సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరును ప్రశ్నిస్తున్న ఆయనను మరోసారి టార్గెట్ చేసింది. అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఐవైఆర్ కృష్ణారావు బాహాటంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఆయన ఎత్తిచూపేందుకు ప్రయత్నించారు. దీంతో కక్ష పెంచుకున్న చంద్రబాబు సర్కారు.. ఆయనను కావాలనే ఈ పదవుల నుంచి తొలగించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment