'దొంగే దొంగన్నట్టుగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దొంగే దొంగన్నట్టుగా వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువగా విద్యుత్ ను వినియోగించిందని ఆయన పేర్కొన్నారు. 364 మిలియన్ యూనిట్లు విద్యుత్ ను ఏపీ కంటే తెలంగాణ అదనంగా వాడుకుందన్నారు. కర్నూలు, అనంతలోని పవన విద్యుత్ తెలంగాణకు ఎలా వస్తుందని పరకాల ప్రశ్నించారు. జీవో 26, 53 ప్రకారం తెలంగాణకు ఆ విద్యుత్ పై ఎలాంటి హక్కు ఉండదని పరకాల తెలిపారు. జల విద్యుత్, థర్మల్ విద్యుత్ కలిపి.. 141 మిలియన్ యూనిట్ల అదనంగా తెలంగాణ పొందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఉల్లంఘనపై తమ సీఎస్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారన్నారు.
టీ.ప్రభుత్వం అధికారులు, పోలీసుల వైఖరిపై నివేదిక అందించారన్నారు. అన్ని చోట్లా గొడవలు పడ్డ తెలంగాణ అధికారులు తిరిగి తమ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని పరకాల ఎద్దేవా చేశారు.