burn injuries
-
చేప చర్మం: కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్ అల్సర్లకు కూడా!
కాలిన గాయాలకు చేపల చర్మంతో చికిత్సతో మంచి ఫలితాలను సాధిస్తున్న వైనాన్ని గతంలో విన్నాం. అయితే ఈ విధానంపై కొనసాగుతున్న పరిశోధనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల చర్మం కాలిన గాయాలు మాత్రమే కాదు , డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో సహా వివిధ రకాల గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చికిత్సలో మంచి ఫలితానిస్తున్నాయి. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్మెంట్ రాయడం, బ్యాండేజ్ వేయడం, గాయాలు చీము పట్టకుండా పవర్ఫుల్ యాంటి బయోటిక్స్ వాడటం ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానం. అయితే బ్యాండేజ్ వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేప చర్మాన్ని బ్యాండేజ్ లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు బ్రెజిల్ వైద్యులు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన తొలి దేశంగా బ్రెజిల్ నిలిచింది. 2017నుంచి తిలపియా చేప చర్మం ద్వారా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి ద్వారా మంటకు ఉపశమనం లభించి, నొప్పి త్వరగా తగ్గుతుందట. అలాగే బయటినుంచి వచ్చే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. మంచినీటిలో పెరిగే చేపల చర్మంలో ఇన్ఫెక్షన్లను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా గాయం తొందరగా మానుతుందని అంటున్నారు. అలాగే ఈ పద్ధతిలో ప్రతీ రోజు బ్యాండేజ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధానంలో సెకండ్ డిగ్రీ తీవ్రాతి తీవ్రమైన కాలిన గాయాలు కూడా సగటున 9-11 రోజుల్లో నయమవుతున్నాయి. దీనికి సంబంధించి జంతువులపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. 2021లో కెరెసిస్ కంపెనీకి చెందిన ఇన్ఫ్లాంటబుల్ఫిష్ స్కిన్ ఉత్పత్తులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా చేపల చర్మంతో ఇలాంటి ఉత్పత్తులను తయారీకి అనుమతి ఉన్న ఏకైక కంపెనీ కెరెసిస్. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ను ప్లాస్టిక్, రికన్స్ట్రక్టివ్ సర్జరీలలో వాడవచ్చని కూడా అంటున్నారు. అంతేకాదు ఇది డయాబెటిస్ కారణంగా వచ్చే పుండ్లను కూడా మాన్పుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. Did you know? Fish skin has shown anti-inflammatory and anti-bacterial properties that support and improve healing in a variety of wounds including burns and diabetic foot ulcers. Ongoing research is exploring this vs alternative techniques.pic.twitter.com/ggEI6f1WPP — Massimo (@Rainmaker1973) March 3, 2024 -
నిజమైన ప్రేమ ముందు..విధిసైతం తలవంచింది
అన్ని అనుకున్నట్లు జరిగిపోవు. ఒక్కోసారి ఏవిధంగా ప్రమాదం ముంచుకొస్తుందో కూడా తెలియదు. ఒకవేళ మనం మళ్లీ కోలుకోలేనంత ప్రమాదంలో చిక్కుకుపోయి ఆగమ్యం గోచరంలా మన జీవితం ఉన్నప్పుడే.. మన వాళ్లేవరో మనకు తెలుస్తుంది. ఆ సమయంలోనే ఎవరు మనవాళ్లో తెలుస్తుంది. మన కోసం తపించే వాళ్లెవరో అర్థమవుతుంది. అలాంటి ఘటనే ఓ వ్యక్తి లైఫ్‌లో చోటు చేసుకుంది. ఇరాన్‌కి చెందిన ప్రిస్టన్ కాబ్కి సెప్టెంబర్ 2022 తనేషా అనే ఆమెతో యంగేజ్మెంట్ అయ్యింది. జులై 22, 2023లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఇంకా ఒక్క నెలలో పెళ్లి ఉందనంగా అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు ప్రిస్టన్. సరిగ్గా ప్రిస్టన్ విధి నిర్వహణలో ఉండగా సడెన్‌గా ఫ్యాక్టరీలో కెమికల్ వెదచెంది.. అతనిపై పడిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో కెమికల్ దాదాపు 1500ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉంది. ఆ దుర్ఘటనలో ప్రిస్టన్ శరీరీం సుమారు 32 శాతం కాలిపోయింది. మోచేతి చర్మం తన కళ్ల ముందే ఊడిపోయి ఎముకలు రావడం చూశాడు. ఇక ఆ రోజుతో తన జీవితం ముగిసిపోయిందనకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ప్రిస్టన్‌కి తెలియదు. కళ్లు తెరిచి చూసేటప్పటికీ ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాడు. గాయాలు చాలా తీవ్రంగా అవ్వడంతో అతడిని ఆస్పత్రికి విమానంలో తరలించారు అధికారులు. ఆ ప్రమాదంలో ప్రిస్టన్ కాలి వేళ్లలో తొమ్మదిటిని, కుడి చేతి నాలుగు వేళ్లు, ఎడమ చేతి నేలుగువేళ్లను కోల్పయాడు. ఇక తనని తనేషా పెళ్లి చేసుకోదని అనుకున్నాడు. అసలు ఆ ఆలోచన తనలోకి రాకూడదని స్ట్రాంగ్‌గా అనుకున్నాడు. సడెన్‌గా ఆస్పత్రిలో ఉండే ఓ నర్సు వచ్చి కంగ్రాట్స్ మీరు అనుకున్న తేదినే పెళ్లి చేసుకుంటున్నారు అని చెబుతుంది. ఒక్కసారిగా ప్రిస్టన్‌కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. తనేషా ఆస్ప్రతి యాజమాన్యంతో మాట్లాడి ప్రిస్టన్ ట్రీట్మెంట్ తీసుకున్న రూమ్‌నే వెడ్డింగ్ రూమ్‌గా మార్చేస్తుంది. అక్కడే అతడిని పెళ్లి చేసుకోవాలనే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. ఆమె అనుక్నునట్లుగా అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసుకుంది. ప్రిస్టన్ సర్ప్రైజ్ చేస్తూ..నిన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను ఏది ఆపలేదు అని ప్రిస్టన్తో భావోద్వేగంగా చెబుతోంది. ఇంత ప్రతికూలత నుంచి మృత్యుంజయుడివై బయటకు వచ్చినందుకు ఇదే నేను నీకు ఇచ్చే విలువైన గిఫ్ట్ అని సంతోషంతో ముంచెత్తుంది. ఆ జంటను కుటుంబ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి సమస్యలు ఎదురైనా..ఇదే స్ఫూర్తితో ఇద్దరు కలసి ఎదుర్కొండి అని ఆశ్వీరదించారు. (చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..) -
Napalm girl: మానని గాయంతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది
తెలిసీ తెలియని వయసు.. తోటి చిన్నారులతో ఆడిపాడే సమయంలోనే కొండంత కష్టం వచ్చి పడింది. ఒక యుద్ధం.. ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేయడమే కాదు.. ఐదు దశాబ్దాల తర్వాత మానని గాయాలతో ఆమెకు నిత్య నరకం చూపిస్తోంది కూడా. వియత్నాం వార్ ద్వారా చరిత్రలో నిలిచిన పోయిన నాపామ్ గర్ల్ కథ(వ్యథ) ఇది.. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి.. ఇంటి పక్కన స్నేహితులతో సరదాగా ఆడుకుంటోంది. పారిపోండి.. పరిగెత్తండి అంటూ మిలిటరీ దుస్తుల్లో ఉన్న కొందరి హెచ్చరికలు వాళ్ల చెవినపడ్డాయి. అంతా కలిసి పరుగులు తీశారు. ఇంతలో వాళ్లు ఉన్న ప్రాంతంలో ఓ బాంబు పైనుంచి వచ్చి పడింది. మిగతా పిల్లలంతా ఏడుస్తూ తలోదిక్కు పారిపోతుంటే.. ఆ చిన్నారి మాత్రం దుస్తులు మంటల్లో కాలిపోయి.. బట్టల్లేకుండా రోదిస్తూ గాయాలతో రోడ్డు వెంట పరుగులు తీసింది. జూన్ 8, 1972.. టే నిహ్ ప్రావిన్స్ ట్రాంగ్ బ్యాంగ్ వద్ద జరిగిన ఈ ఘటన.. ఒక ఐకానిక్ ఫొటో ద్వారా చరిత్రలో నిలిచిపోయింది. నాపామ్ గర్ల్.. సుప్రసిద్ధ ఫొటో. వియత్నాం యుద్ధంలో అమెరికా ఫైటర్ జెట్లు నాపామ్ బాంబులు సంధించడంతో.. కాలిన గాయాలతో బట్టలు లేకుండా వీధుల వెంట పరిగెత్తింది ఆ చిన్నారి. వీపు, భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెకి. అయితే ఆ గాయాలకు యాభై ఏళ్ల తర్వాత చికిత్స అందుకుంటోంది. నాపామ్ గర్ల్ అసలు పేరు కిమ్ ఫుసీ ఫాన్ టి. గత ఏడాదిగా ఆమె ఆస్పత్రిలోనే.. పదిహేడు సర్జరీల ద్వారా ట్రీట్మెంట్ అందుకుంది. కానీ, ఆమె గాయాలు మానాలంటే.. మరో పదేళ్లపాటు కూడా ఆమెకి మరిన్ని సర్జరీలు అవసరం. అంటే.. ఆమె ఈ నరకం మరిన్ని సంవత్సరాలు తప్పదన్నమాట. ఫాన్ తి.. పుట్టింది ఏప్రిల్ 6, 1963లో. ఆ ఘటన తర్వాత ఆమె జీవితం.. వివాదాలు, ఆంక్షల నడుమే నడుస్తోంది. చేసేది లేకచివరికి.. ఆమె తన భర్తతో పాటు 1992లో కెనడాకు ఆశ్రయం మీద వెళ్లారు. 2015లో ఆమె ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జిల్ వాయిబెల్‌ను కలసుకుంది. ఆమె కథ తెలిసిన వాయ్‌బెల్ ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం మియామిలో కిమ్ ఫుసీ ఫాన్ తి.. చివరి దశ చికిత్స అందుకుంటోంది. ఇప్పుడు తాను వియత్నాం యుద్ధ బాధితురాలిని కాదని, తనకు ఇద్దరు బిడ్డలు.. మనవరాళ్లు ఉన్నారని, తనను ఇప్పుడు నాపామ్ గర్ల్ అని పిలవొద్దని.. శాంతి స్థాపన కోసం పాడుపడుతున్న ఒక ఉద్యమకారణిని అని చెప్తోందామె. వియత్నాం-అమెరికన్ ఫొటోగ్రాఫర్ నిక్ ఉట్ అనే ఫొటో జర్నలిస్ట్.. నాపామ్ గర్ల్ ఫొటోకు గానూ ఫులిట్జర్ అందుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ ఫొటోపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే.. ఉట్ మాత్రం ఆ ఫొటో వియత్నాం యుద్ధానికి సిసలైన నిదర్శనమని ప్రకటించారు. -
లెక్చరర్‌కు నిప్పంటించాడు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిపై ఒక దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన సోమవారం వార్ధా జిల్లాలోని హింగణ్ఘాట్లో జరిగింది. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అంకితని వివాహితుడైన వికేశ్ నగ్రాలె గత కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కాలేజీకి బయల్దేరిన యువతిని సోమవారం ఉదయం నందోరి చౌక్ వద్ద అడ్డగించిన వికేశ్.. అకస్మాత్తుగా ఆమె తలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. 40శాతం కాలిన గాయాలైన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న ఆ యువతిని వెంటనే రక్షించకపోవడంపై, పైగా.. కొందరు ఈ ఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతామని హోంమంత్రి అనిల్ ప్రకటించారు. బాధితురాలు, నిందితుడు వికేశ్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. రెండేళ్ల క్రితం వరకూ ఇద్దరూ స్నేహితులేనని, వేధింపుల వల్ల ఇప్పుడు ఆమె స్నేహంచేయట్లేదని ఇన్స్పెక్టర్ సత్యవీర్ తెలిపారు. వికేశ్కు 9 నెలల బాబు ఉన్నాడన్నారు. వికేశ్ కారణంగా గత సంవత్సరం ఆమె వివాహం విచ్ఛిన్నమైందని బాధితురాలి సోదరుడు శుభమ్ తెలిపారు. -
కోడిగుడ్డు అడిగాడని నాలుగేళ్ల బాలుడిపై..
కోల్‌కతా : అల్పాహారంలో అదనంగా మరో ఎగ్ ఇవ్వాలని అడిగిన నాలుగేళ్ల బాలుడిపై వేడి కిచిడీతో కాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాద్గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఈ దారుణం వెలుగుచూసింది. కోడిగుడ్డు అడిగాడనే కోపంతో బాలుడి దుస్తులు తొలగించి మహిళా సిబ్బంది ఒకరు అతనిపై పొగలు కక్కుతున్న కిచిడీని వేయడంతో బాలుడి కాళ్లు, తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాలుడిని జంగీపూర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడిపై కిచిడీ పోసిన మహిళా ఉద్యోగినిని సెహరి బవాగా గుర్తించారు. ఘటన అనంతరం ఆమె పరారీలో ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. -
ఉన్నావ్‌లో 17 ఏళ్ల బాలిక సజీవ దహనం..
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా అచల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు నేహను అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడు సజీవ దహనం చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని చెప్పారు. గ్రామస్తులు బాలికను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా ప్రాధమిక దర్యాప్తులో ఈ ఘటన ఆత్మహత్యనే అనుమనాలు తలెత్తుతున్నాయని ఎస్పీ హరీష్ కుమార్ చెప్పారు. ప్రియుడితో సన్నిహిత సంబంధం నెరపుతున్న బాలిక అతడికి వేరొకరితో వివాహం కుదరడంతో నిరాశకులోనైన ఆత్మహత్యకు పాల్పడిఉండవచ్చని పేర్కొన్నారు. -
భార్యపై అనుమానంతో..
న్యూఢిల్లీ : కట్టుకున్న భార్యని కడతేర్చాలని చూశాడో భర్త. భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రితేశ్ అనే వ్యక్తికి నిషాతో వివాహమైంది. అయితే నిషాకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన రితేశ్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన ఆమె నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఆమెపై పగ పెంచుకున్న రితేశ్ ఎలాగైనా ఆమెను హత్య చేయాలని భావించాడు. అదును చూసుకుని ఆమె ఇంటికి వెళ్లి.. నిద్రిస్తున్న సమయంలో యాసిడ్‌తో దాడి చేశాడు. ఆ సమయంలో నిషా పక్కనే పడుకున్న మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. 45 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న నిషాను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రితేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రితేశ్ గతంలో పలు చోరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అంత్యక్రియలు చేసిన తర్వాత తిరిగొచ్చింది
నోయిడా : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు నోయిడాకు చెందిన రాజ్, సర్వేశ్ సక్సేనా దంపతులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు రాజ్, సర్వేశ్లు చెప్పిన పోలికలతో కూడిన ఒక అమ్మాయి శవం దొరికింది. వెంటనే వారిద్దరినీ పిలిపించి శవాన్ని గుర్తించాల్సిందిగా కోరారు. ముఖం పూర్తిగా కాలిపోవడం.. శవం కాళ్లూ, చేతులు తమ కూతురు నీతూ లాగే ఉండటంతో ఆ శవం తమ కూతురిదే అనే నిర్ధారణకు వచ్చారు. దాంతో ఆ శవాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అంతేకాకుండా తమ కూతురు చావుకు కారణం ఆమె భర్త రామ్ లక్ష్మణ్ అని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రామ్ లక్ష్మణ్‌ని, అతడి తండ్రిని విచారించిన పోలీసులకు వారు చెప్పింది నిజమనే అన్పించింది. దీంతో వారు మరో కోణంలో విచారణ మొదలుపెట్టారు. విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీతూ అసలు మరణించలేదని, ఆరోజు ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది వేరొకరి శవమని గుర్తించారు. మరి నీతూ ఎక్కడుంది..! భర్తతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న నీతూ(25) వారితో గొడవ కావడంతో ఏప్రిల్ 6న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో నీతూ మరణించలేదని తెలుసుకున్న పోలీసులు ఆమెను వెదికేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నీతూ తల్లిదండ్రులు నిర్వహిస్తున్న కూరగాయల దుకాణానికి తరచుగా వచ్చే వారి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ప్రవర్తనతో