wounds
-
చేప చర్మం: కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్ అల్సర్లకు కూడా!
కాలిన గాయాలకు చేపల చర్మంతో చికిత్సతో మంచి ఫలితాలను సాధిస్తున్న వైనాన్ని గతంలో విన్నాం. అయితే ఈ విధానంపై కొనసాగుతున్న పరిశోధనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల చర్మం కాలిన గాయాలు మాత్రమే కాదు , డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో సహా వివిధ రకాల గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చికిత్సలో మంచి ఫలితానిస్తున్నాయి. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్మెంట్ రాయడం, బ్యాండేజ్ వేయడం, గాయాలు చీము పట్టకుండా పవర్ఫుల్ యాంటి బయోటిక్స్ వాడటం ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానం. అయితే బ్యాండేజ్ వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేప చర్మాన్ని బ్యాండేజ్ లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు బ్రెజిల్ వైద్యులు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన తొలి దేశంగా బ్రెజిల్ నిలిచింది. 2017నుంచి తిలపియా చేప చర్మం ద్వారా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి ద్వారా మంటకు ఉపశమనం లభించి, నొప్పి త్వరగా తగ్గుతుందట. అలాగే బయటినుంచి వచ్చే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. మంచినీటిలో పెరిగే చేపల చర్మంలో ఇన్ఫెక్షన్లను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా గాయం తొందరగా మానుతుందని అంటున్నారు. అలాగే ఈ పద్ధతిలో ప్రతీ రోజు బ్యాండేజ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధానంలో సెకండ్ డిగ్రీ తీవ్రాతి తీవ్రమైన కాలిన గాయాలు కూడా సగటున 9-11 రోజుల్లో నయమవుతున్నాయి. దీనికి సంబంధించి జంతువులపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. 2021లో కెరెసిస్ కంపెనీకి చెందిన ఇన్ఫ్లాంటబుల్ఫిష్ స్కిన్ ఉత్పత్తులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా చేపల చర్మంతో ఇలాంటి ఉత్పత్తులను తయారీకి అనుమతి ఉన్న ఏకైక కంపెనీ కెరెసిస్. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ను ప్లాస్టిక్, రికన్స్ట్రక్టివ్ సర్జరీలలో వాడవచ్చని కూడా అంటున్నారు. అంతేకాదు ఇది డయాబెటిస్ కారణంగా వచ్చే పుండ్లను కూడా మాన్పుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. Did you know? Fish skin has shown anti-inflammatory and anti-bacterial properties that support and improve healing in a variety of wounds including burns and diabetic foot ulcers. Ongoing research is exploring this vs alternative techniques.pic.twitter.com/ggEI6f1WPP — Massimo (@Rainmaker1973) March 3, 2024 -
బాక్టిరియాతో డ్రెస్సింగ్.. గాయలను త్వరగా తగ్గిస్తుంది!
మన శరీరంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బ్యాండేజీ వేసుకుంటాం. ఇక గాయం మానడానికి చాలా రోజులే పడుతుంది. ఈ క్రమంలో బాక్టీరియా చేరకుండా వైద్యుల సూచనతో డ్రెస్సింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ కొత్తరకమైన డ్రెస్సింగ్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఏకంగా గాయాన్ని మాయం చేస్తుందట. దీర్ఘకాలిక గాయాలకు చికిత్స చేస్తున్నప్పుడు వాటికి బాక్టీరియా దరిచేరకుండా నిత్యం డ్రెస్సింగ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ప్రతిసారి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్‌కి నొప్పి కలగడం సహజమే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్తరకం డ్రెస్సింగ్ గాయాలను త్వరగా మానేలా చేస్తుందట. గాయపడిన ప్రాంతంలో నొప్పి కలిగించే బయోఫిల్మ్‌లను నాశనం చేసేలా MIT, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్. కున్ రెన్ నేతృత్వంలోని సైంటిస్టులు బయో-కె+ అనే అక్వాసెల్ను కనుగొన్నారు. ఇందులో మూడు రకాల లాక్టోబాసిల్లి ప్రోబయోటిక్ అనే బాక్టిరియా ఉంటుందట. ఇది బయోఫిల్మ్ pH స్థాయిపై దాడిచేసి దానిని నాశనం చేస్తుందట. ఈ కొత్తరకమైన డ్రెస్సింగ్ టెక్నాలజీతో 99.999% వ్యాధికారకాలను చంపేసి గాయం తాలూకూ నొప్పిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఇందులోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా..గాయాన్ని త్వరగా మానేలా చేయడమే కాకుండా కొత్త చర్మం రావడానికి సహాయపడిందని సైంటిస్టులు తెలిపారు. -
గ్లోవ్ ధరిస్తే వాపులు మాయం!
చేతులకు గాయాలై, ఆ గాయాల వల్ల వాపులు కూడా ఏర్పడితే రోజువారీ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. గాయాల వల్ల ఏర్పడే వాపులు తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్, పెయిన్ బామ్స్ వాడుతుంటాం. చేతి వాపులు తగ్గించుకోవాలంటే, ఇప్పుడు వాటితో పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్లోవ్‌ను తొడుక్కుంటే చాలు. నొప్పుల నుంచి సత్వర ఉపశమనం లభించడమే కాకుండా, వాపులు కూడా ఇట్టే తగ్గిపోతాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సిండీ కావో నేతృత్వంలోని పరిశోధకులు ఈ అద్భుతమైన నొప్పినివారక గ్లోవ్‌ను ‘నిట్ డెమా’ పేరుతో ఇటీవల రూపొందించారు. ఒక వేలును మాత్రమే కప్పి ఉంచేలా దీన్ని రూపొందించారు. దీని తయారీకి మామూలు ఊలుతో పాటు, మిశ్రమ లోహాలతో తయారు చేసిన స్ప్రింగులను ఉపయోగించారు. దీన్ని పవర్‌బ్యాంక్‌కు కనెక్ట్ చేసుకుంటే, ఇందులోని మిశ్రమ లోహాల స్ప్రింగులు విద్యుత్తును గ్రహించి, కొద్దిగా వేడెక్కి మర్దన చేయడం మొదలు పెడతాయి. ఫలితంగా నొప్పి, వాపులు తగ్గుతాయి. దీని పనితీరుపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని వారు చెబుతున్నారు. చదవండి: ఫుడ్ పాయిజన్ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే.. -
ప్రమాదవశాత్తు గాయాలు.. సత్వర ఉపశమనం కావాలా?
ప్రమాదవశాత్తు గాయాలు తగలడం మామూలే! అప్పుడప్పుడు చర్మం గీరుకుపోయి, నెత్తురు చిందేలా గాయాలవుతుంటాయి. అలాంటి గాయాలకు టింక్చర్ లేదా యాంటీబయోటిక్ ఆయింట్‌మెంట్లతో చికిత్స చేస్తుండటం తెలిసిందే! గాయాలను శుభ్రం చేసి, టింక్చర్ లేదా యాంటీబయోటిక్ ఆయింట్మెంట్లు పూయకుండా వదిలేస్తే, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి గాయాలకు సత్వర ఉపశమనం కలిగించే సరికొత్త సాధనం ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీనిపేరు ‘క్యూర్ ఫాస్టర్’. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తుంది. దీని నుంచి వెలువడే వెచ్చని గాలిని, నీలికాంతిని గాయం వైపు ఐదునిమిషాల పాటు ప్రసరింపజేస్తే చాలు. నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు, గాయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా పూర్తి రక్షణ లభించడమే కాకుండా, గాయం త్వరగా కూడా మానిపోతుంది. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉన్న దీని ధర 89.99 డాలర్లు (సుమారు రూ.7,300) మాత్రమే! చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
‘పురుగులు పడితే’ బతుకుతారు..!
జంతువులు, మనుషులు.. శరీరం ఏదైనా సరే తీవ్రంగా గాయాలై తగిన చికిత్స చేయకపోతే పురుగులు పట్టడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా కుళ్లిన, చనిపోయిన మాంసానికే (మృత కణాలకే) పురుగులు పడతాయి. కానీ అదే పురుగులు తీవ్రమైన గాయాలు మానడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే గుర్తించిన ఈ విధానాన్ని వినియోగించడం ఇటీవల మళ్లీ పెరిగింది కూడా. మరి ఈ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ యాంటీ బయాటిక్స్‌కు లొంగకుండా.. సరైన విధంగా మందులు వాడకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం, పలు రకాల అనారోగ్య సమస్యలు వంటివాటి వల్ల గాయాలు మానవు. గాయాల్లో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. అవి మరింత తీవ్రమై పుండ్లు పడటం, చీమురావడం, కణాలు చనిపోయి కుళ్లిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. మరోవైపు పలురకాల బ్యాక్టీరియాలు ఔషధాలకు నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవడంతో.. చికిత్స చేసినా ఫలితం లేకపోవడం లేదా సుదీర్ఘకాలం పట్టడం జరుగుతోంది. ఈలోగా సమస్య ముదిరి.. ఆ శరీర భాగాలను తొలగించాల్సి రావడంగానీ, ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించి ప్రాణాలు పోగొట్టుకోవడంగానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ‘పురుగుల’ చికిత్సతో ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలోనే.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కాల్పులు, బాంబు దాడుల్లో లక్షలాది మంది సైనికులు గాయపడ్డారు. యుద్ధ క్షేత్రాల్లో సరైన చికిత్స అందక గాయాలు పుండ్లు పడి, ఇన్ఫెక్షన్లు పెరిగి.. అవయవాలు కోల్పోయినవారు, చనిపోయినవారు ఎందరో. అయితే యుద్ధంలో గాయపడిన ఫ్రెంచ్ సైనికుల్లో కొందరికి గాయాలపై పురుగులు పట్టడం, వారి గాయాలు త్వరగా మాని కోలుకోవడాన్ని వైద్యులు గుర్తించారు. గాయాల్లోని మృత కణాలను ఆ పురుగులు తినేయడం, అదే సమయంలో బ్యాక్టీరియాను హతమార్చే రసాయనాలను విడుదల చేయడమే దీనికి కారణమని తేల్చారు. ఇది తెలిసిన చాలా మంది వైద్యులు సైనికులకు పురుగుల చికిత్స చేశారు. కానీ తర్వాతికాలంలో యాంటీ బయాటిక్స్ రావడం, పురుగుల పట్ల ఏవగింపు వంటివి ఈ చికిత్స మరుగునపడిపోవడానికి కారణమయ్యాయి. పురుగులు ఏం చేస్తాయి? ఈగలు, తేనెటీగలు వంటి ఎగిరే కీటకాలు గుడ్డు నుంచి ఎదిగే క్రమం భిన్నంగా ఉంటుంది. అవి మొదట గుడ్డు నుంచి పురుగుల రూపంలోని లార్వాగా జన్మించి.. తర్వాత పూర్తిస్థాయి కీటకాలుగా మార్పు చెందుతాయి. ఇందులోని లార్వా దశ పురుగులనే గాయాలను మాన్పడానికి వినియోగిస్తారు. ఈ పురుగులు నేరుగా మన మృతకణాలను తినవు. ముందుగా వాటి నోటి నుంచి వివిధ ఎంజైమ్‌లు ఉండే లాలాజలాన్ని (సలైవా) విడుదల చేస్తాయి. ఈ ఎంజైమ్‌లు మృతకణాలను కరిగించి పోషక ద్రవంగా మారుస్తాయి. ఇదే సమయంలో అక్కడ ఉండే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు కూడా చనిపోయి పోషక ద్రవంగా మారుతాయి. పురుగులు ఈ పోషక ద్రవాన్ని పీల్చుకుని జీవిస్తాయి. మొత్తంగా గాయంపై మృతకణాలు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశించడంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మరోవైపు పురుగుల సలైవా వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి చురుగ్గా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో సమస్య నుంచి వేగంగా కోలుకున్నట్టు తేల్చారు. ఇంగ్లండ్‌లోని సౌత్‌వేల్స్‌కు చెందిన బయోమోండే సంస్థ ‘గ్రీన్ బాటిల్ బ్లోఫ్లై’ రకం ఈగల లార్వాలను టీబ్యాగ్‌ల తరహాలో ప్యాక్ చేసి అమ్ముతోంది. ఏటా 9 వేల బయోబ్యాగ్లను చికిత్సల కోసం కొంటున్నారని చెబుతోంది. నర్సుల భయమే సమస్యట! సాధారణంగా పురుగులను చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. కొందరైతే భయంతో కెవ్వున కేకలు కూడా పెడుతుంటారు. ప్రస్తుతం గాయాలకు పురుగుల చికిత్సలోనూ ఇదో సమస్యగా మారిందని ఇంగ్లండ్ వైద్యులు చెప్తున్నారు. చాలా మంది నర్సులు పురుగులను చూసి అసహ్యం, భయం వ్యక్తం చేస్తున్నారని.. ఆ చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. అందువల్ల కొందరు నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ చికిత్సల్లో వినియోగిస్తున్నామని చెప్తున్నారు. కొన్నాళ్లుగా ఇంగ్లండ్‌లో మళ్లీ వినియోగం గాయాలు, పుండ్లకు చికిత్సలో పురుగుల వినియోగానికి ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ 2004లోనే అధికారికంగా అనుమతి ఇచ్చింది. కొన్నాళ్లుగా ఈ విధానానికి ఆదరణ వస్తోందని, 2009–19 మధ్య ఈ తరహా చికిత్సలు 50శాతం పెరిగాయని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. పుళ్లుపడి, చీముపట్టిన గాయాలైనా.. సాధారణంగా గాయాలు తీవ్రమై పుళ్లుపడటం, చీముపట్టడం (గ్యాంగ్రిన్) వంటివి జరిగితే.. అంతమేర ఆపరేషన్ చేసి కండరాన్ని కోసి తీసేయాల్సిందేనని వైద్యులు చెప్తుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి కారణాలతో కాళ్లు, చేతులు, వేళ్లు వంటివి తొలగించిన ఘటనలూ మనకు కనిపిస్తుంటాయి. అలాంటి తీవ్రమైన గాయాలు కూడా మానిపోయేందుకు పురుగుల చికిత్స తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా గ్యాంగ్రిన్ సమస్యతో 7లక్షల మంది వరకు చనిపోతున్నట్టు అంచనా. వారిలో చాలా మందిని ‘పురుగుల చికిత్స’తో కాపాడవచ్చని అంటున్నారు. ఏదో ఓ పురుగు వేసుకుంటే డేంజర్ పురుగులతో గాయం తగ్గిపోతుందికదా అని ఏదో ఒక పురుగును వేసుకుంటే మొదటికే మోసం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుగులు అంటేనే వివిధ బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మజీవులకు అడ్డాలు అని.. వాటితో మరిన్ని ఇన్ఫెక్షన్లు సోకుతాయని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా ప్రత్యేకమైన ఈగ జాతులకు చెందిన గుడ్లను యాంటీ బ్యాక్టీరియల్ ద్రావణంతో శుద్ధిచేసి, ప్రయోగశాలలో వాటిని పొదిగి.. లార్వా దశకు వచ్చాక గాయాలపై వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు. ఈ పురుగులను కూడా గాయాలపై నేరుగా వేయరు. టీబ్యాగ్ తరహా ప్రత్యేకమైన పలుచని రంధ్రాలున్న బయోబ్యాగ్లో వాటిని ఉంచుతారు. ఈ బ్యాగ్‌లను గాయాన్ని తాకేలా పెట్టి.. పైన వదులుగా పట్టీకడతారు. ఇలా రెండు నుంచి నాలుగు రోజులు ఉంచుతారు. -
Health: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా?
నాకు సిజేరియన్ అయ్యి మూడు నెలలవుతోంది. మా ఊళ్లో చేశారు. కుట్ల దగ్గర చాలా నొప్పి వస్తోంది. యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం లేదు. ఈ మధ్య అంటే ఓ పదిరోజులగా కుట్ల నుంచి పస్ కూడా వస్తోంది. నేను సిటీకి వెళ్లి చూపించుకోవాలా? ఏమైనా ప్రమాదమా? – టి. హర్షిత, దేశాయిపేట, తెలంగాణ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రావటం సాధారణమే.పేషంట్ బరువును బట్టి, వాడిన యాంటీబయాటిక్స్, సర్జరీ టైమ్‌ను బట్టి రిస్క్ పెరుగుతుంది. కానీ ఇది చాలాసార్లు ఆపరేషన్ మొదటి, రెండు వారాల్లో బయటపడుతుంది. మీకు మూడు నెలల తర్వాత రావడం.. అంత మంచిది కాదు. దీనిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు చీము వస్తోంది అన్నారు. కాబట్టి వెంటనే సీనియర్ డాక్టర్‌ను కలవండి. చీము వస్తున్న చోటు నుంచి దూదితో వూండ్ స్వాబ్ తీస్తారు. దానిని బట్టి అందులో ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది, ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కొన్ని కేసెస్‌లో యాంటీబయాటిక్స్ వాడినా పస్ తగ్గదు. అప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పస్ లోపలి కుట్ల దగ్గర నుంచి వస్తోందా? ఏదయినా sinus tractలాగా ఫామ్ అయిందా అని చూస్తారు. ఎమ్ఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సిరావచ్చు. జనరల్ సర్జన్ అభిప్రాయం కూడా తీసుకోవాలి. మళ్లీ చిన్న ఆపరేషన్ చేసి ఆ చీమునంతా తీసేసి క్లీన్ చేసి ఏ ట్రాక్ట్ ఫామ్ అయిందో దానిని మూసేసి.. యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఈ ట్రాక్ట్ నుంచి తీసినదంతా మళ్లీ టెస్ట్‌కు పంపాలి. కొంతమందిలో టీబీ వల్ల కూడా ఇలా సిజేరియన్ అయిన చాలా నెలల తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యాంటీ–టీబీ ట్రీట్మెంట్ ద్వారానే ఇవి పూర్తిగా నయమవుతాయి. ఇలాంటి కేసెస్‌ను క్లోజ్‌గా ఫాలో అప్ చేయాలి. కుట్లకు వాడే కొన్ని రకాల మెటీరియల్స్ వల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Vasectomy Operations: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా? Lump In Breast During Pregnancy: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే.. -
కులం పేరుతో దూషణ.. ఆపై బాలుడిని మంటల్లో తోసేసిన తోటి విద్యార్థులు
చెన్నై: సమాజంలో జరుగుతున్న ఘోరాలలో వ్యక్తిని కులం పేరుతో దూషించడం ఒకటి. గతంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా పెద్దల మధ్య చోటు చేసుకునేవి. ఇటీవల ఇవి పిల్లలకు కూడా పాకినట్లు ఉంది. తాజాగా ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా అతన్ని మంటల్లోకి తోసేశారు. ఈ హేయమైన ఘటన తమిళనాడులోని విలుపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే....తిండివనం పట్టణంలోని కట్టుచివిరి ప్రభుత్వ పాఠశాలలో ఓ దళిత విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలానే ఆ బాలుడు స్కూల్ అయ్యాక తిరిగి ఇంటికి బయలుదేరాడు. అయితే అక్కడే చదువుతున్న ముగ్గురు అగ్ర కులానికి చెందిన విద్యార్థులు ఒంటిరిగా వెళ్తున్న అతడ్ని ఆటపట్టించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో కూడా దూషించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం రావడంతో వాళ్ళు ఆ బాలుడిని కాలుతున్న పొదల్లోకి తోసేశారు. దీంతో ఆ విద్యార్థి కాలిన గాయాలతో ఇంటికి వెళ్ళాడు. ఒంటి పై గాయాలతో ఉన్న కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు తల్లపోయారు. వెంటనే చికిత్స కోసం కుమారుడ్ని తిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరకి ఈ దారుణం ఎలా జరిగిందో తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆ ముగ్గురి విద్యార్థుల పై పోలీసులకు ఫిర్యాడు చేశారు బాధిత విద్యార్థి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు -
ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యింది. ఇంటి, ఒంటి శుభ్రతతో పాటు తినే ఆహారంలో కూడా తగన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు బయటి ఆహారాన్నే ఇష్టపడ్డవారు సైతం ఇప్పుడు ఇంటి భోజనమే బెటర్ అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మన శరీరం చూపే కొన్ని లక్షణాలను బట్టి మన రోగనిరోధక శక్తి బలంగా ఉంది లేనిది అనే దాని గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో చూడండి.. (చదవండి: నాటుకోడి నోరూరిస్తోంది..!) తరచు జలుబు, దగ్గు.. తరచుగా జలుబు చేసినా.. గొంతులో చిరాకుగా ఉండి దగ్గు సూచనలు కనిపించినా మీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు గనక సంవత్సరంలో నాలుగు సార్లకంటే అధికంగా దగ్గు, జలుబు వచ్చాయంటే మీ ఇమ్మూనిటీ లెవల్స్ బలహీనంగా ఉన్నాయని అర్థం. నిద్ర లేచాక.. భారంగా ఉంటుందా.. రాత్రి నిద్రపోయాక తరచుగా మెలకువ వస్తుందా.. అలానే 7-8 గంటలు నిద్ర పోయి లేచిన తర్వాత కూడా మీకు భారంగా అనిపిస్తుందా. ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే.. మీ రోగ నిరోధక శక్తి ప్రమాదంలో ఉన్నట్లే. తరచుగా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడం.. మీరు బయట ఆహారం తిన్నారు.. కడుపులో అనిజీగి ఉందా. అయితే మీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లే. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మిగత శరీర భాగాలు కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. గాయాలు నెమ్మదిగా నయమవుతున్నాయా.. దెబ్బ తగిలినప్పుడు.. కాలినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఆ గాయాలు మానిపోతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటే.. గాయాలు నెమ్మదిగా మానితే.. మీ రోగనిరోధక శక్తి మందగించిందని అర్థం. అంతేకాక మీ శరీరం, చర్మాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అందించడం లేదనడానికి గుర్తు. తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా.. మీరు జలుబు, దగ్గుతో పాటు మూత్ర, చెవి, సైనస్ సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే ఇమ్యూనిటీ వీక్‌గా ఉందని అర్థం. మీ రోగనిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేసిన వైరస్లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తగినన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేకపోతుందనడానికి ఇది సంకేతం. ఈ పైలక్షణాలు మీకు కనిపిస్తే.. వెంటనే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వ్యాయమాలు చేయడం ప్రారంభించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!) -
నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) అకాల మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సుశాంత్ అభిమానులు, సినీ ప్రముఖులు, ఇతర పెద్దలు, సుశాంత్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో స్పందించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో పాతుకు పోయిన నటవారసత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన గాయాలు చాలా లోతైనవని (నా గాయాలు నా మాంసం కన్నా లోతు) గుర్తు చేసుకున్నారు. అయినా నిలదొక్కుకున్నాను. కానీ పాపం.. పిల్లవాడు (సుశాంత్) వల్ల కాలేదు. తట్టుకోలేకపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇకనైనా నేర్చుకుందామా.. వారి కలలు కల్లలు కాకుండా నిలబడదామా.. అంటూ ఉద్వేగ భరిత పోస్ట్ పెట్టారు. (సుశాంత్ అంత్యక్రియలు: నటుడి భావోద్వేగ పోస్ట్) ఈ సందర్భంగా కెరీర్ ఆరంభంలో ఎదురైన నెపోటిజం గురించి ప్రస్తావిస్తున్న సుశాంత్ వీడియోను కూడా ప్రకాశ్ రాజ్ షేర్ చేశారు. ఈ వీడియోలో 2017లో జరిగిన ఐఫా కార్యక్రమంలో తన ఆలోచనలను సుశాంత్ పంచుకున్నారు. నెపోటిజం సమస్య ప్రతిచోటా ఉంది. కానీ నిజమైన ప్రతిభకు ప్రోత్సాహం లభించకపోతే ఏదో ఒక రోజు మొత్తం పరిశ్రమ నిర్మాణం కుప్పకూలిపోతుందని సుశాంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా గత ఆరు నెలలుగా డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు ప్రశ్నల్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. #nepotism I have lived through this .. I have survived ... my wounds are deeper than my flesh ..but this child #SushanthSinghRajput couldn’t.. will WE learn .. will WE really stand up and not let such dreams die .. #justasking pic.twitter.com/Q0ZInSBK6q — Prakash Raj (@prakashraaj) June 15, 2020 -
గాయాలు మానేందుకు సరికొత్త చికిత్స
న్యూయార్క్: పలు కారణాల వల్ల మానవ శరీరంపై ఏర్పడే గాయాలను అతి త్వరగా నయం చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. సాంకేతిక పరిభాషలో టిష్యూ నానోట్రాన్స్‌ఫెక్షన్ (టీఎన్టీ)గా వ్యవహరించే ఈ చికిత్సా విధానాన్ని అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. గాయాల కారణంగా దెబ్బతిన్న జన్యు కణాలను రీప్రోగ్రామింగ్ చేయడమే ఈ కొత్త చికిత్సా విధానం. గాయపడిన చోట చర్మానికి ఎలక్ట్రికల్ స్టిములేషన్ కలిగిస్తారు. అనంతరం చొక్కా బటన్ సైజులో ఉండే ఓ చిప్‌ను గాయమైన చోటుకు పంపిస్తారు. అది వెంటనే డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలో ముందుగా చేసిన ప్రోగ్రామ్ ద్వారా దెబ్బతిన్న కణాలను రీప్రోగ్రామ్ చేస్తుంది. సజీవ కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా డాక్టర్ల ఆదేశాల మేరకు ఈ చిప్‌లో ముందస్తు ప్రోగ్రామ్ ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో చనిపోయిన జన్యు కణాలను ప్రాణం తెప్పించేందుకు, దెబ్బతిన్న అవయవాలను తిరిగి పెరిగేలా చేయడం కోసం ఈ సరికొత్త చికిత్సా విధానాన్ని అమలు చేసి విజయం సాధించామని పరిశోధకులు తెలిపారు. మానవులపై ఈ ప్రయోగం చేయడానికి మరో ఏడాది కాలం పట్టవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్, స్ట్రోక్‌తో బాధ పడుతున్నవారికి ఈ చికిత్సా విధానం మంచిది కాకపోవచ్చని, ఆ విషయన్ని కూడా తేల్చుకొని అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నట్లు వారు వివరించారు. -
బస్సు కింద పడి విద్యార్థికి తీవ్ర గాయాలు
రాజంపేట: రాజంపేట పట్టణం పాతబస్టాండులో సోమవారం రాజంపేట డిపోకు చెందిన స్టూడెంట్ బస్సును ఎక్కుతూ ప్రమాదవశాత్తు బస్సు టైర్లకింద పడి నాగార్జున అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పెనగలూరు మండలం ఈటమార్పురం గ్రామానికి చెందిన నాగార్జున పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. రోజూ కళాశాలకు వచ్చి ఇంటికి వెళ్లేవాడు. ఇదే క్రమంలో ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్ బస్సును ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు బస్సు టైర్ల కింద పడ్డాడు. దీంతో రెండు కాళ్లు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే కాళ్లు పనిచేయడంలేదు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు కింద పడి విద్యార్థికి తీవ్ర గాయాలు
రాజంపేట: రాజంపేట పట్టణం పాతబస్టాండులో సోమవారం రాజంపేట డిపోకు చెందిన స్టూడెంట్ బస్సును ఎక్కుతూ ప్రమాదవశాత్తు బస్సు టైర్లకింద పడి నాగార్జున అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పెనగలూరు మండలం ఈటమార్పురం గ్రామానికి చెందిన నాగార్జున పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. రోజూ కళాశాలకు వచ్చి ఇంటికి వెళ్లేవాడు. ఇదే క్రమంలో ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్ బస్సును ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు బస్సు టైర్ల కింద పడ్డాడు. దీంతో రెండు కాళ్లు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే కాళ్లు పనిచేయడంలేదు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ గర్ల్‌ఫ్రెండ్, బాస్‌పై కాల్పులు..
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ మత్తులో ఓ వ్యక్తి తన మాజీ గర్ల్‌ప్రెండ్‌ను కాల్చిచంపాడు. అనంతరం తనపై కోపాన్ని ప్రదర్శించిన బాస్‌పై కూడా కాల్పులు జరిపాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాన్యుయల్ ఫాలిసియానో(50) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం డ్రగ్స్ మత్తులో పైశాచికంగా మారాడు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్(45) ఇంటికి వెళ్లి.. అక్కడ ఆమెను ఇద్దరు పిల్లల ముందే దారుణంగా కాల్చిచంపాడు. అనంతరం.. అంతకు ముందు రోజు ఆఫీసులో తనపై దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో ఆఫీసుకు వెళ్లి బాస్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు విచారణ అధికారి జెర్రీ డెమింగ్స్ తెలిపారు. ఈ రెండు ఘటనలకు పాల్పడిన అనంతరం ఓ ఇంట్లో దాక్కున్న ఫాలిసియానోను పోలీసులు అరెస్టు చేశారు.