
మైనర్ బాలిక పై యాసిడ్ దాడి
ఫరీదాబాద్: 17 ఏళ్ల బాలిక పై యాసిడ్తో దాడి చేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన హర్యానాలో బల్లబ్ఘర్లోని ఆదర్శనగర్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు...బాలిక తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు మార్కెట్కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బాలిక మొఖం పై యాసిడ్ తో దాడి చేశాడు.
అయితే దాడికి పాల్పడిన వ్యక్తిని బాలిక చూడలేకపోయిందని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన తర్వాత క్షణాల్లోనే దుండగుడు అక్కడినుంచి తప్పించుకు పోయాడన్నారు. ప్రస్తుతం బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.