fish skin therapy
-
చేప చర్మం: కాలిన గాయాలకే కాదు, డయాబెటిక్ అల్సర్లకు కూడా!
కాలిన గాయాలకు చేపల చర్మంతో చికిత్సతో మంచి ఫలితాలను సాధిస్తున్న వైనాన్ని గతంలో విన్నాం. అయితే ఈ విధానంపై కొనసాగుతున్న పరిశోధనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల చర్మం కాలిన గాయాలు మాత్రమే కాదు , డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో సహా వివిధ రకాల గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చికిత్సలో మంచి ఫలితానిస్తున్నాయి. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్మెంట్ రాయడం, బ్యాండేజ్ వేయడం, గాయాలు చీము పట్టకుండా పవర్ఫుల్ యాంటి బయోటిక్స్ వాడటం ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానం. అయితే బ్యాండేజ్ వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేప చర్మాన్ని బ్యాండేజ్ లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు బ్రెజిల్ వైద్యులు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన తొలి దేశంగా బ్రెజిల్ నిలిచింది. 2017నుంచి తిలపియా చేప చర్మం ద్వారా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి ద్వారా మంటకు ఉపశమనం లభించి, నొప్పి త్వరగా తగ్గుతుందట. అలాగే బయటినుంచి వచ్చే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. మంచినీటిలో పెరిగే చేపల చర్మంలో ఇన్ఫెక్షన్లను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా గాయం తొందరగా మానుతుందని అంటున్నారు. అలాగే ఈ పద్ధతిలో ప్రతీ రోజు బ్యాండేజ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధానంలో సెకండ్ డిగ్రీ తీవ్రాతి తీవ్రమైన కాలిన గాయాలు కూడా సగటున 9-11 రోజుల్లో నయమవుతున్నాయి. దీనికి సంబంధించి జంతువులపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. 2021లో కెరెసిస్ కంపెనీకి చెందిన ఇన్ఫ్లాంటబుల్ఫిష్ స్కిన్ ఉత్పత్తులకు ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా చేపల చర్మంతో ఇలాంటి ఉత్పత్తులను తయారీకి అనుమతి ఉన్న ఏకైక కంపెనీ కెరెసిస్. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ను ప్లాస్టిక్, రికన్స్ట్రక్టివ్ సర్జరీలలో వాడవచ్చని కూడా అంటున్నారు. అంతేకాదు ఇది డయాబెటిస్ కారణంగా వచ్చే పుండ్లను కూడా మాన్పుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. Did you know? Fish skin has shown anti-inflammatory and anti-bacterial properties that support and improve healing in a variety of wounds including burns and diabetic foot ulcers. Ongoing research is exploring this vs alternative techniques.pic.twitter.com/ggEI6f1WPP — Massimo (@Rainmaker1973) March 3, 2024 -
కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స
-
కాలిన గాయాలకు చేప చర్మంతో చికిత్స
బ్రెసీలియా: కాలిన గాయాలకు చికిత్స చేయడంలో బ్రెజిల్ డాక్టర్లు కొత్త థెరపీకి తెరతీశారు. కాలిన గాయాలకు బర్నాల్ లాంటి ఆయింట్మెంట్లను పూసి, బ్యాండేజ్వేసే పాత పద్ధతికి స్వస్తిచెప్పి మంచినీళ్లలో దొరికే చేపల చర్మాన్ని బ్యాండేజ్లుగా ఉపయోగించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేయడమే తమ దేశంలోనే మొదటిసారని వారు చెబుతున్నారు. బ్రెజిల్‌లోని రూసాస్ నగరంలోని కాసా వెల్హా రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న మారియా క్యాండిడో డా సిల్వా 20 రోజుల క్రితం రెస్టారెంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ చేతికి, గొంతుకు, ముఖంలో కొంత భాగానికి సెకండ్ డిగ్రీ గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటను తట్టుకోలేకపోతున్నానంటూ , మంట తగ్గడానికి ఏదో ఒకటి చేయమని ఆమె డాక్టర్లను వేడుకుంది. చేప చర్మంతో బ్యాండేజ్ వేసే కొత్త పద్ధతి అమల్లోకి తీసుకొస్తున్నామని, దాన్ని ఉపయోగిస్తే నొప్పి త్వరగా తగ్గుతుందని డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చి అలాగే చేశారు. ‘చేప చర్మాన్ని కాలిన గాయాలకు బ్యాండేజ్లాగా వేయడంలో గాయాలు చల్లబడ్డాయి. కాసేపటికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత రెండు, మూడు రోజులకోసారి వెళ్లి బ్యాండేజ్ మార్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు మొత్తం గాయాలు తగ్గాయి’ అని మారియా మీడియాకు వివరించారు. మంచినీటిలో పెరిగే చేపల చర్మలో ఇన్ఫెక్షన్ను తట్టుకునే గుణంతోపాటు చర్మంలో తేమ ఎక్కువ సేపు ఉంటుందని, పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. బ్రెజిల్లో మంచినీటి చేపలే ఎక్కువ దొరుకుతాయని, దేశంలో 90 శాతం మంది ప్రజలు చేపల చర్మాన్ని చెత్తలో పడేస్తారని, దానికి బదులుగా ఆస్పత్రులకు విరాళంగా అందజేస్తే కాలిన గాయాలకు ఉపయోగించవచ్చని వారు చెప్పారు. సియరా ఫెడరల్ యూనివర్శిటీకి చెందిన మందుల అభివద్ధి, పరిశోధనా శాలలో డాక్టర్ ఒడ్రికో మొరాయెస్, ప్రొఫెసర్ ఎలిసాబెట్ మొరాయెస్, డాక్టర్ అనా పావులా నెగ్రిరాస్ నాయకత్వంలోని నిపుణుల బందం రెండేళ్లపాటు కషి చేసి చేప చర్మంతో కాలిన గాయాలకు చికిత్సచేసే విధానాన్ని అభివద్ధి చేశారు. గత 30 రోజుల్లోనే దాదాపు 50 మంది కాలిన గాయాలకు చికిత్స అందించామని డాక్టర్లు తెలిపారు.