ChatGPT For Your Health: ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ప్రతి ప్రశ్నకు సమాధానాలు అందిస్తూ వినియోగదారులను తెగ ఆకర్శించేస్తోంది. ఇప్పటికే మనం చాట్‌జీపీటీ సాయంతో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూకు ఎలా సిద్దమవ్వాలనే విషయాలు తెలుసుకున్నాం. ఈ కథనంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాట్‌జీపీటీ ఎలా సహాయం చేస్తుంది? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.
వర్కౌట్ ప్లాన్స్
ఆరోగ్యం అనగానే అందరికి గుర్తొచ్చేది ఫిట్‌నెస్. కాబట్టి ఫిట్‌నెస్ విషయంలో మీకు కావలసిన సలహాలను చాట్‌జీపీటీ ద్వారా పొందవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీ ప్రశ్నను బట్టి సమాధానం లభిస్తుంది. మీకు కావలసిన విషయాలను సర్చ్ బాక్స్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.. సమాధానం వచ్చేస్తుంది.
ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి టిప్స్, కార్డియో ఫిట్‌నెస్ కోసం ఎలాంటి ఎక్స్‌సర్‌సైజ్ చేయాలి, కేవలం 15 నిమిషాల్లో చేయదగిన బెస్ట్ ఎక్స్‌సర్‌సైజ్ ఏంటి అనే విషయాలను గురించి మీరు సులభంగా తెలుసుకోవచ్చు.
ఆహారం గురించి ప్లాన్స్
ఆరోగ్యం ప్రధానంగా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన, రోజూ తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకోవడానికి చాట్‌జీపీటీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్‌లో ఏది పడితే అది తినేసి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాటికి మంగళం పాడటానికి టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు.
చాట్‌జీపీటీ సహాయంతో ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్లాన్స్ రూపొందించుకోవచ్చు. మీ బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని మాంసాహారమా? లేక శాఖాహారమా? అనేదానికి సంబంధించి ఒక లిస్ట్ తయారు చేసుకోవడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.
మంచి అలవాట్లు
ప్రస్తుతం అనేక టెన్షన్స్ కారణంగా చాలామంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. కాబట్టి నేను తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలనుకుంటున్నాను, దానికి తగిన సలహాలు ఇవ్వమని చాట్‌జీపీటీని అడగవచ్చు. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానం అందిస్తుంది. అది నచ్చితే మీరు పాటించవచ్చు.
మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్
మనసు ప్రశాంతంగా ఉండగానే మెడిటేషన్ చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు డబ్బు ఖర్చు చేసి సంబంధిత క్లాసుల్లో చేరటం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ అవసరం లేకుండానే చాట్‌జీపీటీ మీకు మంచి సలహాలు అందిస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్ కోసం మంచి ఆలోచనలు చేయడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవండం, పుస్తకాలు చదవడం వంటి మరిన్ని సలహాలు ఉచితంగా పొందవచ్చు.
జర్నలింగ్ ప్రాంప్ట్
జర్నలింగ్ అనేది మైండ్‌ఫుల్‌నెస్ సాధనకు అత్యంత ప్రభావవంతమైన మార్గం. దీని కోసం కూడా చాట్‌జీపీటీ మంచి సలహాలను అందిస్తుంది.
మెడికల్ సింప్టమ్ చెకర్
ఏవైనా ఆరోగ్య లక్షణాలను గుర్తించడం లేదా అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేయడానికి.. ఆ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించడానికి చాట్‌జీపీటీ వర్చువల్ సింప్టమ్ చెకర్‌గా ఉపయోగపడుతుంది. చాట్‌జీపీటీ సలహాలను బట్టి వైద్య సంరక్షణ అవసరమా, లేదా అనేది కూడా మీరు నిరణయించుకోవచ్చు.
ఆరోగ్య సలహాలు
మీకున్న లక్షణాలను బట్టి కావలసిన వైద్య సలహాలను చాట్‌జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. మీ సందేహాలన్నీ అడగవచ్చు, మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సలహాలను పొందవచ్చు. అపాయింట్‌మెంట్‌లు, వైద్య నిపుణులను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలను పొందవచ్చు.
మందులను (మెడిసిన్స్) అర్థం చేసుకోవడం
మందులను సరిగ్గా ఉపయోగించుకోకపోతే.. చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే మందులను గురించి కూడా చాట్‌జీపీటీ సాయంతో తెలుసుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మెడిసిన్ దేనికి పనికొస్తుందో చాట్‌జీపీటీ చెబుతుంది, కానీ ఎంత మోతాదులో వాడాలో ఖచ్చితంగా డాక్టర్ మాత్రమే చెప్పాలి. దీనిని యూజర్ గుర్తుంచుకోవాలి.
మెంటల్ హెల్త్ సపోర్ట్
మనిషి శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో మెంటల్ హెల్త్ కోసం పరిష్కారం కనుగొనటం పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే చాట్‌జీపీటీ దీనికి కూడా చక్కని సమాధానాలు అందిస్తుంది.
ఇదీ చదవండి
1. రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!
2. ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!
Comments
Please login to add a commentAdd a comment