ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. చంద్రబాబుకు పరకాలకు మధ్య సంబంధాలు అంతగా లేవని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.