మెడ పట్టేసిందా..? ఇలా చేస్తే నొప్పి మాయం.. | Torticollis Or Wry Neck: Causes Symptoms And Prevention | Sakshi
Sakshi News home page

మెడ పట్టేసిందా..? ఇలా చేస్తే నొప్పి మాయం..

Published Tue, Oct 22 2024 10:24 AM | Last Updated on Tue, Oct 22 2024 10:51 AM

Torticollis Or Wry Neck: Causes Symptoms And Prevention

చాలామందికి నిద్రలోగాని, లేదా ప్రయాణంలో గానీ లేదా సుదూర ప్రయాణాల  తర్వాత గాని మెడ పట్టుకుంటుంది. ఇలా మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో  రై నెక్‌ (wry neck) అంటారు. ఇలా మెడ పట్టేస్తే, నిద్రలో దానంతట అదే వదిలేస్తుందని, లేదా తలదిండు తీసేసి పడుకోవడం వల్ల త్వరగా తగ్గుతుందని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా సర్దుకునేందుకు పాటించాల్సిన సూచనలివి...

  • మెత్తటి టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా చుట్టి (రోల్‌ చేసుకుని) మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా పెట్టుకోవాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి. అంటే తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా... భుజాలకు కూడా సపోర్ట్‌ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది. 

  • వ్యాయామాలు చేసేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్‌సైజ్‌ చేయకూడదు. పైగా మెడ పరిస్థితి సర్దుకునేందుకు ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. 

  • కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా  గబుక్కున ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు. 

  • కొందరు సెలూన్‌ షాప్‌లో మెడను రెండుపైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇలాంటి మొరటు పద్ధతుల్ని ఏమాత్రం అనుసరించకూడదు. దీనివల్ల పరిస్థితి మరింతగా ప్రమాదకరంగా మారవచ్చు.  

  • నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ లేదా ప్రమాదం లేని నొప్పినివారణ మందును రెండు రోజుల కోసం మాత్రమే వాడాలి. సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోయే ఈ సమస్యతో అప్పటికీ ఉపశమనం కలగకపోతే అప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. 

(చదవండి: డార్క్‌ చాక్లెట్స్‌తో గుడ్‌ మూడ్స్‌... గుడ్‌ హెల్త్‌!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement