ప్రతీకాత్మకచిత్రం
లక్నో : ఓ మదర్సాకు చెందిన నలుగురు విద్యార్ధులను జై శ్రీరాం అని నినదించలేదని కొందరు వ్యక్తులు చితకబాదిన ఘటన యూపీలోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. సివిల్ లైన్స్ ఏరియాలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మదర్సా విద్యార్ధులకు గాయాలయ్యాయి. విద్యార్ధులు క్రికెట్ ఆడుతుండగా వారిని నిందితులు బ్యాట్లు, కర్రలతో కొట్టారని పోలీసులు తెలిపారు. క్రికెట్ మ్యాచ్ సాగుతుండగా ఈ ఘటన జరిగిందని ఉన్నావ్ ఎస్పీ మాధవ్ ప్రసాద్ వర్మ వెల్లడించారు.
నలుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మదర్సా నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. మరోవైపు విద్యార్ధులను జై శ్రీరాం నినాదాలు చేయాలని బలవంతం చేయలేదని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment