ప్రతీకాత్మకచిత్రం
కోల్‌కతా : అల్పాహారంలో అదనంగా మరో ఎగ్ ఇవ్వాలని అడిగిన నాలుగేళ్ల బాలుడిపై వేడి కిచిడీతో కాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాద్‌గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఈ దారుణం వెలుగుచూసింది. కోడిగుడ్డు అడిగాడనే కోపంతో బాలుడి దుస్తులు తొలగించి మహిళా సిబ్బంది ఒకరు అతనిపై పొగలు కక్కుతున్న కిచిడీని వేయడంతో బాలుడి కాళ్లు, తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం బాలుడిని జంగీపూర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడిపై కిచిడీ పోసిన మహిళా ఉద్యోగినిని సెహరి బవాగా గుర్తించారు. ఘటన అనంతరం ఆమె పరారీలో ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment