మాజీ గర్ల్ఫ్రెండ్, బాస్పై కాల్పులు.. | 1 dead, another wounded in Florida shooting spree | Sakshi
Sakshi News home page

మాజీ గర్ల్ఫ్రెండ్, బాస్పై కాల్పులు..

Published Sun, May 29 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

మాజీ గర్ల్ఫ్రెండ్, బాస్పై కాల్పులు..

మాజీ గర్ల్ఫ్రెండ్, బాస్పై కాల్పులు..

న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ మత్తులో ఓ వ్యక్తి తన మాజీ గర్ల్ప్రెండ్ను కాల్చిచంపాడు. అనంతరం తనపై కోపాన్ని ప్రదర్శించిన బాస్పై కూడా కాల్పులు జరిపాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాన్యుయల్ ఫాలిసియానో(50) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం డ్రగ్స్ మత్తులో పైశాచికంగా మారాడు. తన మాజీ గర్ల్ఫ్రెండ్(45) ఇంటికి వెళ్లి.. అక్కడ ఆమెను ఇద్దరు పిల్లల ముందే దారుణంగా కాల్చిచంపాడు. అనంతరం.. అంతకు ముందు రోజు ఆఫీసులో తనపై దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో ఆఫీసుకు వెళ్లి బాస్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు విచారణ అధికారి జెర్రీ డెమింగ్స్ తెలిపారు. ఈ రెండు ఘటనలకు పాల్పడిన అనంతరం ఓ ఇంట్లో దాక్కున్న ఫాలిసియానోను పోలీసులు అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement