ఈ ఏడాది ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటే ఇంకా ఆ దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ శిథిలాల కిందే ఓ శిశువు ఊపిరి పోసుకుంది. ఆ 'జననం ఓ అద్భుతం' అనే చెప్పాలి. అంతటి విషాదంలో అందరిలో ఓ కొత ఆశను రేకెత్తించినట్లు 'మిరాకిల్‌గా ఆ బేబి' పుట్టడం అందర్ని ఒకింత ఆనందసభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడూ ఆ శిశువు ఎలా ఉందంటే?
నాటి సిరియా భారీ భూకంపంలో శిథిలాల కింద ఆ పసికందు కనిపించినప్పుడు, ఆమె బొడ్డు తాడు తల్లి నుంచి ఇంకా తెగిపోలేదు. ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన కాసేపటికే ఆమె తల్లి కన్నుమూసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని ఆకర్షించింది. తల్లి లేకపోయిన ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల సాయంతో కోలుకుంది. ఇప్పుడు ఆ శిశువుకి ఆరు నెలలు. చాలా ఆరోగ్యంగా ఉంది. సిరియాలోని జిండిరెస్ పట్టణంలో ఆ చిన్నారి తన మేనత్త, మేనమామ, వారి ఏడుగురు పిల్లల మధ్య పెరుగుతోంది.
ఆమె నవ్వుతుంటే వాళ్ల నాన్న, అక్కలే గుర్తుకొస్తున్నారని ఆ చిన్నారి మేనమామ ఖలీల్ అల్ సవాడీ అన్నారు. ఆ విషాద ఘటనలో ఆమె తండ్రి, తల్లి, నలుగురు అక్కలు ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుటుంబంలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి అఫ్రానే. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు కూడా. ఆఖరికి అయినవాళ్ల అయిన ఆ చిన్నారి మేనమామ, మేనత్తలకు ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. ఎన్నో టెస్ట్‌లు నిర్వహించిగానీ వారికి ఆ పాపను అప్పగించలేదు ఆస్పత్రి యజమాన్యం.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే చేసిన పని ఆ పాపకు కొత్తపేరు పెట్టడమే. ఆ చిన్నారికి ఆమె తల్లి 'అఫ్రా' పేరునే పెట్టారు. నిజానికి ఆ శిశువుని కాపాడిని రెస్క్యూ సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం ఆ చిన్నారికి 'అయా' అని పేరు పెట్టడం జరిగింది. 'అయా' అంటే అరబిక్‌లో అద్భుతం అని అర్థం. ఆమె నా కూతుళ్లలో ఒకత్తని, దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేనన్నారు ఆ చిన్నారి మేనమామ ఖలీల్. ఇక జిండిరెస్‌లోని ఖలీల్ ఉంటున్న ఇల్లు కూడా బాగా భూకంపం కారణంగా బాగ దెబ్బతిందని, అందువల్ల తాముఅక్కడే ఎక్కువ కాలం ఉండలేకపోయామన్నారు ఖలీల్.
దీంతో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టినట్టయిందని, పిల్లలను స్కూల్‌కి పంపే స్థోమత కూడా లేదని ఖలీల్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఖలీల్ లాగానే ఎన్నో వేల కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్నాయి. అంతేగాదు ఆ విషాద ఘటనలో దాదాపు 50 వేలమంది మరణించారని, మరో 50 వేలమంది నిరాశ్రయులయ్యినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది కూడా.
(చదవండి: బస్సు డ్రైవర్ కూతురికి లండన్‌లో ఉద్యోగం)
Comments
Please login to add a commentAdd a comment