హైదరాబాద్:తుపాను ప్రాంతాల్లో ఆదివారం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 65 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. తుపాను సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇదిలా ఉండగా తుపానులో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర బాధితులకు విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు.
టీడీపీని విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో సాధారణ జనజీవన పరిస్థితులు వచ్చేంత వరకూ ఇక్కడ ఉండే పర్యవేక్షిస్తామని మరోమంత్రి కిమిడి మృణాళిని తెలిపారు.