అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!?  | Timely water for Krishna Delta every year for five years | Sakshi
Sakshi News home page

అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!? 

Published Sun, Nov 19 2023 5:21 AM | Last Updated on Sun, Nov 19 2023 5:21 AM

Timely water for Krishna Delta every year for five years - Sakshi

సాక్షి, అమరావతి: పట్టువదలని వక్రమార్కుడు (రామోజీ) ఎప్పటిలాగే మళ్లీ తన అభూత కల్పనలతో ఓ సత్యదూరమైన కథనాన్ని అల్లారు. ఈసారి ఆయన రాతల గాలి పట్టిసీమ గోదావరి జలాలపై మళ్లింది. ‘పట్టిసీమ నీరూ తేలేరా’ అంటూ శనివారం ‘ఈనాడు’లో పాఠకుల మీద తన పైత్యాన్ని రుద్దిన తీరుచూస్తే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం బురదజల్లడానికే ఈ తప్పుడు రాతలు అని మరోసారి తన మనస్సులో మాట­ను చెప్పకనే చెప్పుకున్నారు.

నిజానికి.. పులిచింతల, పట్టిసీమ ఎత్తి­పోతల జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకూ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందిస్తుంటే.. పది లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని రామోజీ.. తన కథనంలోని ప్రతి అక్షరంలో జగన్‌పై అక్కసు వెళ్లగక్కారు తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు.  

అప్పట్లో ఏనాడైనా సకాలంలో నీళ్లిచ్చారా? 
అసలు టీడీపీ సర్కార్‌ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఏనాడూ కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించిన దాఖలాల్లేవు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఏటా జూన్‌ మొదటి వారంలోనే నీళ్లందిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 7న కృష్ణా డెల్టాకు నీళ్లందిస్తే సకాలంలో నీళ్లందించలేదంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. ప్రస్తుత సీజన్‌ ప్రారంభంలో పులిచింతలలో 38 టీఎంసీలు నిల్వ ఉండేవి. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభం కానంత వరకూ కృష్ణా డెల్టాకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను విడుదల చేశారు.

బేసిన్‌లో వర్షాలు కురవడం.. గోదావరిలో వరద ప్రారంభమవడంతో జూలై 21న పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్‌చేసి.. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి జలాలను తరలించి డెల్టాకు విడుదల చేశారు. జూలై ఆఖరు, ఆగస్టు ప్రథమార్థంలో తెలంగాణలో కురిసిన వర్షాలవల్ల మూసీ నుంచి పులిచింతలలోకి 19 టీఎంసీలు చేరాయి. సీజన్‌ ప్రారంభంలో పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు 18 టీఎంసీలను విడుదల చేయకపోతే.. మూసీ వరద నుంచి వచ్చిన 19 టీఎంసీలు కడలి పాలయ్యేవి. ఇది ప్రస్తుత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. 

ప్రజాధనాన్ని వృథా చేయమంటారా? 
గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి పట్టిసీమ ద్వారా ఒక టీఎంసీని ఎత్తిపోయాలంటే రూ.2.65 కోట్లు వ్యయమవుతుంది. అయినా.. పులిచింతల, పట్టిసీమ జలా­లతో కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకూ నీళ్లందించాలని విద్యుత్‌ ఛార్జీలు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల నిర్వహణకు రూ.15.80 కోట్లను విడుదల చేశారు. మరోవైపు..  తెలంగాణలో, కృష్ణా, గుం­టూరు జిల్లాల్లో వర్షాలు కురవడంవల్ల ఉప నదులు, వాగులు, వంకల ద్వారా ప్రకాశం బ్యారే­జ్‌కు వరద నీరు చేరింది.

కృష్ణా డెల్టాలో మూడు దఫాలుగా భారీ వర్షాలు కురిసిన సందర్భాలలోనూ నీటి అవసరం తక్కువగా ఉంది. అలాంటి సందర్భా­ల్లోనూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తేసి సము­ద్రంలోకి వదిలేయడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయాలా రామోజీ? పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసిన 54.35 టీఎంసీలను పులిచింతల నీటికి జతచేసి డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందించింది.

డెల్టా ఎగువ ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. కాలువల ద్వారా నీటి సరఫరా మీద ఒత్తిడి తగ్గు­తుంది. ప్రస్తుతం పులిచింతలలో నిల్వ ఉన్న 13.61 టీఎంసీలను తాగునీరు, అత్యవసర సాగునీటి అవసరాలకే ఉపయోగిస్తారు. అదే చంద్రబాబు హయాంలో పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసినా కృష్ణా డెల్టాలో ఏటా లక్ష­లాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు నష్టపోయారు. అయినా రామోజీ పెన్ను ఏనాడూ పెగల్లేదు.

దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రోతరాతలుఅంతకుముందు.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి­­చేస్తానంటూ 2014, జూలై 28న శ్వేతపత్రం ప్రక­టించిన చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చు­చేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ధరల సర్దుబాటు (జీఓ–22), పరిమా­ణం ఆధారంగా బిల్లుల చెల్లింపు (జీఓ–63)ల ద్వారా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. రాబ­ట్టుకున్న కమీషన్లను చంద్రబాబు ముఠా పప్పు­బెల్లాల్లా పంచుకుంది. అందులో రామోజీకి వాటా దక్కింది.

నిజానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పి­స్తే పులిచింతలలో 45.77 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చునని.. కృష్ణా డెల్టాకు అది వర­మని అప్పట్లో సీఎం వైఎస్‌ జగన్‌ అనేకసార్లు చెప్పి­నా చంద్రబాబు పట్టించుకోలేదు. కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో దాదాపుగా ఒకేసారి వరద వస్తుంది. ప్రకా­శం బ్యారే­జ్‌ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలే. అలా­ంటప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తే.. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సము­ద్రంలోకి వదిలేయాల్సిందే.

పట్టిసీమకు పెట్టే వ్యయా­న్ని పోలవరంపై పెట్టి పూర్తిచేస్తే.. గ్రావిటీ­పై కృష్ణా డెల్టాకు నీళ్లందించవచ్చునని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ చెప్పారు. దీన్ని సాగునీటి­రంగ నిపుణులు, అధి­కా­రులు అప్పుడూ, ఇప్పు­డూ బలపరుస్తున్నారు. మరోవైపు.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాకే నిర్వాసితుల సమస్యను పరిష్క­రించి 2019 నుంచి పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వచేస్తున్నారు కాబట్టే.. ఏటా కృష్ణా డెల్టాకు సకాలంలో సమృద్ధిగా నీళ్లందించగలుగుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement