
'నకిలీ గాంధీ తెలుగు ప్రజలను విడగొడుతోంది'
సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు ఆమోదింప జేసుకునే వరకు వెంటాడాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో వేలాది మందితో కందపురి సమైక్య గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా సరై సమైక్యాంధ్రను సాధించుకుందామని అన్నారు. గతంలో దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ తెలుగు ప్రజలను సమైక్యంగా ఉంచితే, నకిలీ గాంధీ అయిన సోనియా తెలుగు ప్రజలను విడగొడుతుందని ఆయన ఆరోపించారు. కందపురిలో ఏర్పాటు చేసిన సమైక్య గర్జన సభ సమైక్య నినాదాలతో దద్దరిల్లింది. పలు జిల్లాల నుంచి అసంఖ్యాకంగా ప్రజలు ఆ సభకు విచ్చేశారు.