రక్తదానం చేసి ఇతర కుక్కల ప్రాణాలను కాపాడిన ఇలాంటి కుక్కలు హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఉన్నాయని మీకు తెలుసా?. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన జంతు ప్రదర్శన పెటెక్స్, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ముగిసింది. డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు బోబీ చౌహాన్ పెట్టింగ్ మ్యాటర్స్, డాగ్ స్పెషలిస్ట్ కంపెనీ ఈ సందర్భంగా గుర్తించబడింది. అలాగే ఈ డ్రైవ్‌లో రక్తదానం చేసినందుకు అనేక కుక్కలు వాటి యజమానులను కూడా సత్కరించారు.
మనుషులు మాదిరిగానే కుక్కలు కూడా..!
బాబ్బీ చౌహాన్ ప్రకారం, కుక్కలు, పిల్లులు మనుషుల మాదిరిగానే రక్తదానం చేయవచ్చు. నగరంలో గత ఐదేళ్లలో దాదాపు 200 రక్తదానాలు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, పెంపుడు కుక్కలను పెంచుకుంటున్న వారిలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. కుక్కలు ప్రతి మూడు నెలలకొకసారి మనుషుల మాదిరిగా రక్తదానం చేయవచ్చు. వీటికి 12 బ్లడ్ గ్రూపులు, 11 క్రాస్ మ్యాచింగ్ గ్రూపులు ఉన్నాయి. నగరంలో కుక్క లేదా కుక్కల బ్లడ్ బ్యాంక్ లేదని ఆయన అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు రక్తదానం చేయడానికి, ఇతర కుక్కలను రక్షించడానికి సిద్ధంగా ఉంటే డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో రోస్టియన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.
అంతేగాదు వారు నిహిత్ మెషిన్ ఆవిష్కరించారు. ఇది కుక్కలా ఆహరం విక్రయించే వెండింగ్ మెషీన్. ఇది ఉపయోగించిన లేదా వేస్ట్ నీటి బాటిళ్లను తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది వీధి కుక్కల ప్రయోజనం కోసం పెంపుడు జంతువుల ఆహారాన్ని అందించడమే గాక రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకటి ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను బాధ్యతాయుతంగా పారవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అదే సమయంలో ప్లాస్టిక్ సమస్యకు చెక్‌పెడుతుంది. ఈ యంత్రాన్ని ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Pawstive మార్పు తీసుకొద్దాం. అలాగే వెండింగ్ మిషన్‌తో భూమిని కలుషితం కాకుండా చూద్దాం అని వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు.
(చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!)
Comments
Please login to add a commentAdd a comment