
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా అచల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు నేహను అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడు సజీవ దహనం చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని చెప్పారు. గ్రామస్తులు బాలికను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా ప్రాధమిక దర్యాప్తులో ఈ ఘటన ఆత్మహత్యనే అనుమనాలు తలెత్తుతున్నాయని ఎస్‌పీ హరీష్ కుమార్ చెప్పారు. ప్రియుడితో సన్నిహిత సంబంధం నెరపుతున్న బాలిక అతడికి వేరొకరితో వివాహం కుదరడంతో నిరాశకులోనైన ఆత్మహత్యకు పాల్పడిఉండవచ్చని పేర్కొన్నారు.