమ గళాన్ని వినిపించారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే దేశంలో మహిళలు క్షేమంగా ఎలా జీవిస్తారని ప్రశ్నించింది. ఉన్నావ్ ఘటన నిందితులకు కూడా ఎన్కౌంటర్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉన్నావ్ ఘటనకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు రాజ్యసభలోనూ ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమయింది. నిర్భయ నిందితులకు శిక్ష పడి ఏడేళ్లు గడుస్తున్నా.. ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆప్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని, కఠిన శిక్షలు పడేలా చట్టాలను మార్చాలని ఆప్ డిమాండ్ చేసింది. అయితే విపక్షాల ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉన్నావ్ ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కానీ ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరైనది కాదని విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేసి తీరుతామని మంత్రి లోక్‌సభలో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో మహిళల సంక్షేమ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు. -
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తెగువ
లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై వరుస హత్యాచార ఘటనలు, దాడులు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా మహిళలపై నమోదవుతున్న అత్యాచార ఘటనలు మహిళ భద్రతను, రక్షణను సవాల్ చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై దాడిచేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన వెలుగు చూసింది. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలు, గురువారం జరిగిన మరో దాడిలో కూడా చూపించిన తెగువ, సాహసం చర్చనీయాంశమైంది. తనే స్వయంగా పోలీసు ఎమర్జెన్సీ నెంబరు 112 ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కాల్తోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే తనపై దాడిచేసిన వ్యక్తులు పేర్లను పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అందించిన కథనం ప్రకారం, మంటల్లో కాలిపోతూ కూడా దాదాపు కిలోమీటరు దూరం పరుగెత్తింది. సహాయం కోసం అర్ధిస్తోంది. ఆమెకు సహాయం చేసేందుకు దగ్గరికెళ్లి ఆమెను పలకరించాను. తన పేరు చెప్పిన వెంటనే.. తన దగ్గరినుంచి ఫోన్ తీసుకుని పోలీసుల అత్యవర నంబరుకు కాల్ చేసిందని ఆయన చెప్పారు. ఆమె మంటల్లో కాలిపోతున్న ఆ దృశ్యం ఇప్పటికే తనను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. ఇంతలో పోలీసులొచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారంటూ ఈ దారుణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా అత్యాచార బాధితురాలు విచారణ నిమిత్తం రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా, ఇటీవల బెయిల్‌పై విడుదలైన నిందితులు దారికాచి, దగ్గర్లోని పొలంలోకి ఈడ్చుకెళ్లి మరి నిప్పంటించారు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం విమానాశ్రయం నుంచి సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్‌కు ఏర్పాట్లు చేస్తోంది. (లైంగిక దాడి బాధితురాలు కోర్టుకు వెళుతుండగా..) -
ఉన్నావ్ కేసు: రెండు వారాల్లోగా విచారణ పూర్తి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కారు ప్రమాద కేసును సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. అంతేకాక ప్రమాదంలో గాయపడిన బాధితురాలి న్యాయవాదికి తక్షణమే రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యాచార ఘటనతో పాటు రోడ్డు ప్రమాదం కేసుపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని సీబీఐ కోర్టుకు వివరించింది. అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరో రెండు వారాలు పొడిగించేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది. -
ఇంత దారుణమా!
ప్రభుత్వాలు ఏం చెబుతున్నా, నాయకులు ఎలాంటి హామీలిస్తున్నా వాస్తవంలో జరిగేదేమిటో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబంపై గత రెండేళ్లనుంచి నిరంతరాయంగా సాగుతున్న అఘాయిత్యాలు గమనిస్తే తేటతెల్లమవుతుంది. ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది మొదలుకొని ఆ కుటుంబం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె తన తండ్రిని, బాబాయిని కోల్పోయింది. నిరంతం బెదిరింపులు ఎదుర్కొంటూనే ఉంది. చివరికిప్పుడు ఆ బాలిక న్యాయస్థానానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ‘రోడ్డు ప్రమాదం’లో చిక్కుకుని చావు బతుకుల్లో ఉంది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న పిన్ని, మేనత్త ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా వారి న్యాయవాది పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉంది. ఆ కుటుంబంపై ఇంత వరకూ జరిగిన నేరాలూ, ఘోరాలు గమనిస్తే అసలు మనం ఏ యుగంలో ఉన్నామన్న అనుమానం తలెత్తుతుంది. మన దేశంలో మైనర్లపై జరిగే లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధించే పోక్సో చట్టం ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదని అత్యాచార బాధితులు ఫిర్యాదు చేసిన పక్షంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు దాన్ని స్వయంగా పరిశీలించి, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలున్నాయి. కానీ ఆ నిస్సహాయ బాలిక కుటుంబానికి ఏదీ అక్కరకు రాలేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మన నేతల నోట ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంద’న్న గంభీరమైన పలుకులు వినిపిస్తాయి. ఈసారీ అవే వినిపించాయి. నిజమే... ఉత్తరప్రదేశ్‌లో గత రెండేళ్లుగా అది తనకలవాటైన పద్ధతిలోనే ‘పని’ చేస్తూ పోతోంది. ఆ బాలిక కుటుంబం మాత్రం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. ఈ ఘటనల క్రమం గమనిస్తే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. మొదట 2017 జూన్‌లో ఆ బాలికను అపహరించి పది రోజుల తర్వాత వేరే ఊళ్లో ఎక్కడో దుండగులు వదిలేసి పోయినప్పుడు ఆమె స్థానిక ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ మనుషులు తనను అపహరించారని ఆరోపించింది. తనపై ఆ ఎమ్మెల్యే, అతని సోదరుడు రోజుల తరబడి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని రోదించింది. ఎక్కడా నోరెత్తకుండా ఉంటే ఉద్యోగం చూపిస్తామన్నారని తెలిపింది. ఇవన్నీ ఆమె కుటుంబం ఫిర్యాదులో పొందుపరిస్తే పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్లో వేరేవిధంగా నమోదు చేశారు. ఆమెను అపహరించడం (ఐపీసీ సెక్షన్ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ సెక్షన్ 366) వంటి ఆరోపణలు మాత్రమే అందులో ఉన్నాయి. ఆ ఫిర్యాదు చేసింది మొదలు ఆ కుటుంబం నరకాన్ని చవిచూసింది. స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారన్న అనుమానంతో సీఎం మొదలుకొని ఉన్నతాధికారుల వరకూ ఆ బాలిక లేఖలు రాస్తూనే ఉంది. గత్యంతరం లేక ఆ బాలిక తల్లి న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తే ఆ తర్వాత కూడా జరిగిందేమీ లేదు. చివరకు న్యాయస్థానానికెళ్లొస్తున్న ఆ కుటుంబంపై ‘గుర్తు తెలియని వ్యక్తులు’ దాడి చేసి తండ్రిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. వారు అతని దగ్గర అక్రమ ఆయుధాలున్నాయంటూ కేసు పెట్టారు. ఎమ్మెల్యే సోదరుడి నాయకత్వంలోని గూండాలు తనపై దాడి చేసి కొట్టారని నెత్తురు కక్కుకుంటూ ఆయన చెప్పిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. అవి మీడియాలో వెల్లడై నిరసనలు పెల్లుబికాక ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేశారు. నిరుడు ఏప్రిల్‌లో యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆమె ఆత్మహత్యాయత్నం చేశాక ఈ ఘోరాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ తర్వాతగానీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు కాలేదు. ఈలోగా తీవ్రంగా గాయపడిన ఆమె తండ్రి సరైన వైద్యసాయం అందక మరణించాడు. ఈ కేసు రోజురోజుకీ తీవ్రమవుతున్నదని అర్ధమయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత చాన్నాళ్లకు ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఎమ్మెల్యేకు సహకరించి, అత్యాచారానికి తోడ్పడిందన్న ఆరోపణపై ఒక మహిళను కూడా అరెస్టు చేశారు. ఇంతలోనే కేసులో సాక్షిగా ఉన్న ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. నిజమే... ఆరోపణలొచ్చినంత మాత్రాన ఎవరూ దోషి కాదు. అవి కోర్టులో రుజువయ్యేవరకూ ఎవరైనా నిర్దోషే అని మన చట్టాలు చెబుతాయి. కానీ అసలు ఫిర్యాదులొచ్చినప్పుడు కేసు నమోదు చేయకపోతే, నిందితుడిని కనీసం అదుపులోనికి తీసుకుని ప్రశ్నించకపోతే ఏమనాలి? బాధితురాలి కుటుంబానికి నిరంతరం బెదిరింపులు రావడం, ఆ కుటుంబంలోనివారిపై వరసగా దాడులు జరగడం ఎలా అర్ధం చేసుకోవాలి? తనపై అత్యాచారం జరిగిందని ఆ బాలిక ఆరోపించేనాటికే పోక్సో చట్టం ఉనికిలో ఉంది. దాన్ని మరింత కఠినం చేస్తూ రెండు దఫాలు చట్ట సవరణలు కూడా తీసుకొచ్చారు. నిర్దిష్ట వ్యవధిలో ఇలాంటి కేసుల విచారణ పూర్తయి నిందితులకు శిక్షపడాలని అందులో నిర్దేశించారు. కానీ బాలిక కుటుంబం వరస దాడులతో తల్లడిల్లుతూనే ఉంది. వీటన్నిటికీ పరాకాష్టగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బాధితురాలికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఆ వాహనంలో లేకపోవడం, అందుకు పొంతన లేని కారణాలు చెబుతుండటం గమనిస్తే ఇది హత్యాయత్నమని ఎవరికైనా అనుమానం కలగకమానదు. ఎమ్మెల్యేపై హత్య, హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఆ రాష్ట్ర అదనపు డీజీపీకి మాత్రం ఇది ప్రమాదంగానే కనబడుతోంది! ఏడేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో నిర్భయ ఉదంతం జరిగాక నేరగాళ్లకు కఠినమైన శిక్షలతో నిర్భయ చట్టం వచ్చింది. కానీ ఆచరణలో బాధిత కుటుంబాలకు న్యాయం ఎండమావే అవుతోందని ఉన్నావ్ ఉదంతం నిరూపిస్తోంది. ఎమ్మెల్యేపై వెనువెంటనే కేసు నమోదయ్యేలా, ఆయన అరెస్టయ్యేలా చర్యలు తీసుకోవడంలో యోగి సర్కారు మొదట్లో తాత్సారం చేయడంవల్లే ఇన్ని దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలిచ్చి బాధిత కుటుంబానికి రక్షణగా నిలవాలి. న్యాయం దక్కేలా చూడాలి. -
జై శ్రీరాం అనలేదని మదర్సా విద్యార్ధులపై దాడి
లక్నో : ఓ మదర్సాకు చెందిన నలుగురు విద్యార్ధులను జై శ్రీరాం అని నినదించలేదని కొందరు వ్యక్తులు చితకబాదిన ఘటన యూపీలోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. సివిల్ లైన్స్ ఏరియాలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మదర్సా విద్యార్ధులకు గాయాలయ్యాయి. విద్యార్ధులు క్రికెట్ ఆడుతుండగా వారిని నిందితులు బ్యాట్లు, కర్రలతో కొట్టారని పోలీసులు తెలిపారు. క్రికెట్ మ్యాచ్ సాగుతుండగా ఈ ఘటన జరిగిందని ఉన్నావ్ ఎస్పీ మాధవ్ ప్రసాద్ వర్మ వెల్లడించారు. నలుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మదర్సా నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. మరోవైపు విద్యార్ధులను జై శ్రీరాం నినాదాలు చేయాలని బలవంతం చేయలేదని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ పేర్కొనడం గమనార్హం. -
ఖైదీల వీరంగం : అధికారులపై వేటు
లక్నో : నాలుగు గోడల మధ్య బందీలుగా జైలు జీవితం గడపాల్సిన ఖైదీలు నానా హంగామా సృష్టించారు. యూపీలోని ఉన్నావ్ జైలులో కొందరు ఖైదీలు మద్యం సేవిస్తూ, బహిరంగ హెచ్చరికలు చేస్తూ..ఆయుధాలు చేపట్టిన వీడియోలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులను యూపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వీడియోలో నానా రచ్చ చేసిన ఖైదీలను వేరే జైళ్లకు బదలాయించారు. బహిర్గతమైన వీడియోల్లో ఓ ఖైదీ ఏకంగా తుపాకీని చూపుతూ ‘మీరట్ జైలు లేదా ఉన్నావ్ జైలు..జైలు ఏదైనా తాను ఇలాగే ఉంటానని, జైలు లోపల వెలుపల ఎవరినైనా హతమారుస్తా’ అంటూ రెచ్చిపోయాడు. మరో ఖైదీ హిందీ సినిమాలో డైలాగ్ వల్లెవేస్తూ తనపై ఏ ఒక్కరూ చర్య తీసుకునే ధైర్యం చేయబోరని చెప్పుకొచ్చాడు. తాను దేవ్ ప్రతాప్ సింగ్‌నని చెబుతూ అధికారులకే సవాల్ విసిరాడు. తనకు జైలు అంటే కార్యాలయమేనని, ఏ జైలులో అయినా తాను దర్జాగా బతికేస్తానని ఈ ఖైదీ చెప్పడం గమనార్హం. ఖైదీల వీరంగంపై యూపీ జైళ్ల మంత్రి జై కుమార్ సింగ్ స్పందిస్తూ ఈ ఉదంతంపై డీఐజీ విచారణకు ఆదేశించారని, నలుగురు అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైందని, వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేశామని చెప్పారు. వీడియోలో వీరంగం వేసిన ఇద్దరు ఖైదీలను వేరే జైళ్లకు తరలించామని వివరణ ఇచ్చారు. కాగా ఖైదీలు చూపిన తుపాకులు నిజమైనవి కావని అవి ఆటవస్తువులని జైలు అధికారులు పేర్కొన్నారు. -
15 మంది కోసమే మోదీ
లఖింపూర్ ఖేరి/ఉన్నావ్: ప్రధాని నరేంద్ర మోదీ 15 మంది ఎంపిక చేసిన వ్యక్తుల ప్రయోజనాలను మాత్రమే పరిరక్షించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, పేద ప్రజల ప్రయోజనాలను ఆయన విస్మరించారన్నారు. చెరకు రైతులు తమకు రావాల్సిన బకాయిలు అడిగితే, ఆ రైతుల వల్లనే షుగర్ వ్యాధి వచ్చిందని అన్నారని రాహుల్ మండిపడ్డారు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసినట్లుగా చెబుతారు. 2014లో మోదీ ఎన్నో హామీలు ఇచ్చి, మంచి రోజులని చెప్పి, హామీలను నెరవేర్చలేదని రాహుల్ విమర్శించారు. లఖింపూర్ ఖేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జాఫర్ అలీ నఖ్వీ తరఫున రాహుల్ ప్రచారం చేశారు. అనంతరం ఆయన ఉన్నావ్‌లోనూ ప్రచారంలో పాల్గొన్నారు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు ఉన్నాయని రాహుల్ మరోసారి ప్రస్తావించారు. ఒక్క విమానాన్ని కూడా తయారు చేసిన అనుభవం లేని అనిల్ అంబానీకి మోదీ 30 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును కట్టిబెట్టారనీ, బకాయిలు అడిగిన చెరకు రైతులను మాత్రం షుగర్ వ్యాధి మీ వల్లే వచ్చిందని అన్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తీసుకొస్తున్న కనీస ఆదాయ భద్రత పథకంతో నిరుపేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆదాయం ఉండేలా చూస్తామని కాంగ్రెస్ ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వేత్తలు, మేధావులతో సంప్రదించాకే ఈ పథకాన్ని ప్రకటించామనీ, దీని అమలు సాధ్యమేనని రాహుల్ తెలిపారు. మోదీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేస్తూ ప్రజల ముందు జిత్తులమారితనం పనిచేయదని అన్నారు. -
జవాన్ అంతిమయాత్రలో ఎంపీ అభ్యంతరకర ప్రవర్తన
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ అజిత్ కుమార్ అంతిమ యాత్ర సందర్భంగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగిన అజిత్ కుమార్‌కు కడసారి నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నావ్‌కు తరలిరాగా జవాన్ భౌతికకాయం ఉంచిన వాహనంపై స్ధానిక ఎంపీ సాక్షి మహరాజ్ వారందరికీ నవ్వుతూ అభివాదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు. కాగా, జవాన్ అంతిమయాత్రలో సాక్షి మహరాజ్ అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను మరికొందరు పోస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. సాక్షి మహరాజ్ జవాన్ అంతిమ యాత్రను అభినందన యాత్రగా పీలవుతున్నారని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్ర సంధించగా, బీజేపీ ఎంపీ చర్య సిగ్గుచేటని మరో యూజర్ మండిపడ్డారు. -
బాలికల రేపిస్టులకు మరణశిక్ష
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేందుకు వీలు కల్పించే కీలకమైన క్రిమినల్ లా (సవరణ) బిల్లు–2018ను బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో దోషులకు కఠిన శిక్షలు విధించేలా ఏప్రిల్ 21 తేదీన కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో రూపొందించిన ఈ బిల్లులో 12, 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలుండేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ‘12 ఏళ్లలోపు బాలికలపై రేప్‌నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి బతికినంత కాలం జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్‌రేప్ నిందితులకు జీవితాంతం జైలు. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష’ అమలవుతుంది’ అని చెప్పారు. ఈ కేసుల్లో దర్యాప్తు, విచారణ వేగంగా పూర్తయ్యేందుకు కూడా నిబంధనలున్నాయి. అత్యాచార కేసులన్నిటినీ రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూకహత్యల దోషులకు మరణ శిక్ష: మంత్రి మూకహత్యల కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ వెల్లడించారు. -
ఉన్నావ్‌లో 17 ఏళ్ల బాలిక సజీవ దహనం..
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా అచల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు నేహను అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడు సజీవ దహనం చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని చెప్పారు. గ్రామస్తులు బాలికను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా ప్రాధమిక దర్యాప్తులో ఈ ఘటన ఆత్మహత్యనే అనుమనాలు తలెత్తుతున్నాయని ఎస్పీ హరీష్ కుమార్ చెప్పారు. ప్రియుడితో సన్నిహిత సంబంధం నెరపుతున్న బాలిక అతడికి వేరొకరితో వివాహం కుదరడంతో నిరాశకులోనైన ఆత్మహత్యకు పాల్పడిఉండవచ్చని పేర్కొన్నారు. -
ఉన్నావ్ కేసు : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ చిక్కుల్లో పడ్డారు. కస్టడీలో బాధితురాలి తండ్రిని పోలీసులు హింసించిన రాత్రి ఎమ్మెల్యే తనకు పలుమార్లు ఫోన్ చేశారని మాఖీ పోలీస్ స్టేషన్ అధికారి కేపీ సింగ్ నిర్ధారించారు. బాధితురాలి తండ్రిని ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సింగ్ సెంగార్, ఇతరులు దారుణంగా కొట్టిన క్రమంలో అదే రోజు రాత్రి బాధితురాలి తండ్రిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చారని సీబీఐ విచారణలో సింగ్ చెప్పారు. ఆ రోజు రాత్రి ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కనీసం పదిసార్లు స్టేషన్ అధికారి సింగ్‌కు ఫోన్ చేసినట్టు కాల్ వివరాలు వెల్లడించాయని సీబీఐ నిర్ధారించింది. ఉన్నావ్ లైంగిక దాడి కేసులో బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించిన కేసుకు సంబంధించి కేపీ సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా సింగ్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. మరోవైపు కేసు పురోగతికి సంబంధించిన నివేదికను సబీఐ అలహాబాద్ హైకోర్టులో సమర్పించింది. మే 30న కేసుపై తదుపరి విచారణ చేపడతారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతిని ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడినట్టు ఎమ్మెల్యే సెంగార్‌పై ఆరోపణలున్న విషయం తెలిసిందే. బాధిత యువతి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట సజీవ దహనానికి ప్రయత్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
‘ఉన్నావ్’ నిందితుడికి సెక్యురిటీ కట్
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్‌కు సంబందించి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్ల బాలికను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడుగా ఉన్న కుల్దీప్సింగ్కు కేటాయించిన ‘వై’ కేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యేకు భద్రత కల్పిస్తున్న 11 మంది కమాండోలను ఉపసంహరించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కుల్దీప్ పై కిడ్నాపింగ్, చిన్నారులపై లైంగిక వేధింపుల చట్టం (పోస్కో), ఐపీసీ 164 సెక్షన్ కింద మూడు కేసులను సీబీఐ నమోదు చేసింది. నిందితుడిపై అత్యాచార ఆరోపణలు వచ్చానా, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆలాహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు యూపీ పోలీసులు కుల్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు సీబీఐ విచారణలో ఉంది. -
అత్యాచార బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు ?
నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా రోజు రోజుకి ఈ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అత్యాచార బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోతోంది. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులతో దేశవ్యాప్తంగా మహిళలు దోషులకు కఠిన శిక్షలు విధించాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని గళమెత్తుతున్నా పట్టించుకునే వారే లేరు. 2012 నిర్భయ ఘటనతో యావత్ భారతదేశం చలించిపోయింది. యువతీ యువకులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరో ఆడపిల్లకి ఇంత దుర్భర స్థితి రాకూడదని, అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కిరాతకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. కేసుల విచారణను కూడా త్వరితగతిని పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎన్ని చట్టాలు వచ్చినా తమను ఏం చేయలేవన్న ధీమా రేపిస్టుల్లో పెరిగిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. 2012 నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచార కేసులు 60 శాతం పెరిగితే, చిన్నారులపై రేప్ కేసులు 40 శాతం పెరిగాయి. అయితే 25శాతం కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2016 చివరి నాటికి లక్షా 33 వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నాటికి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అప్పట్నుంచి పెండింగ్ కేసుల సంఖ్య ప్రతీ ఏడాది 85 శాతం పెరుగుతూ వస్తోంది. 2012, 16 మధ్య నమోదైన వాటిలో మూడో వంతు కేసులు పోలీసు స్టేషన్ పరిధిలోనే నీరు కారిపోతున్నాయి. ఉన్నావ్ వంటి కేసుల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదైంది తప్పితే ఎంత ఘాతుకం జరిగినా పోలీసుల్లో కాస్త కూడా చలనం కనిపించడం లేదు. అత్యాచార కేసులపై రాజకీయ ప్రభావం ఉండడంతో వాటి అతీ గతీ ఎవరికీ పట్టడం లేదు. కేవలం అత్యాచార కేసుల పరిశీలన కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోలీసు అధికారుల నియామకానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయినా ఆ పోస్టుల్లో నాలుగో వంతు ఖాళీగానే ఉండడంతో చాలా కేసులు కోర్టు వరకూ కూడా చేరడం లేదు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ కేసుల విచారణకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసుల విచారణ ఇంత నత్తనడకన సాగుతూ ఉంటే ఎన్ని రకాలు చట్టాలు తీసుకువచ్చి ప్రయోజనమేముందనే అభిప్రాయం వ్యక్తం సర్వత్రా అవుతోంది. -
స్వాతి, షబ్బీర్‌లపై కేసుల్ని ఎత్తివేయాలి
హైదరాబాద్: కఠువా, ఉన్నావ్ ఘటనలకు నిరససగా కార్టూన్ వేసిన సీనియర్ జర్నలిస్ట్ స్వాతి వడ్లమూడిపై కేసు నమోదుచేయడాన్ని ఖండిస్తున్నట్లు ‘ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్’ సభ్యులు తెలిపారు. సమాజంలో జరిగే దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చేవారిపై కేసులు బనాయించడం భావప్రకటనా స్వేచ్ఛపై దాడిచేయడమేనని విమర్శించారు. ప్రస్తుతం ఈ రకమైన ప్రమాదకర ధోరణి దేశమంతా కొనసాగుతోందన్నారు. కఠువా, ఉన్నావ్ ఘటనలపై స్వాతి తన ఫేస్బుక్లో పోస్ట్చేసిన ఓ కార్టూన్‌పై హిందూ సంఘటన్ అనే సంస్థ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. స్వాతితో పాటు టైమ్స్ నౌ జర్నలిస్ట్ షబ్బీర్ అహ్మద్‌లపై నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని నర్సిం, శంకర్, మృత్యుంజయ, సుభానీ తదితర కార్టూనిస్టులు డిమాండ్ చేశారు. -
ప్రధాని మోదీకి మన్మోహన్ హితబోధ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ ఆలస్యంగా స్పందిచడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుబట్టారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగిన వెంటనే ఖండించకపోవడం వల్ల నేరస్తులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధాని మోదీని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడటం నాకు సంతోషంగా ఉంది. మౌనంగా ఉండకుండా తరచుగా మాట్లాడాలంటూ గతంలో నాకు ఇచ్చిన సలహాను ఆయన తప్పకుండా పాటించాలి. మౌనంగా ఉంటాననే కారణంగా పత్రికా ముఖంగా ఆయన నన్ను విమర్శించేవారు. ఇతరులకు సలహాలు ఇవ్వడమే కాదు. వాటిని తప్పక పాటించాలి’ అంటూ మన్మోహన్ సింగ్ హితబోధ చేశారు. కథువా ఘటన గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో నెటిజన్ల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ నోరు విప్పక తప్పలేదు. ‘నేరం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. మన ఆడబిడ్డలకు తప్పక న్యాయం జరుగతుందంటూ’ ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
లోపాలు సరిదిద్దితేనే అఘాయిత్యాలు ఆగుతాయి
లైంగిక నేరాల బాధితులకు న్యాయం చేయలేకపోతున్నది మనం ఒక్కరం మాత్రమే కాదు. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి ఉంది. అన్ని దేశాల్లోనూ బాధితులకుండే ఉమ్మడి సమస్య... ఆ నేరం జరిగిందని బయటికి చెప్పుకోలేకపోవడం. అందువల్లే అమెరికా వంటి దేశంలో కూడా వేయి నేరాలు జరుగుతుంటే సగటున 310 వెల్లడవుతాయి. ఇక శిక్షల శాతం మరింత తక్కువ. ఆ 310 మందిలో ఆరుగురికి మాత్రమే శిక్ష పడుతుంది. ప్రభుత్వాలు గట్టి సంకల్పంతో పనిచేసి భారీ మార్పులు చేస్తే ఈ స్థితి మారుతుంది. కథువా, ఉన్నావ్‌లలో జరిగిన ఉదంతాల విషయంలో ఒక సమాజంగా మనం ఎలా స్పందించాలి? ప్రపంచ దేశాల్లో లైంగిక హింస పరంగా చూస్తే ఆడవాళ్లకూ, పిల్లలకూ భారత్ అరక్షిత దేశమన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. వాస్తవం ఇది కాకపోయినా ఇది స్థిరపడింది. మనం ఎంత నిజాయితీగా ఉంటు న్నామో, ఎంత మారాల్సి ఉన్నదో విదేశీ మాధ్యమాలు చెప్పే స్థితి రాకూడదు. ఇలాంటి సిగ్గుమాలిన ఉదంతాలను మనమెందుకు నివారించలేకపోతున్నాం? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి తగ్గించగలుగుతాం? కేవలం న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ మాత్రమే వీటిని నివారించలేవని ముందుగా మనం తెలుసు కోవాలి. విలువలు విచ్ఛిన్నమయ్యాయి. మహిళల్ని, అల్పసంఖ్యాకుల్ని గౌరవించే చోట పశు ప్రవృత్తికి ప్రోత్సాహం ఉండదు. మనం అలాంటిచోటే ఉంటున్నామా? నిజాయితీగా చెప్పాలంటే జవాబేమిటో అందరికీ స్పష్టంగా తెలుసు. ప్రభుత్వమే ఇలాంటి హింసను అరికట్టాలనడం మనం మన పాత్రను విస్మరించడమే అవు తుంది. ఆ అవగాహనతో ఏం చేయమని ప్రభుత్వాన్ని ఒప్పించాలో చూద్దాం. లైంగిక దాడుల్ని, అత్యాచారాలను నియంత్రించడానికి ప్రధానంగా రెండు అవసరమవుతాయి. అందులో ఒకటి చట్టం. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ రేపిస్టులను ఉరి తీయాలన్న డిమాండ్ తరచూ వినిపిస్తుంటుంది. కఠినమైన శిక్ష ఉంటే ఈ తరహా నేరాల్ని నివారించవచ్చునని, నేరగాడు తన చర్య పర్యవసానా లను గ్రహించి భయపడతాడని, కనుక తప్పు చేయడానికి సాహసించడని ఈ వాదన లోని ఆంతర్యం. దీనికి అనేక ప్రతివాదాలున్నాయి. అత్యాచారానికైనా, హత్యకైనా ఒకటే శిక్ష గనుక సాక్ష్యం లేకుండా చేయడానికి బాధితురాలిని రేపిస్టు హతమారు స్తాడని దీన్ని వ్యతిరేకించేవారంటారు. దాన్ని కాసేపు పక్కన పెడదాం. రేపిస్టులకు ఉరిశిక్షే సరైందని రాజకీయ నాయకులు ఎక్కువగా చెబుతుంటారు. మీరు ఇటీవలి పత్రికలు తిరగేస్తే ఈ వాదన సమర్థుకులే అధికంగా కనిపిస్తారు. మన దేశంలో హంతకులకు మరణశిక్ష ఉంది. ఇది నివారణగా పనిచేసి హత్యలు ఆగుతున్నాయా? గణాంకాలు ఒకసారి చూద్దాం. 2016లో 136 మందికి న్యాయస్థానాలు ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా 30,000 హత్యలు జరిగాయి. మరణశిక్షల విధింపు హంతకులను తగ్గించలేకపోయింది. మన చట్టాల్లో అప్పీళ్లకూ, రెమిషన్లకూ అవకాశం ఉంది. అందుకే ఆ ఏడాది ఎవరూ ఉరికంబం ఎక్కలేదు. మరణశిక్ష మంత్ర దండమని భావించేవారంతా దీన్ని గమనించుకోవాలి. ఇప్పుడు లైంగిక నేరాలు, అత్యాచారాలకు సంబంధించిన గణాంకాలు చూద్దాం. ఆ సంవత్సరం దేశంలో మొత్తం 38,947 అత్యాచారాలు జరిగాయి. పిల్లలపై 1,06,000 నేరాలు జరిగాయి. అత్యాచారాల సంఖ్యతో వచ్చే ఇబ్బందే మంటే 99 శాతంమంది బాధితులు వాటిపై ఫిర్యాదు చేయరు. ప్రభుత్వ డేటాయే ఈ సంగతి చెబుతోంది. అమెరికాలో ప్రతి వెయ్యి అత్యాచారాలు, లైంగిక నేరాల్లో 310(31 శాతం) మాత్రమే పోలీసుల వరకూ వస్తాయి. అందులో కేవలం ఆరు గురు దోషులకు (అంటే 1 శాతం కన్నా తక్కువ) మాత్రమే శిక్షపడుతుంది. దీనర్ధం ఏమంటే... జరుగుతున్న నేరాల విషయంలో బాధితులకు న్యాయం చేయలేక పోతున్నది మనం ఒక్కరమే కాదు. కనుక ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన, గట్టిగా పనిచేయాల్సిన సంక్లిష్ట సమస్య అని మనం గుర్తించాలి. ఇందులో అనేకానేక అంశాలున్నాయి. అందులో కొన్ని సామాజికమైనవి, మరికొన్ని ప్రభుత్వం సరి దిద్దాల్సినవి. మన దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ లైంగిక నేరాల బాధితులకుండే ఉమ్మడి సమస్య– అది బాగా వ్యక్తిగతమైన నేరం. తమకు అలా జరిగిందని ఎవరితోనైనా చెప్పుకోవడం అంత సులభం కాదు. ఇక మన దేశానికే ప్రత్యేకమైన సామాజిక అంశాలు కోకొల్లలు. అందులో మన సమాజంలో మహిళల కుండే స్థానం, వారిపట్ల వ్యవహరించే తీరు ప్రధానమైనది. రెండోది– కుటుంబ పరువు, ప్రతిష్టలు మొత్తం వారి శరీరాల్లో ఉన్నాయనుకునే విశ్వాసం. మహిళపై దాడి జరిగితే అది ‘కోల్పోయినట్టే’నని మన భావన. పర్యవసానంగా తనకు జరి గిన అన్యాయాన్ని పోలీస్‌స్టేషన్‌లోని అపరిచితులకు చెప్పడం సంగతలా ఉంచి చివరకు తన కుటుంబానికి కూడా ఏ మహిళా వెల్లడించలేదు. పోలీసులు చేయగలిగింది ఒకటుంది–అది చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం. చట్టం ప్రకారం బాధితులెవరైనా తమకు నచ్చిన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్లో మాత్రమే ఫిర్యాదు చేయనవసరం లేదు. రెండు–బాధితురాలు తాను ఎంపిక చేసుకున్న భాషలో తన వాంగ్మూలాన్ని ఇవ్వొచ్చు. ఇది చాలా కష్టమైన సమస్య. ఎందుకంటే చాలా పోలీ స్స్టేషన్లలో ఇంగ్లిష్ కూడా సరిగా మాట్లాడలేనివారే ఉంటారు. వారు ఎఫ్ఐఆర్ను స్థానిక భాషలోనే రికార్డు చేస్తామంటారు. మూడు–బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా అధికారి మాత్రమే రికార్డు చేయాలి. ఇది జరగడం లేదు. తగినంతమంది మహిళా కానిస్టేబుళ్లు లేదా మహిళా పోలీసు అధికారులు లేకపోవడం ఇందుకు కారణం. ‘కనీస ప్రభుత్వం–గరిష్ట పాలన’ వంటి నినాదాలు అర్ధం లేనివి. ఎందు కంటే మనకున్న పోలీసులు, డాక్టర్లు, నర్సుల సంఖ్య ప్రపంచంలోని మరే ఇతర దేశాల తలసరి సగటు కన్నా చాలా తక్కువ. లైంగిక నేరాలను అరికట్టాలంటే మన సమాజంలో, మహిళలపట్ల వ్యవహరించే తీరులో భారీ మార్పులు తీసుకురావా లని వాస్తవాంశాలు చెబుతున్నాయి. లైంగిక హింసకు సంబంధించిన చట్టాల్లోని అంశాలను దేశంలోని పోలీస్స్టేషన్లన్నీ సక్రమంగా పాటించేలా చూడాలి. ఇది చాలా కష్టసాధ్యమైనదే. కానీ అలా చేయగలిగితే–కనీసం ఇతర ప్రపంచ దేశాలతో సమానంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదులు పెరిగాక వాటిపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలి. అందుకు వనరులు అవసరం. ఇప్పుడున్న పోలీసుల సంఖ్యతో, ఈ బడ్జెట్‌తో అది సాధ్యపడదు. అది చేస్తే శిక్షల సూచీ పెరుగుతుంది. ఇదంతా చాలా కష్టం. మన రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ సంగతి తెలుసు. కనుక ‘రేపిస్టులకు ఉరిశిక్ష వేయాలి’ అని వారు సులభంగా అంటుం టారు. హంతకులకు మరణశిక్ష విధిస్తున్నా హత్యలపై వాటి ప్రభావం లేదన్న వాస్తవం వారిని కలతపెట్టదు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
మోదీజీ..ఆడబిడ్డలకు న్యాయం ఎప్పుడు చేస్తారు?
-
ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ / అలహాబాద్ / చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసుల్లో కదలిక వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి(17)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు శుక్ర వారం అరెస్టు చేశారు. అలాగే పోలీసులు నమోదుచేసిన మూడు ఎఫ్ఐఆర్లను సీబీఐ అధికారులు రీరిజిస్టర్ చేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో మైనర్ బాలిక అసిఫా(8) హత్యాచారం కేసును సుప్రీంకోర్టు శుక్రవారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. చార్జ్‌షీట్‌ను దాఖలుచేయడానికి యత్నించిన పోలీసుల్ని న్యాయవాదులు అడ్డుకోవడంపై బార్ కౌన్సిళ్లకు నోటీసులు జారీచేసింది. అసిఫా కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి బెదిరింపులు రావడాన్ని ఈ సందర్భంగా కొందరు లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలాఉండగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మంత్రులు చందర్ ప్రకాశ్, లాల్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన సీబీఐ ఉన్నావ్‌లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ను తొలుత విచారణ నిమిత్తం శుక్రవారం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు సాయంత్రానికి అరెస్ట్ చేశారు. కుల్దీప్ను ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉన్నావ్ ఘటనలో దోషులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటుచేశామన్నారు. ‘కుల్దీప్ను వెంటనే అరెస్ట్ చేయండి’ ఉన్నావ్ ఘటనలో ప్రధాన నిందితుడు కుల్దీప్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని అంతకుముందు అలహాబాద్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కుల్దీప్ను సీబీఐ ప్రస్తుతం విచారిస్తోందని న్యాయవాది కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి డీబీ భోసలే, జస్టిస్ సునీత్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నిందితుడు బాధితులతో పాటు విచారణను ప్రభావితం చేయొచ్చనీ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని వ్యాఖ్యానించింది. విచారణపై నివేదికను మే2 లోగా సమర్పించాలని ఆదేశించింది. బార్ కౌన్సిళ్ల తీరుపై సుప్రీం ఆగ్రహం: కఠువా కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలుచేయకుండా న్యాయవాదులే అడ్డుకోవడంపై సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎంఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణ ప్రక్రియలో జోక్యం వల్ల బాధితులకు న్యాయం అందడం ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించింది. బాధితులు, నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాదుల్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో లాయర్ల ప్రవర్తనపై తమ స్పందనల్ని ఏప్రిల్ 19లోగా తెలియజేయాలని కఠువా జిల్లా బార్ అసోసియేషన్, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్, జమ్మూహైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తరఫున న్యాయవాది షోయబ్ ఆలమ్ వాదనలు వినిపిస్తూ.. పోలీసుల్ని అడ్డుకున్న న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు వెల్లడించారు. కఠువా ఘటనలో మృతురాలి వివరాలు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. -
ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ పోలీసు స్టేషన్లో పోలీసుల చిత్రహింసలకు 50 ఏళ్లు వద్ధుడు మరణించడంతో ఎన్నో విషాదాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితమే ఆ వృద్ధుడి 17 ఏళ్ల కూతురును భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారం చేశారన్న ఆరోపణలు వెలుగు చూశాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందే ఆ అమ్మాయి కుటుంబం సామూహికంగా ఆత్మాహుతికి ప్రయత్నిస్తే ఆ కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారి ఆత్మాహుతి ప్రయత్నానికి కారణమైన కుల్దీప్ సింగ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా పాత ఆయుధాల కేసును తవ్వితీసి ఆ అమ్మాయి తండ్రిని ఉన్నావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హత్యతో భయపడి పోయిన ఆయన కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డు మీదకు వచ్చారు. కుల్దీప్ సింగ్ తనపై చేసిన అత్యాచారం గురించి ఆ అమ్మాయి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసు చీఫ్‌ను ఆదేశించింది. మరోపక్క మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలయింది. అయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేరు. అమ్మాయి తండ్రిని పోలీసు స్టేషన్లో హత్య చేయడంలో హస్తం ఉందన్న ఆరోపణలపై కుల్దీప్ సింగ్ సోదరుడిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కూడా కుల్దీప్ సింగ్ స్పందించడం లేదు. ఈ సంఘటనలకు ముందే రాష్ట్రంలో మరో దారుణ హత్య జరిగింది. అదే న్యాయ వ్యవస్థ హత్య. బూటకపు ఎన్కౌంటర్లలో 40 మందిని పోలీసులు చంపేశారు. సంఘ వ్యతిరేక శక్తులను ఏరివేయడంలో ఇదే తమ పాలసీ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గర్వంగా ప్రకటించుకున్నారు. సంఘ వ్యతిరేక శక్తులంటే యోగి దృష్టిలో ఎవరో? నిమ్న వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్న శాసన సభ్యుడు నేరం రుజువైతే సంఘ వ్యతిరేక శక్తి కాదా ? మహిళకు రక్షణ కల్పించడమే తన ప్రభుత్వం ప్రాధాన్యత అని యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో ప్రకటించారు. యాంటీ రోమియో స్కాడ్లను ఏర్పాటు చేశారు. అవి నిజమైన ప్రేమికులను, భార్యాభర్తలను వేధిస్తుండడంతో వాటిని రద్దు చేశారు. ఈ ఏడాది కాలంలో మహిళలపై అత్యాచారాలు రెండింతలు పెరిగాయి. బూటకపు ఎన్కౌంటర్లలో మరణించిన వారిలో ఎక్కువ మంది మైనారిటీ, దళిత, ఓబీసీలే ఉన్నారు. వారే ఆయన దష్టిలో సంఘ వ్యతిరేక శక్తులా ? బూటకపు ఎన్కౌంటర్లకు రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తే లాకప్ డెత్‌లు జరగవా? నకిలీ ఎన్కౌంటర్లు పెరగవా? అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఈ నకిలీ ఎన్కౌంటర్లను ఉపయోగించుకోవా? యోగి హయాంలో ఇలాంటి హత్యలు, అత్యాచారాలు ఎన్ని వినాల్సి వస్తుందో! -
కలలో మాట.. బంగారం వేట!
నమ్మే పిచ్చోళ్లు ఉంటే.. నాపరాయిని చూపించి వజ్రం అన్నాడట వెనకటికొకడు. ఉత్తరప్రదేశ్ బంగారు వేట వ్యవహారం అచ్చం అలాగే ఉంది. మన దేశంలో బాబాలు, బతికున్న దేవుళ్లకు ఏమాత్రం కొదవలేదు. వాళ్లు చెప్పిన మాటలను పట్టుకుని నిప్పుల్లో దూకడం లాంటి పిచ్చిపనులు చేసేవాళ్లకు కూడా కొదవ లేదు. కానీ.. ఏకంగా ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కదిలిపోయి జీఎస్ఐ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని బంగారం ఉందంటూ తవ్వకాలు మొదలుపెట్టడం.. నిజంగా ఎంత పిచ్చిపనో అనిపిస్తుంది. వెయ్యి టన్నుల బంగారం ఉందని ఓసారి, 2,500 టన్నులు ఉందని ఇంకోసారి చెబుతూ స్వామి శోభన్ సర్కార్ జనాన్ని పిచ్చివాళ్లను చేస్తున్నాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు కూడా తమకు ఇక్కడేదో లోహం ఉందని చెప్పడం వల్లే తాము తవ్వకాలు చేస్తున్నట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అంటోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామంలో 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్ రామ్‌బక్ష్ సింగ్ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కలగన్నానని స్వామి శోభన్ సర్కార్ అనే సాధువు వెల్లడించడం దీనంతటికీ మూలం అయ్యింది. శుక్రవారం నుంచి ఆ కోటలో ఏఎస్ఐ బృందం తవ్వకాలు మొదలుపెట్టింది. అక్కడేం జరుగుతోందో చూసేందుకు జనం కట్టలు కట్టుకుని మరీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సాధువు కన్న కల నిజం కావాలని, ప్రతి జిల్లాలో ఓ బంగారు నిధి ఉండాలని అంటున్నారు!! కేవలం ఒక సాధువుకు వచ్చిన కలను పట్టుకుని, ఆయన చెప్పిన మాటల ఆధారంగా కోటలో తవ్వకాలు చేస్తున్న ప్రభుత్వం.. దానిమీద పెట్టే ఖర్చుతో ఎంతమందికి కూడు, గూడు, గుడ్డ లాంటివి అందించవచ్చో ఆలోచించడంలేదు. పైపెచ్చు, భూమిని తవ్వేందుకు పలుగులు, పారలతో సిబ్బంది బయల్దేరడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోనే ఫతేపూర్ జిల్లా ఆదాంపూర్ గ్రామంలో కూడా మరో 2,500 టన్నుల బంగారం ఉందని, అక్కడ తవ్వకాలకు కావాలంటే తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని సాధువు శోభన్ సర్కార్ చెబుతున్నారట. అసలాయనకు ఆ 10 లక్షలు ఎక్కడివో, దానికి ఇన్నాళ్లూ ఆదాయపు పన్ను కట్టారో లేదో తేలిస్తే ఇలాంటి కూతలు ఆగుతాయని భావిస్తున్నారు.