![How To Make A Wound Heal Quick: Use Cure Faster Product To Relief - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/27/Untitled-6.jpg.webp?itok=Xg_m0XSr)
ప్రమాదవశాత్తు గాయాలు తగలడం మామూలే! అప్పుడప్పుడు చర్మం గీరుకుపోయి, నెత్తురు చిందేలా గాయాలవుతుంటాయి. అలాంటి గాయాలకు టింక్చర్ లేదా యాంటీబయోటిక్ ఆయింట్‌మెంట్లతో చికిత్స చేస్తుండటం తెలిసిందే! గాయాలను శుభ్రం చేసి, టింక్చర్ లేదా యాంటీబయోటిక్ ఆయింట్‌మెంట్లు పూయకుండా వదిలేస్తే, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి గాయాలకు సత్వర ఉపశమనం కలిగించే సరికొత్త సాధనం ఒకటి అందుబాటులోకి వచ్చింది.
దీనిపేరు ‘క్యూర్ ఫాస్టర్’. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తుంది. దీని నుంచి వెలువడే వెచ్చని గాలిని, నీలికాంతిని గాయం వైపు ఐదునిమిషాల పాటు ప్రసరింపజేస్తే చాలు. నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు, గాయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా పూర్తి రక్షణ లభించడమే కాకుండా, గాయం త్వరగా కూడా మానిపోతుంది. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న దీని ధర 89.99 డాలర్లు (సుమారు రూ.7,300) మాత్రమే!
చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment