అన్ని అనుకున్నట్లు జరిగిపోవు. ఒక్కోసారి ఏవిధంగా ప్రమాదం ముంచుకొస్తుందో కూడా తెలియదు. ఒకవేళ మనం మళ్లీ కోలుకోలేనంత ప్రమాదంలో చిక్కుకుపోయి ఆగమ్యం గోచరంలా మన జీవితం ఉన్నప్పుడే.. మన వాళ్లేవరో మనకు తెలుస్తుంది. ఆ సమయంలోనే ఎవరు మనవాళ్లో తెలుస్తుంది. మన కోసం తపించే వాళ్లెవరో అర్థమవుతుంది. అలాంటి ఘటనే ఓ వ్యక్తి లైఫ్‌లో చోటు చేసుకుంది.
ఇరాన్‌కి చెందిన ప్రిస్టన్ కాబ్‌కి సెప్టెంబర్ 2022 తనేషా అనే ఆమెతో యంగేజ్‌మెంట్ అయ్యింది. జులై 22, 2023లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఇంకా ఒక్క నెలలో పెళ్లి ఉందనంగా అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు ప్రిస్టన్. సరిగ్గా ప్రిస్టన్ విధి నిర్వహణలో ఉండగా సడెన్‌గా ఫ్యాక్టరీలో కెమికల్ వెదచెంది.. అతనిపై పడిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో కెమికల్ దాదాపు 1500ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉంది. ఆ దుర్ఘటనలో ప్రిస్టన్ శరీరీం సుమారు 32 శాతం కాలిపోయింది. మోచేతి చర్మం తన కళ్ల ముందే ఊడిపోయి ఎముకలు రావడం చూశాడు. ఇక ఆ రోజుతో తన జీవితం ముగిసిపోయిందనకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ప్రిస్టన్‌కి తెలియదు.
కళ్లు తెరిచి చూసేటప్పటికీ ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాడు. గాయాలు చాలా తీవ్రంగా అవ్వడంతో అతడిని ఆస్పత్రికి విమానంలో తరలించారు అధికారులు. ఆ ప్రమాదంలో ప్రిస్టన్ కాలి వేళ్లలో తొమ్మదిటిని, కుడి చేతి నాలుగు వేళ్లు, ఎడమ చేతి నేలుగువేళ్లను కోల్పయాడు. ఇక తనని తనేషా పెళ్లి చేసుకోదని అనుకున్నాడు. అసలు ఆ ఆలోచన తనలోకి రాకూడదని స్ట్రాంగ్‌గా అనుకున్నాడు. సడెన్‌గా ఆస్పత్రిలో ఉండే ఓ నర్సు వచ్చి కంగ్రాట్స్ మీరు అనుకున్న తేదినే పెళ్లి చేసుకుంటున్నారు అని చెబుతుంది.
ఒక్కసారిగా ప్రిస్టన్‌కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. తనేషా ఆస్ప్రతి యాజమాన్యంతో మాట్లాడి ప్రిస్టన్ ట్రీట్‌మెంట్ తీసుకున్న రూమ్‌నే వెడ్డింగ్ రూమ్‌గా మార్చేస్తుంది. అక్కడే అతడిని పెళ్లి చేసుకోవాలనే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. ఆమె అనుక్నునట్లుగా అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసుకుంది. ప్రిస్టన్ సర్‌ప్రైజ్ చేస్తూ..నిన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను ఏది ఆపలేదు అని ప్రిస్టన్‌తో భావోద్వేగంగా చెబుతోంది. ఇంత ప్రతికూలత నుంచి మృత్యుంజయుడివై బయటకు వచ్చినందుకు ఇదే నేను నీకు ఇచ్చే విలువైన గిఫ్ట్ అని సంతోషంతో ముంచెత్తుంది. ఆ జంటను కుటుంబ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి సమస్యలు ఎదురైనా..ఇదే స్ఫూర్తితో ఇద్దరు కలసి ఎదుర్కొండి అని ఆశ్వీరదించారు.
(చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..)
Comments
Please login to add a commentAdd a comment