ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం పట్టిసీమ మొదటి దశను ప్రారంభిస్తారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో మీభూమి - మీ ఇంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజున షియోమి ఫోన్ల కంపెనీ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారన్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ, మరికొన్ని జిల్లాల్లో పర్యటిస్తారని పరకాల చెప్పారు.