కేసీఆర్ సర్కార్ను నిలదీయాలి: పరకాల | Parakala Prabhakar slams KCR government | Sakshi
Sakshi News home page

కేసీఆర్ సర్కార్ను నిలదీయాలి: పరకాల

Published Tue, Nov 4 2014 5:54 PM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

కేసీఆర్ సర్కార్ను నిలదీయాలి: పరకాల - Sakshi

కేసీఆర్ సర్కార్ను నిలదీయాలి: పరకాల

తెలంగాణలో విద్యుత్ కష్టాలకు టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమనడం దారుణమంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో విద్యుత్ కష్టాలకు టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమనడం దారుణమని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏపీకి రావాల్సిన 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ను తెలంగాణ ప్రభుత్వం అదనంగా వాడుకుందని పరకాల చెప్పారు. తెలంగాణ ప్రాంత రైతులకు విద్యుత్ ఇవ్వలేకపోవడానికి చంద్రబాబే కారణమనడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం పరకాల విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలంలో 1300 మెగావాట్ల విద్యుత్ను అక్రమంగా ఉత్పత్తి చేశారంటూ ఘాటుగా విమర్శించారు.

ఆ విద్యుత్ను ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. హైదరాబాద్లో రోజుకు రెండున్నర గంటలు విద్యుత్ కోత విధిస్తే.. తెలంగాణలో రైతులందరికీ విద్యుత్ అందేదని ఎద్దేవా చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నిలదీయాలన్నారు. తాము 900 మెగావాట్ల విద్యుత్ను అదనంగా కొనుగోలు చేశామని, రోజుకు రూ. 11.5 కోట్లు విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క యూనిట్ను కూడా అదనంగా కొనుగోలు చేయలేదని ఆయన అన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విద్యుత్ను కొనుగోలు చేయలేదో తెలంగాణ ప్రజలే నిలదీయాలన్నారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ పీపీఏ వ్యవహారం కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్ధ(సీఈఆర్సీ) పరిధిలో ఉందని పరకాల గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement