
ఆ సంభాషణ చంద్రబాబుది కాదు: పరకాల
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ముడుపుల వ్యవహారంలో తాజాగా బహిర్గతమైన ఆడియో టేపుల్లోని సంభాషణ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. అసలు ఈ ఆడియో ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అక్కడక్కడ మాట్లాడిన మాటలన్నీ కలిపి టెక్నాలజీ సాయంతో ప్రజలను నమ్మించేందుకే సృష్టించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేరం అని, కావాలనే ట్యాప్ చేశారేమో చెప్పాలని పరకాల డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టబోమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు.
ప్రభాకర్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు..
*ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలు చంద్రబాబువి కావు
*ఈ సంభాషణ ఎక్కడ్నుంచి వచ్చింది.. టెలిఫోన్ ట్యాపింగ్ నేరం
*అక్కడక్కడ మాట్లాడిన మాటలను పేర్చి ఆడియో టేపులను తయారు చేశారు
*ఇది మామాలుగా విడిచిపెట్టే వ్యవహారం కాదు..దీని అంతు చూస్తాం.
*మా సీఎంను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు
*మాకు నోటీసులు రాలేదు, పంపే ధైర్యం చేయరు
*రేపు తాము నిర్వహించే మహాసంకల్ప దీక్షను ప్రజలు దిగ్విజయం చేయాలి
* మా సభను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తాం
*మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే కుట్ర
*తెలంగాణ హోంమంత్రి టేపులున్నాయని ముందే చెప్పారు
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా?
*ఇదంతా తమపై కుట్ర కాదా?
* మహాసంకల్ప దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర
*రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తున్నారు
*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పని కాదా?
*ఇది ఎలా తీసుకొచ్చారో చెప్పండి..
* ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేశామని చెప్పగలరా?
*దీనిపై అన్నిరకాలుగా ఫైట్ చేస్తాం
*ఇది చాలా నీచమైన పని.. కుట్రపూరితమైన పని
*బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పనికాదు
*అన్నీ టేపులు కోర్టుకు సమర్పించామన్నప్పుడు మరి ఈ టేపులు ఎక్కడివి?