Governor Abdul Nazeer Participated In Sri Krishnadevaraya University 21 Convocation Program - Sakshi
Sakshi News home page

ఎస్కేయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ నజీర్‌

Published Mon, Jul 17 2023 11:22 AM | Last Updated on Mon, Jul 17 2023 12:24 PM

Governor Abdul Nazeer Participated In SK University Convocation Program - Sakshi

సాక్షి, అనంతపురం: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అనంతపురం పర్యటనలో ఉన్నారు. కాగా, ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహానికి గవర్నర్‌ నజీర్‌ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నూతన అకాడమీ, హాస్టల్‌ భవనాలను గవర్నర్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌ నజీర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో.. అన్ని అవకాశాలు ఉన్నాయి. విద్య శక్తివంతమైన ఆయుధం అన్న విషయం మరిచిపోవద్దు. కృషి, పట్టుదల, సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చు. విద్యార్థులు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. కేంద్రం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement