Diabetic Wounds
-
చేప చర్మం: కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్ అల్సర్లకు కూడా!
కాలిన గాయాలకు చేపల చర్మంతో చికిత్సతో మంచి ఫలితాలను సాధిస్తున్న వైనాన్ని గతంలో విన్నాం. అయితే ఈ విధానంపై కొనసాగుతున్న పరిశోధనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల చర్మం కాలిన గాయాలు మాత్రమే కాదు , డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో సహా వివిధ రకాల గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చికిత్సలో మంచి ఫలితానిస్తున్నాయి. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్మెంట్ రాయడం, బ్యాండేజ్ వేయడం, గాయాలు చీము పట్టకుండా పవర్ఫుల్ యాంటి బయోటిక్స్ వాడటం ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానం. అయితే బ్యాండేజ్ వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేప చర్మాన్ని బ్యాండేజ్ లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు బ్రెజిల్ వైద్యులు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన తొలి దేశంగా బ్రెజిల్ నిలిచింది. 2017నుంచి తిలపియా చేప చర్మం ద్వారా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి ద్వారా మంటకు ఉపశమనం లభించి, నొప్పి త్వరగా తగ్గుతుందట. అలాగే బయటినుంచి వచ్చే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. మంచినీటిలో పెరిగే చేపల చర్మంలో ఇన్ఫెక్షన్లను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా గాయం తొందరగా మానుతుందని అంటున్నారు. అలాగే ఈ పద్ధతిలో ప్రతీ రోజు బ్యాండేజ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధానంలో సెకండ్ డిగ్రీ తీవ్రాతి తీవ్రమైన కాలిన గాయాలు కూడా సగటున 9-11 రోజుల్లో నయమవుతున్నాయి. దీనికి సంబంధించి జంతువులపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. 2021లో కెరెసిస్ కంపెనీకి చెందిన ఇన్ఫ్లాంటబుల్ఫిష్ స్కిన్ ఉత్పత్తులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా చేపల చర్మంతో ఇలాంటి ఉత్పత్తులను తయారీకి అనుమతి ఉన్న ఏకైక కంపెనీ కెరెసిస్. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ను ప్లాస్టిక్, రికన్స్ట్రక్టివ్ సర్జరీలలో వాడవచ్చని కూడా అంటున్నారు. అంతేకాదు ఇది డయాబెటిస్ కారణంగా వచ్చే పుండ్లను కూడా మాన్పుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. Did you know? Fish skin has shown anti-inflammatory and anti-bacterial properties that support and improve healing in a variety of wounds including burns and diabetic foot ulcers. Ongoing research is exploring this vs alternative techniques.pic.twitter.com/ggEI6f1WPP — Massimo (@Rainmaker1973) March 3, 2024 -
షుగర్ పేషెంట్లకు భారీ ఊరట: మూడు రెట్ల సమర్ధతతో కొత్త మాగ్నటిక్ జెల్
Magnetic gel చర్మంపై ఏర్పడే తీవ్రమైన పుండ్ల చికిత్సలో కీలక అధ్యయనం ఒకటి భారీ ఊరటనిస్తోంది. కాలిన గాయాలు, చర్మంపై మానని గాయాలు, ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మధుమేహంతో బాధపడుతున్న వారిలో అల్సర్లు నెమ్మదిగా నయం అవుతాయి. ఒక్కోసారి శరీర భాగాలను తొలగించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ మాగ్నటిక్ జెల్‌ను రూపొందించింది. ఇది మృత చర్మకణాల చికిత్సలో మూడు రెట్లు సమర్ధ వంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. కాలిన గాయాలు,డయాబెటిక్, నాన్-డయాబెటిక్, తదితర దీర్ఘకాలిక అల్సర్ల చికిత్సలో మూడు రెట్లుగా మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయన వేత్తలు తేల్చారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో జెల్ చికిత్స స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్‌ల వృద్ధి రేటును సుమారు 240 శాతం పెంచింది అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి రేటును రెట్టింపు చేసింది. ఈ జెల్ కెరాటినోసైట్లు , ఇతర కణాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచిందని, తద్వారా గాయపడిన ప్రదేశంలో కొత్త రక్తనాళాల పెరుగుదలకు తోడ్పడిందని వెల్లడించింది. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సన్ యాట్-సేన్ యూనివర్శిటీ, వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. (గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!) "వైర్లెస్ మాగ్నెటిక్ -రెస్పాన్సివ్ హైడ్రోజెల్ చర్మపై గాయాల్ని నయం చేయడంలో ప్రాథమిక సవాళ్లను అధిగమించిదని పరిశోధన వేత్త డాక్టర్ షౌ యుఫెంగ్ తెలిపారు. ఈ మాగ్నటిక్ జెల్‌ను గాయానికి నేరుగా బ్యాండేజ్‌లో అమరుస్తారు. ఇందులో ఎఫ్‌డీఏ ఆమోదిత అతి చిన్న అయస్కాంత సెల్స్ కెరాటినోసైట్లు (చర్మాన్ని బాగు పర్చడంలో), ఫైబ్రోబ్లాస్ట్లు (చర్మంపై కణాల మధ్య సమన్వయం) కీలక పాత్ర పోషిస్తాయి. గాయంపై ఉంచిన మాగ్నటిక్ డివైస్ ద్వారా వెలువడిన అయస్కాంత కణాలు నెమ్మదిగా కదులుతూ, రోగి చర్మ కణాలతో మిళితమై కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి. ఈ అయస్కాంత స్టిమ్యులేషన్ పరికరంపై సంబంధిత అవయవాన్ని రెండు నుండి మూడు గంటల పాటు ఉంచితే సరిపోతుందని అధ్యయన వేత్తలు తెలిపారు. (‘‘ఇక్కడ క్లిక్ చేయండి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
'షుగర్' గాయాలు మానాలంటే...?
న్యూయార్క్: మనకేదైనా గాయమైతే కొంచెం ఇబ్బంది. అదే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏదైనా గాయమైతే ఇక చెప్పనక్కర్లేదు ఆ అవస్థ! గోరు చుట్టుపై రోకటి పోటులా మానేవరకు మహా ఇబ్బంది పెట్టేస్తుంది. దీనిపై పరిశోధన జరిపిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ శాస్త్రవేత్త డాక్టర్ మిన్ ఝావ్ మాత్రం గాయం చుట్టూ స్వల్ప మోతాదులో కరెంటు షాక్లివ్వడం ద్వారా నయం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మామూలు మనుషులకు గాయమైనప్పుడు ఆ పరిసరాల్లోని కణాల ద్వారా అందే ఎలక్ట్రిక్ సంకేతాల కారణంగా గాయం మానే ప్రక్రియ మొదలవుతుంది. అదే మధుమేహ వ్యాధిగ్రస్తుల విషయంలో ఈ సంకేతాలు చాలా బలహీనంగా ఉన్నాయని మిన్ ఝావ్ గ్రహించారు. గాయం మానడానికి కృత్తిమంగా కరెంటు సంకేతాల శక్తిని పెంచితే త్వరగా నయమవుతుందని అంటున్నారు. గాయమైన చోట అయాన్లు వ్యాపించేలా మందులిస్తే ఈ కరెంటు సంకేతాలు ఎక్కువవుతాయని, లేదంటే నేరుగా కరెంటు షాక్లివ్వవచ్చని వివరించారు.