'హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి' | We want spl status and spl packag for andhra pradesh, says parakala prabhakar | Sakshi
Sakshi News home page

'హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి'

Published Sun, Aug 23 2015 12:09 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి' - Sakshi

'హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి'

ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే సరిపోదు.... ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన పరకాల ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడారు. ఆగస్టు 25న ముఖ్యమంత్రి చంద్రబాబు.... ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.

ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇన్నాళ్లు జనం మధ్యకు రావడానికే ఇబ్బంది పడిన నేతలు ఇప్పుడు టీడీపీని విమర్శించడం తగదంటూ కాంగ్రెస్ నేతలను పరోక్షంగా విమర్శించారు. అప్రజాస్వామిక పద్దతిలో రాష్ట్రాన్ని చీల్చినవారికి ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదని పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement