కాలిన గాయాలకు చేపల చర్మంతో చికిత్సతో మంచి ఫలితాలను సాధిస్తున్న వైనాన్ని గతంలో విన్నాం. అయితే ఈ విధానంపై కొనసాగుతున్న పరిశోధనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల చర్మం కాలిన గాయాలు మాత్రమే కాదు , డయాబెటిక్ ఫుట్ అల్సర్‌లతో సహా వివిధ రకాల గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చికిత్సలో మంచి ఫలితానిస్తున్నాయి.
కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్‌మెంట్ రాయడం, బ్యాండేజ్ వేయడం, గాయాలు చీము పట్టకుండా పవర్‌ఫుల్ యాంటి బయోటిక్స్ వాడటం ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానం. అయితే బ్యాండేజ్ వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేప చర్మాన్ని బ్యాండేజ్ లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు బ్రెజిల్ వైద్యులు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన తొలి దేశంగా బ్రెజిల్ నిలిచింది. 2017నుంచి తిలపియా చేప చర్మం ద్వారా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి ద్వారా మంటకు ఉపశమనం లభించి, నొప్పి త్వరగా తగ్గుతుందట. అలాగే బయటినుంచి వచ్చే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. మంచినీటిలో పెరిగే చేపల చర్మంలో ఇన్ఫెక్షన్లను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా గాయం తొందరగా మానుతుందని అంటున్నారు. అలాగే ఈ పద్ధతిలో ప్రతీ రోజు బ్యాండేజ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు.
ఈ విధానంలో సెకండ్ డిగ్రీ తీవ్రాతి తీవ్రమైన కాలిన గాయాలు కూడా సగటున 9-11 రోజుల్లో నయమవుతున్నాయి. దీనికి సంబంధించి జంతువులపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. 2021లో కెరెసిస్ కంపెనీకి చెందిన ఇన్‌ఫ్లాంటబుల్‌ఫిష్ స్కిన్ ఉత్పత్తులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా చేపల చర్మంతో ఇలాంటి ఉత్పత్తులను తయారీకి అనుమతి ఉన్న ఏకైక కంపెనీ కెరెసిస్.
ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ను ప్లాస్టిక్, రికన్‌స్ట్రక్టివ్ సర్జరీలలో వాడవచ్చని కూడా అంటున్నారు. అంతేకాదు ఇది డయాబెటిస్ కారణంగా వచ్చే పుండ్లను కూడా మాన్పుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం.
Did you know?
— Massimo (@Rainmaker1973) March 3, 2024
Fish skin has shown anti-inflammatory and anti-bacterial properties that support and improve healing in a variety of wounds including burns and diabetic foot ulcers.
Ongoing research is exploring this vs alternative techniques.pic.twitter.com/ggEI6f1WPP
Comments
Please login to add a commentAdd a comment