
సీమాంధ్ర నేతలు చేతకాని దద్దమ్మలు: పరకాల
రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలే కారణమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ ఆరోపించారు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో చేతకాని దద్దమ్మల్లా వ్యహరించారని ఆయన విమర్శించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తన ఎడమకాలి బూటు దుమ్ముతో సమానమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ)లో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు పరకాల ప్రభాకర్ మద్దతు పలికారు. రాష్ట్ర విభజన రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న పంచాయతీ కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో విభజనవాదులు, సమైక్యవాదుల మధ్య జరుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు. తుది విజయం సమైక్యవాదానిదే అని పరకాల ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.