రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాధినేతకు అడ్డూఅదుపూ లేదట. మరి ఏపీలో ప్రభుత్వ వ్యవహారాల్లో అడ్డూ అదుపూ ఉన్నాయా? ట్రావెల్ కంపెనీలు నిర్భయంగా నగరాల్లో కబ్జాలు చేసి దొరికిపోతున్నా ప్రభుత్వం చలించదు. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కార్ రేసులో ఓ నిండుప్రాణాన్ని బలిగొన్నా నామమాత్రపు అరెస్టుతో సరిపె ట్టారు. ఇంకో టీడీపీ నేత తనకు బదులు మరొకరిని పరీక్షకు కూర్చోబెట్టిన తతంగం దుమారం రేపినా ప్రభుత్వ పెద్దలు చలిం చరు. ఏ కేసులూ లేని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యకేసులేంటి? ఇంటిపై దాడులేంటి? పార్టీ కార్యకర్తలపై బెదిరింపులేమిటి? వరుస హత్యలేమిటి? పార్టీ కార్యకర్తలకు మేలుచేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే కలెక్టర్ల సమా వేశాల్లో ప్రకటించినా ఎవరూ కిమ్మనరు.
ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన బాసలు మాయమాటలుగా తేలి జనం తూర్పార పడుతు న్నా పరకాలకు చీమకుట్టినట్లు ఉండదు. పర రాష్ట్రంలో ప్రభు త్వానికి అడ్డూఅదుపూ లేకపోవడంపై వేలెత్తి చూపే ముందు మన బంగారం సంగతి కూడా పరకాల వారు పరిశీలించాలి.
-డి.ఎం. రాజు, విజయవాడ