విసుగు చెందిన నీతూ.. తమ దుకాణానికి వచ్చే పూరన్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయమై నీతూ తల్లిదండ్రులు పూరన్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా కోరగా.. తన ఇష్టప్రకారమే అతడితో వెళ్లానని నీతూ చెప్పడంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. దీంతో మే 2న నీతూను తీసుకువచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఎన్నో అనుమానాలు.. నీతూ ఆచూకీ ఎక్కడ, ఎప్పుడు లభించిందనే వివరాల గురించి పోలీసులు స్పష్టంగా తెలియజేయక పోవడం.. నీతూ తల్లిదండ్రులకు శవాన్ని అప్పగించిన సమయంలో డీఎన్ఏ పరీక్ష చేయమని వారు కోరినప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే నీతూ విషయంలో ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు నీతూ తల్లిదండ్రులకు అప్పగించిన శవం ఎవరిదో తెలియాల్సి ఉంది. -
కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స
-
కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స
బ్రెసీలియా: కాలిన గాయాలకు చికిత్స చేయడంలో బ్రెజిల్ డాక్టర్లు కొత్త థెరపీకి తెరతీశారు. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్మెంట్లను పూసి, బ్యాండేజ్వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేపల చర్మాన్ని బ్యాండేజ్లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేయడమే తమ దేశంలోనే మొదటిసారని వారు చెబుతున్నారు. బ్రెజిల్‌లోని రూసాస్ నగరంలోని కాసా వెల్హా రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న మారియా క్యాండిడో డా సిల్వా 20 రోజుల క్రితం రెస్టారెంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ చేతికి, గొంతుకు, ముఖంలో కొంత భాగానికి సెకండ్ డిగ్రీ గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటను తట్టుకోలేకపోతున్నానంటూ , మంట తగ్గడానికి ఏదో ఒకటి చేయమని ఆమె డాక్టర్లను వేడుకుంది. చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి అమల్లోకి తీసుకొస్తున్నామని, దాన్ని ఉపయోగిస్తే నొప్పి త్వరగా తగ్గుతుందని డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చి అలాగే చేశారు. ‘చేప చర్మాన్ని కాలిన గాయాలకు బ్యాండేజ్లాగా వేయడంలో గాయాలు చల్లబడ్డాయి. కాసేపటికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత రెండు, మూడు రోజులకోసారి వెళ్లి బ్యాండేజ్ మార్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు మొత్తం గాయాలు తగ్గాయి’ అని మారియా మీడియాకు వివరించారు. మంచినీటిలో పెరిగే చేపల చర్మలో ఇన్ఫెక్షన్ను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. బ్రెజిల్లో మంచినీటి చేపలే ఎక్కువ దొరుకుతాయని, దేశంలో 90 శాతం మంది ప్రజలు చేపల చర్మాన్ని చెత్తలో పడేస్తారని, దానికి బదులుగా ఆస్పత్రులకు విరాళంగా అందజేస్తే కాలిన గాయాలకు ఉపయోగించవచ్చని వారు చెప్పారు. సియరా ఫెడరల్ యూనివర్శిటీకి చెందిన మందుల అభివద్ధి, పరిశోధనా శాలలో డాక్టర్ ఒడ్రికో మొరాయెస్, ప్రొఫెసర్ ఎలిసాబెట్ మొరాయెస్, డాక్టర్ అనా పావులా నెగ్రిరాస్ నాయకత్వంలోని నిపుణుల బందం రెండేళ్లపాటు కషి చేసి చేప చర్మంతో కాలిన గాయాలకు చికిత్సచేసే విధానాన్ని అభివద్ధి చేశారు. గత 30 రోజుల్లోనే దాదాపు 50 మంది కాలిన గాయాలకు చికిత్స అందించామని డాక్టర్లు తెలిపారు. -
మైనర్ బాలిక పై యాసిడ్ దాడి
ఫరీదాబాద్: 17 ఏళ్ల బాలిక పై యాసిడ్‌తో దాడి చేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన హర్యానాలో బల్లబ్ఘర్లోని ఆదర్శనగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు...బాలిక తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు మార్కెట్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బాలిక మొఖం పై యాసిడ్ తో దాడి చేశాడు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తిని బాలిక చూడలేకపోయిందని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన తర్వాత క్షణాల్లోనే దుండగుడు అక్కడినుంచి తప్పించుకు పోయాడన్నారు. ప్రస్తుతం బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు..
కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు. ముగ్గురు స్నేహితులు రాకేశ్, బాబర్, ఆనంద్‌లు శనివారం రాత్రి ఘర్షణ పడ్డారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వారిని మందలించి పంపించేశారు. మళ్లీ గంట తర్వాత ముగ్గురు ఒకే చోట చేరుకోగా, ఆనంద్(25) పై మిగిలిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నిందితుడు బాబర్‌ను పోలీసులలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో నిందితుడు రాకేశ్ పరారీలో ఉన్నాడు. -
ప్యాంటు జేబులో పేలిన ఐఫోన్.. బాలికకు గాయాలు
ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐఫోన్ ఒక్కసారిగా పేలి.. అంటుకోవడంతో అమెరికాలో ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ఆమె తరగతి గదిలో ఉండగా ఈ సంఘటన జరిగింది. ఆమెకు తొడ మీద, వీపు మీద కాలిన గాయాలయ్యాయి. మైనె ప్రాంతంలోని కెన్నెబంక్స్ మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తాను వేసుకున్న ప్యాంటు కాలిపోతోందని ఆమె చెప్పడంతో వెంటనే ముందు క్లాసులోని పిల్లలందరినీ బయటకు పంపేశారు. తర్వాత ఆమె కింద కూర్చుండిపోయిందని పాఠశాల ప్రిన్సిపల్ జెఫ్రీ రాడ్‌మన్ తెలిపారు. ఆమె వెంటే గదిలో ఓ మూలకు వెళ్లిపోయి ప్యాంటు తీసేసిందని, ముందుగా స్కూల్లో ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్యాంటు మీద చాలా చిరుగులు పడ్డాయని, తరగతి గది అంతా విపరీతంగా పొగ చూరిపోవడంతో కిటికీలు కూడా తెరిచామని వివరించారు. ఫోన్ ఎందుకు పేలిందన్న విషయాన్ని ఆ రాష్ట్ర ఫైర్ మార్షల్ దర్యాప్తు చేస్తున్నారు. -
చేతులు కాల్చుకున్న రితేష్ దేశ్‌ముఖ్
జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్‌కు చేతులు కాలాయి. అయితే, ఇది వంట చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం మాత్రం కాదు. బంగిస్థాన్ అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా చిన్నపాటి ప్రమాదం సంభవించడంతో ఆయన చేతులు కాలాయి. ఈ విషయాన్ని స్వయంగా రితేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. సినిమాలో నటించేటప్పుడు సహజత్వం రావాలంటే ఇలాంటి సాహసాలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఇటీవలి కాలంలో చాలామంది హీరోలు సహజంగా కనిపించడం కోసం ఫైట్లలో కూడా సాహసాలు చేస్తున్నారు. 2015లో విడుదల కానున్న కామెడీ చిత్రం బంగిస్థాన్లో రితేష్ దేశ్ముఖ్తో పాటు పులకిత్ సమ్రాట్ కూడా నటిస్తున్నాడు. దీనికి కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ ప్రత్యేక గీతంలో కనిపిస్తారు. సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సినిమాలో ఆమె పాట హిట్టవడంతో ఇప్పుడు బంగిస్థాన్లోనూ నర్తిస్తోంది. -
నిద్రలోనే సజీవ దహనమైన వ్యక్తి