అంతర్గత విషయాలు బయటకు చెబుతారా?
కృష్ణారావుది విపరీత ధోరణి: పరకాల
సాక్షి, హైదరాబాద్: ఐవైఆర్ కృష్ణారావు చాలా పెద్ద మనిషి అని, అయితే ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. పరకాల హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా ఐవైఆర్ అత్యుత్తమ సేవలందించారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగే విషయాలను బయటకు చెప్పరాదనే నియమాన్ని పాటించలేదన్నారు.
ఆరు నెలలుగా సీఎం తనను కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న ఐవైఆర్ విమర్శల్లో నిజం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టింగ్‌లు విపరీత ధోరణిని సూచిస్తున్నాయని, ఇలా వ్యవ హరించడాన్ని ప్రభుత్వం అత్యంత అభ్యంతరక రంగా భావించిందన్నారు.