పాసు పుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు | bank loans without pass books | Sakshi
Sakshi News home page

పాసు పుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు

Published Tue, Jul 28 2015 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

bank loans without pass books

హైదరాబాద్: ఇక మీద రైతులు పట్టాదారు పాసుపుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు 13 వేల ట్యాబ్లు ఇస్తున్నామని తెలియజేశారు. వాటి ద్వారానే రైతుల భూములు అప్లోడ్ చేస్తామన్నారు.

భూ యజమానుల వివరాలతో పాటు పంటల వివరాలు కూడా  ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. రైతుల భూమి రికార్డుల సమస్యలన్నింటినీ గ్రామసభల్లో పరిష్కరిస్తామన్నారు. అందుకోసం ఆగస్టు నెల 10 నుంచి 30 వరకు రాష్ట్రంలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement