
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : కట్టుకున్న భార్యని కడతేర్చాలని చూశాడో భర్త. భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రితేశ్ అనే వ్యక్తికి నిషాతో వివాహమైంది. అయితే నిషాకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన రితేశ్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన ఆమె నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.
ఆమెపై పగ పెంచుకున్న రితేశ్ ఎలాగైనా ఆమెను హత్య చేయాలని భావించాడు. అదును చూసుకుని ఆమె ఇంటికి వెళ్లి.. నిద్రిస్తున్న సమయంలో యాసిడ్‌తో దాడి చేశాడు. ఆ సమయంలో నిషా పక్కనే పడుకున్న మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. 45 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న నిషాను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రితేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రితేశ్ గతంలో పలు చోరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment