revanth reddy case
-
Ktr : గుంజుకునేందుకు అధికారం నోట్ల కట్టలు కాదు
సాక్షి, హైదరాబాద్: ‘అధికారాన్ని గుంజు కుంటాం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. కానీ గుంజుకునేందుకు అధికారం నోట్ల కట్టలలాం టిది కాదు. నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో చంచల్‌గూడ జైలుకు పోయిన వ్యక్తి అదే తరహాలో పీసీసీ అధ్యక్ష పదవి కొను గోలు చేశాడని నీ సొంత పార్టీ నేతలే చెప్తున్నారు..’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. సింగరేణి కార్మిక సంఘం నేత కెంగర్ల మల్లయ్య తన అనుచరులతో కలిసి గురువారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. టీడీపీని వీడినా పాత వాసన పోవడం లేదు ‘నీ స్థాయికి కేసీఆర్ పేరును ఉచ్ఛరించే అర్హత కూడా లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని బలిదేవత అని వర్ణించిన రేవంత్.. ప్రస్తుతం ఆమెను తెలంగాణ తల్లి అని కీర్తిస్తున్నారు. రేపో ఎల్లుండో చంద్రబాబును తెలంగాణ తండ్రి అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఆయన టీడీపీని వీడినా పాత వాసన పోవడం లేదు, ఇప్పటికే టీపీసీసీని టీడీపీసీసీ అని పిలుస్తున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు, పీసీసీ అధ్యక్ష పదవి దొరకడంతో ప్రధానమంత్రి పదవి వచ్చినంత బిల్డప్ ఇస్తున్నాడు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న దరిద్రుడు. నోట్ల కట్టలతో కెమెరా ముందు దొరికి నీతి మాటలు చెప్తున్నాడు..’ అని విమర్శించారు. కేసీఆర్‌తో తలపడాలంటే డైలాగ్‌లు సరిపోవు ‘తెలంగాణలో కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదు. ఈ నడుమ మార్కెట్లోకి వచిన కొందరు కొత్త బిచ్చగాళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వేరే రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు కానీ మీరు తలపడుతున్నది తెలంగాణ తెచ్చిన సీఎంతో. తెలంగాణ కోసం 20 ఏండ్ల నుంచి రాజీలేని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడితో తలపడాలంటే కేవలం డైలాగ్‌లు సరిపోవు. కేసీఆర్‌ను తిడితే పెద్ద నాయకులం అవుతామనే ఆలోచన మానుకుని, ఆయనకంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అక్కడో ఇక్కడో రెండు ఓట్లు వస్తయి..’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి ‘ప్రస్తుతం తెలంగాణలో పోటాపోటీ పాదయాత్రల సీజన్ నడుస్తోంది. నలుగురైదుగురు పాదయాత్రలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలే కరోనాతో ఆరోగ్యాలు దెబ్బతిన్నయి. పాదయాత్రలతో వారి ఆరోగ్యాలు సెట్ అవ్వాలని కోరుకుంటున్నా. పాదయాత్రలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతి పల్లెకూ వెళ్లి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి రావాలి. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. ఏడేండ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో కూడా చెప్పాలి. హుజూరాబాద్‌కు వేయి కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చేలా చూడాలి’ అని కేటీఆర్ అన్నారు. సమన్వయంతో పనిచేయాలి ‘సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతారు. కాబట్టి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలి..’ అని పిలుపునిచ్చారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సై ఫిర్యాదు, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేసి, రాకపోకలకు అంతరాయం కలిగించారని జూబ్లీహిల్స్ ఎస్ఐ యాకన్న ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ఉత్సాహం.. సిటీలో ట్రాఫిక్ నరకం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో బుధవారం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో హడావుడిగా మధ్యాహ్నం వీటిని జారీ చేశారు. అప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానుల వాహనాలతో గాంధీభవన్ రోడ్డు నిండిపోవడంతో ఆ చుట్టుపక్కల మార్గాల్లో ప్రయాణించిన నగర జీవి నరకం చవిచూశాడు. ట్రాఫిక్ మళ్లింపులపై ముందురోజే ఆంక్షలు విధించడం ఆనవాయితీ. అయితే ఎందుకో ఈ సారి విస్మరించారు. బుధవారం మధ్యాçహ్నానికే అబిడ్స్, కోఠి, నాంపల్లిలతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. అప్పుడు మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు గాంధీభవన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు అంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
కోర్టులో వాదనలు ఎలా జరిగాయి?
ఓటుకు కోట్లుకేసులో మొదటి నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణ ఆద్యంతం ఉత్కంఠంగానే సాగింది. వచ్చే మంగళవారాని(జూన్ 30)కి బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు వెల్లడించింది. దాదాపు గంటసేపు వాదనలు, ప్రతివాదనలు, న్యాయమూర్తి ఛలోక్తుల మధ్య విచారణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అడుగేస్తే.. అడుగేయలేం.. కేసు విచారణకు గంటముందుగానే హైకోర్టులోని 11వ నంబరు హాలు కిక్కిరిసిపోయింది. న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు రాకతో మొత్తం అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ముందుగా తన బృందంతో కోర్టుహాలుకు చేరుకున్నారు. ఆతర్వాత రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు హాల్లోకి ప్రవేశించారు అప్పటికే కోర్టు హాలు నిండిపోవడంతో సిద్ధార్థ లూథ్నా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఈకేసును వాదించాల్సింది తామే.. దయచేసి కాస్త స్థలం ఇవ్వండంటూ సిద్ధార్థ బృందంలోని న్యాయవాది ... అక్కడున్నవారికి విజ్ఞప్తిచేశారు. కాసేపటి తర్వాత ఏసీబీ తరఫు న్యాయవాదులు, వారి ప్రతినిధులు వచ్చేసరికి.. అప్పటికే నిండిపోయిన ఉన్న కోర్టు హాల్లో నిలబడ్డమే కష్టంగా మారింది. ఈగంట వ్యవధిలోనే రేవంత్ కు బెయిల్ వస్తుందా, లేదా అన్నదానిపై న్యాయవాదుల మధ్య చాలా చర్చోపచర్చలు సాగాయి. బెయిల్ వస్తుందని కొందరు, రాదని కొందరు.. ఇలా తలోరకంగా తమతమ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 2:15 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ ఇళంగోవ్ కోర్టులోకి ప్రవేశించారు. పూర్తిస్థాయిలో నిశ్చబ్ధ వాతావరణం కనిపించింది. కోర్టులో వినిపించని టీడీపీ వాదనలు.. ఓటుకు నోటు కేసు వచ్చినదగ్గరనుంచి తెలుగుదేశం పార్టీ నేక వాదనలు వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబుకూడా రోజుకో వాదనలు చేస్తున్నారు. స్గింగ్ ఆపరేషన్లు చెల్లవని ఒకసారి, రేవంత్ రెడ్డిన కుట్రలో ఇరికించారని ఒకసారి, ఈకేసు ఎన్నికలసంఘం పరిధిలోకి వస్తుందని మరోసారి, ఫోన్ ట్యాప్ చేశారని, ఇది అక్రమమని ఇంకోసారి.. ఇలా పలురకాల వాదనలు వినిపిస్తున్నారు. ప్రజలముందు డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని కోర్టులో మాత్రం రేవంత్ రెడ్డి తరఫున్యాయవాదులెవ్వరూ ఇందులో ఒక్క మాటనుకూడా కోర్టు ఎదుట ప్రస్తావించలేదు. ఈకేసులో ఎఫ్ ఐ ఆర గురించి డిఫెన్స్ లాయర్ ప్రస్తావించగానే జడ్జి అడ్డుకున్నారు. ఈదశలో ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించడం సరికాదన్నారు. ప్రాథమికంగా నేరం జరిగినట్టేనని పలుమార్లు కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఎమ్మెల్యే కొనుగోలు ప్రయత్నం, డబ్బు, వీడియోలు ఉన్నాయని కోర్టు ప్రస్తావించింది. రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకివ్వాలో అన్నదానిపై మాత్రమే వాదనలు వినిపించాలని న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ సిద్ధార్థకు స్పష్టంచేశారు. ఈకేసులో ఇప్పటికే నిందితుడు 26 రోజులు పాటు రిమాండ్ లో ఉన్నారని, విచారణకోసం ఐదురోజులు కస్టడీకి కూడా తీసుకున్నారని కోర్టుకు నివేదించారు. ప్రత్యక్ష సాక్షుల విచారణ, వారి స్టేట్ మెంట్లనుకూడా తీసుకున్నారని కోర్టు ముందు ఉంచారు. ఏసీబీ ఆధారాలుగా చెప్తున్న వీడియో, ఆడియో టేపులన్నీ.. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఉన్నాయని, ఈకేసులో ఇంతకన్నా విచారించాల్సింది.. ఏమీ లేదని కోర్టుకు తెలిపారు. గతంలో నిందితుడికి ఒకరోజు బెయిల్ ఇస్తే.. కోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకున్నారని,ఇప్పుడు కూడా ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం వ్యక్తంచేయకుండా పాటిస్తామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గట్టిగా వాదించారు. ఈకేసుపూర్వాపరాలను చెప్తున్న సమయంలో.. జడ్జి జోక్యంచేసుకున్నారు. మొత్తం వివరాలను తాను చదివానన్నారు. వీడియోకూడా తాను టీవీల్లో చూశానని జడ్జి రాజా ఇళంగోవ్ చెప్పుకొచ్చారు. బెయిల్ ఎందుకు ఇవ్వరాదో వాదనలు వినిపిస్తే చాలన్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకు నిరాకరించాలో చెప్తూ ఏడు కారణాలను ఏజీ కోర్టు ముందు ఉంచారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, రాజకీయంగా అత్యంత పలుకుబడి వారు అయినందున కేసును ప్రభావితంచేస్తారని కోర్టు ముందు ఉంచారు. ఈకేసులో పట్టుబడ్డ డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో, మిగిలిన నాలుగున్నరకోట్లు ఎక్కడున్నాయి, మొత్తం ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చెందిన పార్టీ పక్కరాష్ట్రంలో అధికారంలో ఉందని, పైగా ఢిల్లీలో వీళ్లకు చెందినవారు అధికారంలో ఉన్నారన్న విషయాన్ని కోర్టు ఎదుట ఉంచారు. ఇప్పటికే ఈ కేసులోనోటీసు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణాధికారి ఎదుట హాజరుకాలేదన్న విషయాన్ని ఏజీ కోర్టుకు తెలిపారు. నాలుగో నిందితుడైన మత్తయ్య ఇప్పటికీ దొరకలేదని, పక్కరాష్ట్రంలో దాక్కుంటున్నారని చెప్పారు. దర్యాప్తు మొత్తం ఇంకా ప్రాథమిక దశలో ఉందని, కాల్ డేటాను కూడా విశ్లేషించాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సమయంలో... సమాచారం రాలేదా? అంటూ జడ్జి ఏజీని ప్రశ్నించారు. కస్టడీ సమయంలో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఏపార్టీకి ఎంతమందికి ఉన్నారు,, ఏపార్టీనుంచి ఎవరు పోటీచేశారు.. తదితర అంశాలపై జడ్జి ఇళంగోవ్ ప్రశ్నలు వేశారు. టీడీపీకి ఎంతమంది ఎమ్మెల్యే లు ఉన్నారో కూడా అడిగి తెలుసుకున్నారు. అదేసమయంలో జేఎంఎం కేసునుకూడా జడ్జి ప్రస్తావించారు. ఓటుకు నోటు అనే మాట మొదట ఈకేసు నుంచే వచ్చింది కదా? అని జడ్జి అన్నారు. ఓట్లు కొనుగోలు చేయడం అనేది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఏజీ ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చేటప్పుడు నేర తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని ఏజీ వాదించారు. 10 మంది ఎమ్మెల్యేలను కొని ఉంటే... ప్రభుత్వమే కూలిపోయేదన్న అంశాన్ని కోర్టుకు ముందు ఉంచారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్న వ్యక్తులు, దర్యాప్తును అడ్డుకోలేరా? అంటూ ఏజీ.. భయాన్నీ, సందేహాలనూ వ్యక్తంచేశారు. ఇక ఈ కేసులో నేరం రుజువైతే ఎంతకాలం శిక్షపడే అవకాశం ఉందని న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్్ను అడిగారు. దీంతో కనిష్ఠంగా ఆరునెలలు గరిష్ఠంగా ఐదేళ్ల శిక్షపడే అవకాశం ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఆ రెండు కారణాలు... రేవంత్ రెడ్డికి బేయిల్ నిరాకరించాలంటూ అడ్వకేట్ జనరల్ చెప్పిన ఏడుకారణాల్లో కేవలం రెండు మాత్రమే ఆయనకు అనుకూలంగా ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బెయిల్ ఇస్తే.. విచారణను ప్రభావితం చేయడంతోపాటు, సండ్రవెంకట వీరయ్య విచారణకు హాజరుకాకపోవడం, మత్తయ్య పరారీలో ఉండడాన్ని కోర్టు తీవ్రంగానే పరిగణించింది. అయితే ఏడేళ్లకంటే తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టు చేయకూడదంటూ చట్టం చెబుతున్న అంశంకూడా వాదనల్లో ప్రస్తావనకు వచ్చింది. అఇయతే సాధారణ కేసుల్లా కాకుండా ఈకేసును ప్రత్యేకంగా చూడాలని, నేర స్వభావం, తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని ఏజీ కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్నతర్వాత మంగళవారం తీర్పు వెల్లడిస్తానని జడ్జి ప్రకటించారు. తమ వాదనలను లిఖిత పూర్వకంగా ఇస్తామని ఏజీ కోర్టుకు చెప్పగానే, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ ముగిసిన కొన్ని నిమిషాల్లోనే ఏసీబీ కోర్టు.. అవినీతినిరోధకశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును అందించింది. లిఖితపూర్వక వాదనల్లో ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టునుకూడా కోర్టు ముందు ఉంచే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెప్తున్నారు. -శ్రీహరి, సాక్షి టీవీ -
కనిమొళి కేసుతో రేవంత్ కేసుకు పోలిక?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ప్రధాన పాత్రధారి రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికరమైన వాదనలు వినిపించాయి. ఇంతకుముందు దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన 2జీ స్కాంలో ప్రధాన నిందితురాలైన డీఎంకే ఎంపీ కనిమొళి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను, సుప్రీం వ్యాఖ్యలను తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. కనిమొళి కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. 2జీ స్కాం వెలుగు చూసిన తర్వాత ఎంపీ కనిమొళి దాదాపు 190 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆమె ఐదుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆమె చాలా శక్తిమంతమైన మహిళ అని, ఇలాంటి కీలకమైన కసులో ఆమెకు బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని వ్యాఖ్యానించి.. బెయిల్ మాత్రం మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రస్తావించి, అప్పుడు 2జీ కేసు ఎంత ప్రముఖమైనదో, ఇప్పుడు ఓటుకు కోట్లు కేసు కూడా అంత ప్రాముఖ్యం కలిగినదేనని చెప్పారు. -
'రేవంత్ కేసులో ఎవరితోనూ లాలూచీ పడలేదు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇస్తూ పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు విషయంలో తాము ఎవరితోనూ లాలూచీ పడలేదని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కారు రాజీ పడిందనే ఆరోపణలపై నాయిని పై విధంగా స్పందించారు. ఆ కేసు విషయంలో తాము లాలూచీ పడే అంశమే లేదన్నారు. ఏసీబీ తనపని తాను చేసుకుపోతుందని.. ఈ కేసులో ఎంతటి వారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా నాయిని తెలిపారు. -
రేవంత్ కేసునుంచి బాబు తప్పించుకోలేరు
గుంటూరు: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పరువు తీశారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ ప్రధాని నరేంద్రమోదీ కాళ్లు పట్టుకొనైనా ఈ కేసు నుంచి చంద్రబాబు బయటపడాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటుచేశారు. ఇందులో బొత్స ఇతర వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మతో కలిసి మాట్లాడారు. రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. మత్తయ్యకు చంద్రబాబు ఆశ్రయం కల్పించడం సిగ్గు చేటు అని అంబటి రాంబాబు విమర్శించారు. సెక్షన్ 8 గురించి ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. ఇక ఉమ్మారెడ్డి మాట్లాడుతూ రేవంత్ వ్యవహారం చూసిన తర్వాత కూడా చంద్రబాబు బుద్ధి మారడం లేదని అన్నారు. బలం లేకున్నా ప్రకాశం కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు బరిలోకి దింపారని ఆరోపించారు. ఓట్లను కొనుగోలు చేయాలనే దుర్భుద్దితోనే చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ఇక వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేసు నుంచి చంద్రబాబు ఏమాత్రం తప్పించుకోలేరని అన్నారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేస్తూ పట్టుబడిన వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. -
'ఏపీ ప్రజలతో మాకు శత్రుత్వం లేదు.. బాబుది తప్పే'
హైదరాబాద్: ఇప్పటికైనా తన తప్పును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ క్రమశిక్షణ తప్పిందని ఆరోపించారు. తప్పు చేసినందుకే చంద్రబాబునాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారేనని.. సూత్రధారి మాత్రం చంద్రబాబు అని చెప్పారు. -
సూట్ కేసు రాజకీయం బాబుదే
హైదరాబాద్: సూట్ కేసు రాజకీయం నడిపింది చంద్రబాబునాయుడేనని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయనను ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఆయన వేసిన రాజకీయ చదరంగంలో ఆయనే ఇరుక్కున్నారని చెప్పారు. ఇద్దరు చంద్రులు నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అని అనుకుంటున్నారని విమర్శించారు. ఆ ఇద్దరు రాజకీయ విలువలు కాపాడటం లేదని చెప్పారు. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దృష్టంతా రాజధాని హైదరాబాద్‌పైనే ఉందని, రాష్ట్రంలో రైతుల ఇబ్బందులను ఆయన పట్టించుకోవటం లేదని అన్నారు. రైతులు రుణ మాఫీ కాక ఆందోళన చెందుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీనిపై తాము ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కమీషన్ల కోసమే వాటర్ గ్రిడ్ పథకం చేపట్టారని, కేసీఆర్ కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని చెప్పారు. -
మీకు కష్టం వస్తే..కేంద్రం గుర్తుకు వస్తుందా
-
వెంకయ్యనాయుడితో చంద్రబాబు బేటి
-
బాబు సిద్ధాంతం మాత్రం డిఫరెంట్
-
నాకో నీతి ! మీకో నీతి !
-
ఓటుకినోటు కేసులో లోకేష్ ప్రమేయం!
-
చంద్రబాబుపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ ఫిర్యాదు
-
మేం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయలేదు: ఏకే ఖాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తదితరుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారాలని తెలంగాణ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) డైరెక్టర్ జనరల్ అబ్దుల్ ఖయ్యుం ఖాన్ ఖండించారు. తెలంగాణ ఏసీబీ పూర్తి వృత్తి నిబద్ధత కలిగిన దర్యాప్తు సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఏ కేసు విషయంలోనైనా పూర్తిగా చట్టం, నియమనిబంధనలకు లోబడి దర్యాప్తు చేస్తోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆ రాష్ట్ర ముఖ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని వార్తాపత్రికలు, చానళ్లల్లో వస్తున్న వార్తలను ఖండిస్తూ మంగళవారం రాత్రి ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోడానికి ఆ పార్టీ ‘బాస్’ నేతృత్వంలో జరిగిన భారీ కుట్రను తెలంగాణ ఏసీబీ చేదించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అదే విధంగా మంగళవారం ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఓ మంత్రివర్గ ఉప సంఘాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై తెలంగాణ ఏసీబీ స్పందిస్తూ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేయడం గమనార్హం. ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్సన్ ఫిర్యాదు అనంతరం ఆయన ఫోన్‌పై ఏసీబీ నిఘా వుంచగా, ఆయనకు చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్య నేతల ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేసిన విషయం బయటపడిందని తెలుస్తోంది. -
చంద్రబాబుపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ ఫిర్యాదు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం చంద్రబాబునాయుడు రూ. కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకోని చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: యనమల
-
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోన్ ను తెలంగాణ ప్రభుత్వ ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశామని తెలంగాణ ప్రభుత్వమే చెప్తోందని, ఇది వ్యక్తిగత భద్రత విషయమని, ఇలా ఫోన్ ట్యాప్ చేశామని చెప్పి వదంతులు వ్యాపింపజేయడం సరికాదని అన్నారు. అవసరమైనట్లు కేసును మార్చుకుని ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేశారని తెలిపారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు ఇలా చేశారని, ఈ విషయాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకున్నామని, కేంద్ర హోంమంత్రికి నివేదిక తప్పకుండా ఇస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ముగ్గురు కేబినెట్ మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. దాదాపు 125 టేపులు రికార్డు చేసినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అసలు టేపులు ఎక్కడనుంచి వచ్చాయి? ఎందుకు వాటిని ప్రసారం చేయాల్సి వచ్చిందో తేలాల్సినవసరం ఉందని చెప్పారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరమని, అది చట్ట విరుద్ధమని అన్నారు. పునర్విభజన చట్టంలో సెక్షన్ 8 గురించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించామని యనమల అన్నారు. దీంతోపాటు చంద్రబాబు పోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా చర్చించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము ఎన్నిసార్లు గవర్నర్ కు నివేదించుకున్నా విభజన చట్టంలోని అంశాల విషయంలో ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు రేపు ప్రధానిని, జైట్లీని అవసరం అయితే హోంశాఖ మంత్రిని కలిసి వివరిస్తారని తెలిపారు. ఉమ్మడి రాజధానిలో పౌరుల హక్కుల రక్షణకు అన్ని నిబంధనలు ఉన్నాయని, ఈ విషయంలో గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. విభజన చట్టం ఆదరాబాధరాగా చేశారని, చివరికి వ్యక్తిగత భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని చెప్పారు. ఈ అంశంపై కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్, కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కేంద్ర హోంశాఖను కలిసి కేబినెట్ మంత్రులే ఈ తీర్మానం అందజేస్తారని తెలిపారు. -
బాబు తీరు దొరికిపొయిన దొంగలా ఉంది
-
ఓ నేరం గురించి చర్చకు కేబినెట్ మీటింగా?
హైదరాబాద్: ప్రజల సమస్యలు చర్చించనప్పుడు కేబినెట్ సమావేశం ఎందుకు అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఏపీ ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముడుపుల కేసు వ్యవహారానికి ఇంత ప్రాధాన్యం ఇస్తారా అని అన్నారు. ఓ నేరం గురించి మాట్లాడేందుకు ఏపీ కేబినెట్ సమావేశం కావాలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముడుపుల కేసు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆడియో టేపులు బయటపడటంతో పలు రాజకీయ వర్గాలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నాయి. -
'బాబును ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏపీ ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తన వ్యక్తిగత సమస్యతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య సృష్టించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు తనపైనే అపనమ్మకం అని, అందుకే ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నారని అన్నారు. -
ఏసీబీ కేసు చట్టం ఏం చెప్తోంది?
-
'బాబూ.. నీ సొంత తప్పును ప్రజలపై రుద్దొద్దు'
చిత్తూరు: వ్యక్తిగతంగా చేసిన తప్పుతో నెలకొన్న వివాదాన్ని రెండు రాష్ట్రాలకు, ప్రజలపై రుద్దొద్దని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. రేవంత్ తీగ లాగితే చంద్రబాబు డొంకంతా కదిలిందని చెప్పారు. నిజంగా నైతిక విలువలుంటే చంద్రబాబునాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలను బెదిరించేలా మాట్లాడారని, ఇప్పుడు సభలో కూడా అలాగే మాట్లాడుతున్నారని చెప్పారు. పార్టీ వాళ్లేమో ఆ గొంతు చంద్రబాబుది కానే కాదని అంటుంటే.. చంద్రబాబు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అయిందంటున్నారని ఇందులో ఏ విషయాలు ప్రజలు నమ్మాలని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని తెలుగు ప్రజలందరికీ అపాధించడం సరికాదని చెప్పారు. ఎంసెట్, నదీజలాలు, విద్యుత్, విద్యార్థుల వివాదాలు తలెత్తినప్పుడు నోరు విప్పని చంద్రబాబునాయుడు ఇప్పుడు సొంత వ్యవహారాన్ని మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపెట్టి గందరగోళం రేపుతున్నారని చెప్పారు. -
'ఆ గొంతు బాబుదే'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముడుపుల వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపుల్లోని గొంతు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో సూత్రధారి ఆయనేనని చెప్పారు. ఎమ్మల్యేలను కొనుగోలు చేసే విషయంలో చివరికి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలను కొనేందుకు కూడా చంద్రబాబు బేరాలాడారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. అసలు విషయం బయటకు పొక్కడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టుకుందని, ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
చంద్రబాబుకు పాలించే అర్హత లేదు: జలీల్‌ఖాన్
విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం ఎమ్మెల్యేతో ఫోన్లో బేరసారాలు సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని తక్షణమే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ డిమాండ్ చేశారు. అవినీతికి కేరాఫ్‌గా మారిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై చంద్రబాబు మౌనంగా ఉంటూ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడించటం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. బాబు హుందాగా తనపై విచారణకు డిమాండ్ చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ మాట్లాడుతూ.. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబును అరెస్టు చేయాలి: పొంగులేటి
-
సీబీఐతో విచారణ జరిపించాలి
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. దీనిపై అన్ని రాజకీయ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలంటూ సూచిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని అంత తేలికగా వదిలిపెట్టకూడదని కూడా ఆయన లేఖలో సూచించినట్లు సమాచారం. -
'గతంలో ప్రభుత్వాలే కూలిపోయాయి'
-
’నిప్పులాంటి మనిషైతే ...నిరూపించుకోండి:అంబటి’
-
'గతంలో ప్రభుత్వాలే కూలిపోయాయి'
విజయవాడ::నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు బహిర్గతం కావడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో తీవ్ర అలజడి రేగుతోంది. ఆడియో టేపుల వ్యవహారంపై ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఓ జెడ్ క్యాటగిరి ఉన్న సీఎం ఫోన్లను ట్యాప్ చేస్తారా?అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారం చట్ట విరుద్దమని.. దీనిపై రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో ఇటువంటి వివాదాలతో ప్రభుత్వాలే కూలిపోయాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు నమోదు చేయాలన్నారు. -
నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి'
-
'చేసిన తప్పులను ఒప్పుకోవాలి'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకుని వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వ్యాఖ్యానించారు. స్వయంగ చంద్రబాబే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్టు రుజువైందన్నారు. ఆడియో టేపులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆడియో టేపులపై అనుమానాలు ఉంటే ఎలాంటి పరీక్షలైనా చేసుకోవచ్చని గణేష్ తెలిపారు. -
'నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి'
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో భాగంగా నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు తనవి కావని టీడీపీ చెప్పడంపై వైఎస్సార్ సీపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారం నుంచి చంద్రబాబు బయటపడటానికి యత్నిస్తూ ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ నేతలు మైసూరా రెడ్డి, పార్థసారధిలు విమర్శించారు. వారు సోమవారం మీడియాతోమాట్లాడుతూ.. ఈ అంశాన్ని రాష్ట్రాల మధ్య సమస్యగా అంటగట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారని విమర్శించారు. ఇది ఎంతమాత్రం రాష్ట్రాల మధ్య సమస్య కాదని.. వ్యక్తుల మధ్య సమస్య మాత్రమేనని స్పష్టం చేశారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్దోషి అయితే విచారణ జరిపించుకుని నిరూపించుకోవాలన్నారు. ఓటుకు నోటు వ్యవహారం నిజంగా సిగ్గు చేటన్నారు. చంద్రబాబు వాయిస్ నిజం కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు వాయిస్ నిజం కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు రాజీనామాను కోరుతూ మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. -
' ఇదంతా ఓర్వలేకే.. బాధ్యులను వదిలిపెట్టం'
ప్రకాశం: నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు బహిర్గతం కావడంతో టీఆర్ఎస్ పార్టీ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయకూడదనే నిబంధన ఉన్నా.. టీఆర్ఎస్ నీచానికి పాల్పడుతుందని మంత్రి శిద్ధా రాఘవరావు విమర్శించారు. అసలు ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబు వాయిస్ కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ ఎదుగుతుంటే ఓర్వలేక ఇదంతా చేస్తున్నారన్నారన్నారు. దీన్ని బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని శిద్ధా రాఘవరావు హెచ్చరించారు. -
ప్రతివ్యూహంలో చంద్రబాబు
-
'నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే'
-
బీజేపీ పెద్దలు ఎందుకు నోరు మెదపడంలేదు
-
అక్కడనోట్లు,ఇక్కడ ఓట్లు -నయా ప్లాన్
-
ప్రతివ్యూహంలో చంద్రబాబు
విజయవాడ: టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతివ్యూహానికి సిద్ధమైన చంద్రబాబు.. మంత్రులంతా తమ తమ జిల్లాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే సోమవారం టీడీపీ నేతలతో అత్యవసర సమావేశమైయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే ధర్నాలు నిర్వహించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూత్రధారేనని తాజా ఆడియో టేపుల్లో బహిర్గతమైన సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో చంద్రబాబే ప్రధానపాత్ర పోషించినట్లు స్పష్టంగా తేలిపోయింది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని బాబు స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల కావడంతో ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోతీవ్ర అలజడి రేపుతోంది. -
కస్టడీని పెంచమని పిటిషన్ వేయనున్న ఏసీబీ
-
టేపులవ్యవహారంపై సీఎం అత్యవసర బేటీ
-
రేవంత్ కస్టడీ పెంపుపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీని పెంచాలని కోరుతూ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది. రేవంత్ రెడ్డి విచారణకు సహకరించని కారణంగా ఆయన కస్టడీ పెంపుపై ఏసీబీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే మరో రెండు రోజులు రేవంత్ కస్టడీపై కోర్టులో పిటిషన్ దాఖలకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆయనతో పాటు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాల కస్టడీని పెంచాలని కోరే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని శనివారం ఏసీబీ అధికారులకు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టనున్నారు. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్ హ్యారీ, రుద్ర ఉదయ్‌సింహను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అప్పగించారు. -
గవర్నర్‌ని కలిసిన కేంద్రమంత్రి దత్తాత్రేయ
-
'అది నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే'
కడప: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేసి ఏసీబీ విచారణకు సిద్ధపడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు అనేదానికన్నా అందులో చంద్రబాబు మాట్లాడిన మాటాలకు ప్రాధాన్యముందన్నారు. నూటికి నూరు శాతం ఆ ఫోన్ లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనన్నారు. ఒకవేళ కాకపోతే ఫోరెనిక్స్ ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోవచ్చని రామచంద్రయ్య పేర్కొన్నారు. 'చంద్రబాబు మాట్లాడేతీరు, యాస, భాష నాకు పూర్తిగా తెలుసు. ఈ వాయిస్ నాది కాదంటూ ఇప్పుడు వివాదం చేస్తున్నారు. ల్యాబ్ కు పంపిస్తే నిజాలు బయటకు వస్తాయి. ముడుపులు వ్యవహారంలో చంద్రబాబు చేసింది పూర్తిగా వ్యక్తిగతం. కాని దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చూపిస్తున్నారు. ఇది అరాచకం. పరకాల ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా బాగున్నారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా కిరాతకం'అని సాక్షికి ఇచ్చిన ఇంటర్యూలో రామచంద్రయ్య పేర్కొన్నారు. -
ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రేవంత్
-
'సీఎం పదవికి రాజీనామా చేయాలి'
ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన చంద్రబాబు, నేరం ఒప్పుకోకుండా ఈ వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల వ్యవహారంలో టీఆర్ఎస్, టీడీపీకి సంబంధించిందని ఆయన తెలిపారు. -
ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రేవంత్ రెడ్డి
హైదరాబాద్:: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మూడోరోజు విచారణలో భాగంగా తొలుత రేవంత్ రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. రేవంత్ పాటు ఈ కేసులో అరెస్టైన సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరు ముగ్గురికి షుగర్ లెవిల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రెండోరోజు విచారణలో స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని రేవంత్ బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబుపై చర్యకు సిద్దమవుతున్న టీ.సర్కార్
-
సీఎం కేసీఆర్ పై టీడీపీ నేతల ఫిర్యాదు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారును అస్థిర పరచడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు , వర్ల రామయ్యలు గవర్నరు పేట, భవానీపురం పీఎస్ లలో కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో కలిసి కేసీఆర్ కుట్ర పన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చేసిన కుట్ర తేటతెల్లమైన సంగతి తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబే అన్నది స్పష్టంగా తేలిపోయింది. ‘బాస్’ పంపితే వచ్చానన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాటల్లోని ‘బాస్’ చంద్రబాబే అని మీడియాకు అందిన ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వెల్లడైంది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల కావడంతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆ సంభాషణలు చంద్రబాబువి కావని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేయగా.. ఇది ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేసీఆర్ పన్నిన కుట్ర మాత్రమేనని మరికొందరు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. -
ఉస్మానియాకు రేవంత్ రెడ్డి
-
ఉస్మానియాకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ అడ్డంగా దొరికిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మూడవ రోజు ఏసీబీ విచారణలో్ భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో అరెస్టైన సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు ఉస్మానియాకు తరలించారు. రేవంత్ రెడ్డి గొంతు నొప్పితో బాధపడుతున్నారని రేవంత్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయానికి రేవంత్ ను తరలించనున్నారు. -
'ఆ టేపులు చంద్రబాబువే అయితే రాజీనామా చేయాలి'
న్యూఢిల్లీ: కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర తేటతెల్లమైన నేపథ్యంలో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు చంద్రబాబు నాయుడువే అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు సూత్రధారి అయితే మాత్రం వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దిగ్విజయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. If the audio tapes of Chandra Babu regarding cash for votes are genuine then he must resign. — digvijaya singh (@digvijaya_28) June 8, 2015 -
సిట్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మూడవ రోజు విచారణలో భాగంగా ఆయన్ను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. రేవంత్ రెండోరోజు విచారణలో స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని ఆయన బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు. 'మేం ఎమ్మెల్సీని గెలవాలె. మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎట్ల తనవైపు తిప్పుకున్నడో అట్లనే మేం కూడా టీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కన్నేసినం. తెలుగుదేశానికి ఓటేస్తె భవిష్యత్ బాగుంటదని చెప్పినం. స్టీఫెన్సన్ మాకు టచ్‌లోకి వస్తెనే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడిన..’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. -
ఆ డబ్బెక్కడిదో.. నాకేమీ తెలియదు!
-
ఆడియో టేపులతో అడ్డంగా దొరికిన బాబు
-
చంద్రబాబును అరెస్టు చేయాలి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టి, అరెస్టు చేయాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రత్యక్షంగా మాట్లాడిన ఆడియోటేపులు బహిర్గతమైన అంశాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నీతిసూత్రాలు, నైతిక విలువలంటూ మాట్లాడే చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో ఈ టేపుల ద్వారా వెల్లడైందని విమర్శించారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారో తేల్చడానికి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని పొంగులేటి మండిపడ్డారు. -
మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?
⇒ ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ⇒ సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడిది? ⇒ మమ్మల్ని అభాసుపాలు చేయడానికి, మా స్థ్యైరాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా? ⇒ డీజీపీ, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమాలోచనలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డులు వెలుగు చూసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయవాదులు, పార్టీ సీనియర్ నేతలతో ఆదివారం తన నివాసంలో అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అనంతరం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు బయటకు పొక్కిన ఆడియోలోని సంభాషణలోనిది ఏపీ సీఎం గొంతు కాదని చెప్పారు. అది ఏపీ ముఖ్యమంత్రి సంభాషణ కాదన్నారు. ఈ కేసులో సేకరించిన సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. సాక్ష్యాధారాల్లో సేకరించింది కాదా? మా ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేశారా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం ఫోన్ టాప్ చేశామని చెబుతారా? అసలు ఈ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. మీకున్న టెక్నాలజీతో గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి, అవమానించడానికి మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా? చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఏసీబీ డీజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇది ఫోన్‌ట్యాపింగ్ కాకుండా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తన ఫోన్లో ఆడియో రికార్డ్ చేసిందని అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. అలాంటివేమైనా ఉంటే కోర్టు సమక్షంలో ఉండాలి కదా అని పరకాల బదులిచ్చారు. దర్యాప్తు చేస్తున్నవారు ఆడియో, వీడియో టేపులు, ఇతర సాక్ష్యాధారాలు ఏమున్నా కోర్టు ముందుంచాలని, అలాకాకుంటే వీళ్లు రుజువులను తారుమారు చేస్తున్నట్టేనని చెప్పారు. ‘‘కోర్టులో ఉండాల్సినవి బయటకు వచ్చాయంటే మీరు కావాలని గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి చేస్తున్నట్టే. ఈ ఉదంతంపై ఊరుకునే ప్రసక్తే లేదు. అంతుచూస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. ‘ఇదంతా తెలంగాణ సీఎం చేసిన పనికాదా? నాకు సంబంధం లేదని ఆయన్ను చెప్పమనండి? ఈ ఆడియో టేపులకు సోర్స్ ఏంటో చెప్పమనండి’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి గవర్నర్ భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, అయితే గవర్నర్ పాత్రేమిటో ఆలోచించుకోవాలని పరకాల అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ సీఎం పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా? అని అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో వారిని శిక్షించేవరకు, జైలుకు పంపించేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. మీరు సంబరాలు చేసుకుని రే పటిరోజున తాము ‘మహాసంకల్పం’ నిర్వహించుకునే దశలో ఇంతటి నీచమైన, క్షుద్రమైన, దారుణమైన పనికి ఒడిగడతారా? అని మండిపడ్డారు. దీనికి మూల్యం చెల్లించకతప్పదన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ చివరివరకూ తీసుకెళ్తామని చెప్పారు. ఉలిక్కిపడిన బాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల లంచం ఎరవేసి రూ.50 లక్షలు ముట్టజెప్పిన సందర్భంగా అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులద్వారా వెల్లడికావడం తెలుగుదేశం నేతలను కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వ్యవహారంలో నేరుగా చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులు టీవీల్లో ప్రసారం కావడం చూసి చంద్రబాబుతోపాటు మంత్రులు, సీనియర్ నేతలు ఉలిక్కిపడ్డారు. స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కిన నేపథ్యంలో చంద్రబాబు ఆగమేఘాలపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, పలువురు న్యాయవాదులను పిలిపించుకుని తన నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు అధికారులు, పలువురు మంత్రులతో ఆయన సుదీర్ఘ మంతనాల్లో మునిగిపోయారు. తక్షణం ఎలా స్పందించాలన్న విషయంపై తర్జనభర్జన పడ్డారు. డీజీపీ రాముడుతోపాటు ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశానంతరం ఆయన న్యాయవాదులు, పార్టీ సీనియర్లతో విడిగా సమాలోచనలు జరిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో రికార్డులు ఎలా బయటపడ్డాయి? ఎవరిచ్చారు? తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? ఈ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందించాలి? వంటి అంశాలపై చంద్రబాబు లోతుగా చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ మంతనాల అనంతరం పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అయితే, పరకాల ప్రభాకర్ వివరణపై పెదవి విరిచిన పలువురు తమకు సూటిగా సమాధానం చెప్పాలంటూ పలు ప్రశ్నలు సందించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? ► టేపుల్లో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం కాదంటారు... ఆ వెంటనే వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు మాటలే అతికించారంటారు. ఇందులో ఏది నిజం? ► ఆ టేపుల్లో ఉన్నది తన స్వరం కాకపోతే చంద్రబాబు స్వయంగా ఎందుకు ఖండించలేదు? ► రేవంత్‌రెడ్డి వ్యవహారం బయటపడినప్పటినుంచీ చంద్రబాబు ఆ అంశంపై నోరెందుకు విప్పలేదు? ► రేవంత్ ఎపిసోడ్‌తో మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఇప్పటివరకూ టీడీపీకి ఎందుకు లేకపోయింది? ► యావత్ తెలుగుజాతి టీడీపీని ముద్దాయిగా చూస్తున్నా నిజమేంటో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ► రేవంత్‌రెడ్డిపై కుట్రచేశారని బుకాయిస్తారే తప్ప... రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇచ్చింది వాస్తవంకాదా? ‘బాస్’ చెప్తేనే వచ్చానని చెప్పలేదా? ► ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కుట్ర జరిగిందంటారేం. ఏపీ సీఎంకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏం అవసరం? ► మీ పార్టీ, మీ అధినేత తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని చూస్తారేం? -
50 లక్షల గుట్టు.. నేడు రట్టు
► స్టీఫెన్‌కు రేవంత్ ఇవ్వజూపిన 50 లక్షలు సమకూర్చిందెవరు? ► నేడు బట్టబయలు చేయనున్న అవినీతి నిరోధక శాఖ ► కాల్ డేటా ఆధారంగా అనేక వివరాలు రాబట్టిన ఏసీబీ ► చంద్రబాబును విచారించే ముందే మరికొందరి అరెస్టు! సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడివన్నది నేడు బట్టబయలు కానుంది. ఈ డబ్బును ఎవరు సమకూర్చారనే విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కనిపెట్టింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం వెల్లడించవచ్చని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సమీపంలోని ఓ బ్యాంకు నుంచి ఈ డబ్బును డ్రా చేసినట్లు తెలిసింది. ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాల్ డేటాను విశ్లేషించిన ఏసీబీ, డబ్బు సమకూర్చిన వారి వివరాలను రాబట్టింది. డబ్బు విషయం తనకు తెలియదని రేవంత్ ఆదివారం నాటి విచారణలో చెప్పినప్పటికీ... స్వయంగా ఆయనే ఆ డబ్బును స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తీసుకెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు ఏసీబీకి లభించాయి. అయితే, ఈ డబ్బు ఎవరు సమకూర్చారన్న విషయాన్ని ఏసీబీ అత్యంత గోప్యంగా వుంచుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా డబ్బు ఖర్చు చేయాలని నిర్ణయించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొందరు పారిశ్రామికవేత్తల నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు సమాచారం. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా, ఏపీలో స్థానిక సంస్థల కోటాల్లో ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు ఈ డబ్బు ఖర్చు చేయాలని ఆయన భావించారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఎమ్మెల్యేలకు అడ్వాన్స్‌గా కొంత ముట్టజెప్పేందుకు తెచ్చిన ఈ డబ్బు ఎవరిదనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. కాల్‌డేటా ఆధారంగా కూపీ రేవంత్ తెచ్చిన డబ్బును ఎవరు సమకూర్చారన్న విషయాన్ని తేల్చేందుకు కాల్‌డేటాను ఏసీబీ ఆధారంగా చేసుకుంది. రేవంత్‌కు ఫోన్ చేసిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టు సంస్థల అధినేతల ఫోన్ నంబర్లను గుర్తించింది. వీరి ఫోన్లకు టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు పదేపదే ఫోన్ చేసినట్లు తేల్చింది. రేవంత్‌తో మాట్లాడిన పారిశ్రామికవేత్తలకు వచ్చిన కాల్స్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. ఏసీబీ అనుమానిస్తున్న ఒక కాంట్రాక్టు సంస్థ అధినేత ఫోన్ నుంచి ఏపీకి చెందిన ఓ మంత్రికి అనేకసార్లు కాల్స్ వెళ్లాయి. రేవంత్ పట్టుబడటానికి గంట ముందు కూడా ఆ కాంట్రాక్టు సంస్థ అధినేతతో ఫోన్లో మాట్లాడారు. -
ఏమో ఆ కేసు గురించి తెలియదు
దాటవేసిన కేంద్ర మంత్రి జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు అంశంలో ఏసీబీకి చిక్కిన మిత్రపక్ష టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయం గురించి తెలియదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ చెప్పారు. ఢిల్లీలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న అనంతరం జవదేకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యవహారంపై విలేకరులు ప్రశ్నించగా ‘ఆ విషయం నాకు తెలియదు’ అంటూ దాటవేశారు. అన్ని రాష్ట్రాలకూ న్యాయం చేస్తామని, ఏపీ, తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తొలుత మంత్రి జవదేకర్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉత్సవాల ముగింపు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కన పెట్టి, అందరితో కలసి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ శాంతియుతంగా అభివృద్ధివైపు పురోగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మీడియా కేంద్రం ప్రారంభం: తెలంగాణ భవన్లో తెలంగాణ సమాచార కేంద్రాన్ని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మీడియా కేంద్రం ద్వారా జాతికి తెలియజేయాలన్నారు. -
చంద్రబాబును ఏ1 దోషిగా చేర్చాలి
హన్మకొండ: ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వజూపిన కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును ఏ1 దోషిగా చేర్చాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హన్మకొండలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలసి చంద్రబాబును ఈ కేసులో ఏ1గా చేయాలని కోరారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఇదే కోరుతున్నారని కవిత పేర్కొన్నారు. రేవంత్‌ను నడిపించిన చంద్రబాబును కచ్చితంగా దోషిగా చూడాలని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై ఉల్టా కేసులు పెట్టాలని ఆంధ్రా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. చిన్న చిన్న అంశాలకు సీబీఐ విచారణ చేయాలని కోరే చంద్రబాబు ఈ అంశంలో ఎందుకు మౌనంగా ఉన్నారో రెండు రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తాము వారి ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్లు.. ఫోన్లు ట్యాపింగ్ చెస్తున్నట్లు ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదవుల ఆశచూపి తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. పదవుల కంటే నాయకులు రాజకీయ భవిష్యత్ చూసుకుంటారని, కేసీఆర్ పాలన చూసిన తర్వాత భవిష్యత్తులో గులాబీ జెండా ఒక్కటే ఉంటుందని.. దీని నీడలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీల.. పచ్చ పార్టీల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని, ఈ కుట్రలు తిప్పికొట్టడానికి ఇంటి పార్టీ బలపడాల్సిన అవరసరముందున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చేరే ఆలోచన లేదని చెప్పారు. కేబినెట్ మంత్రిగా ఎప్పుడు చూడవచ్చని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె మౌనంగా ఉండిపోయారు. -
ఆ డబ్బెక్కడిదో.. నాకేమీ తెలియదు!
ఏసీబీ అధికారుల ప్రశ్నలకు రేవంత్ అడ్డగోలు సమాధానాలు పూసగుచ్చినట్లు వివరాలు వెల్లడించిన సెబాస్టియన్, ఉదయ సింహ సాక్షి, హైదరాబాద్: ‘మేం ఎమ్మెల్సీని గెలవాలె. మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎట్ల తనవైపు తిప్పుకున్నడో అట్లనే మేం కూడా టీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కన్నేసినం. తెలుగుదేశానికి ఓటేస్తె భవిష్యత్ బాగుంటదని చెప్పినం. స్టీఫెన్సన్ మాకు టచ్‌లోకి వస్తెనే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడిన..’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. కానీ స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు. ఆదివారం కేసు పరిశోధనాధికారి అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు నిందితులను విడివిడిగా ప్రత్యేక గదుల్లో నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రేవంత్‌తో పాటు పట్టుబడిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చి పంపించారనే దానిపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అధికారులు తరచూ మారుతూ.. ‘ఆయన అలా చెప్పారు. నువ్వి లా చెబుతున్నావేంటి?’ అంటూ వారి నుంచి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. జానారెడ్డి మీకెందుకు సాయం చేశారు?: కాంగ్రెస్ నేత జానారెడ్డితో సన్నిహిత సంబంధాల గురించి అధికారులు రేవంత్‌ను ప్రశ్నించారు. జానారెడ్డి రాజకీయంగా తెలుసని రేవంత్ చెప్పగా.. ‘మరి 2009 ఎన్నికల్లో జానారెడ్డి మీకు ఆర్థికంగా ఎందుకు సాయపడ్డార’ని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. 2009 ఎన్నికల గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారని రేవంత్ ఎదురు ప్రశ్నించారని, దాంతో ‘అది నిజమా కాదా?’ అని అధికారులు నిలదీయగా రేవంత్ అడ్డంగా తలూపారని తెలుస్తోంది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి రేవంత్ సాగించిన భూ దందాలు, ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులు సాగించిన సెటిల్మెంట్ల విషయాన్ని ప్రశ్నించి నట్లు తెలిసింది. పలు కీలక వివరాలు వెల్లడి.. రెండో రోజు ఏసీబీ విచారణలో రేవంత్ సరైన సమాధానాలు చెప్పకుండా సతాయించగా.. మిగతా నిందితులు టీడీపీ క్రిస్టియన్ విభాగంలో ముఖ్యనేతగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ మాత్రం డబ్బు విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించినట్లు సమాచారం. రేవంత్‌తో తనకున్న పరిచయం, మత్తయ్య ద్వారా స్టీఫెన్సన్ను కలిసి డీల్ మాట్లాడిన విషయాలను సెబాస్టియిన్ ఏసీబీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. తానో చిన్న నాయకుడినని, తనకు అండగా ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పాకే స్టీఫెన్‌సన్‌తో సంప్రదింపులు జరిపానని చెప్పినట్లు సమాచారం. అలాగే స్టీఫెన్సన్ వద్దకు డబ్బుల బ్యాగు తెచ్చిన ఉదయసింహ కూడా తనకు డబ్బు ఎవరి ద్వారా వచ్చిందో అధికారులకు వివరించినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రకారమే తాను నడి చానని, తనకు రూ.50 లక్షలు సొంతంగా సంపాదించే శక్తి లేదని కూడా ఒప్పుకొన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరు చెప్పిన మాటల ప్రకారం రేవంత్‌ను అధికారులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియదనే బుకాయించినట్లు తెలిసింది. బాస్ చంద్రబాబు డబ్బులు పంపించారా? అని అధికారులు అడగగా.. డబ్బు గురించే తనకు తెలియదన్నప్పుడు బాబు గురించి ఎందుకడుగుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తంగా రెండో రోజు విచారణ అనంతరం ఏసీబీ అధికారులకు కేసు విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులు పంపించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సౌకర్యాలు కల్పించడం లేదు ఏసీబీ అధికారులపై రేవంత్‌రెడ్డి న్యాయవాదుల ఆరోపణ రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు దర్యాప్తు అనంతరం సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారని, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది సుధీర్‌కుమార్ ఆరోపించారు. రేవంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని.. కలుషితమైన నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చిందని, జ్వరం కూడా ఉందని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ రిమాండ్ ఖైదీకి ఇచ్చే కనీస సౌకర్యాలు కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. సిట్‌లో కాకుండా సౌకర్యాలున్న కార్యాలయంలో నిందితులను ఉంచాలని ఏసీబీని కోరినట్లు చెప్పారు. ఇక ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహల తరపు న్యాయవాదులు రవికుమార్, రాకేష్‌సింగ్ సైతం ఇవే ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా ఉదయం సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకొచ్చేటప్పుడు రేవంత్‌రెడ్డి మీడియాను చూస్తూ.. ‘ఈ కొడుకులు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు..’ అని అరవడం గమనార్హం. రేవంత్ అనుమానాస్పద సంచారంపై ఆరా ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి అనుమానాస్పద సంచారంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీకి దొరికిపోవడానికి ముందు వారం రోజుల్లో మూడు సార్లు గన్‌మన్ లేకుండా రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లారు. ఆయన ఎక్కడికెళ్లారు, గన్మెన్లను ఎందుకు వద్దని వారించారు, ఎంతసేపు వెళ్లారు, ఆ సమయంలో గన్‌మెన్ ఎక్కడున్నారు.. తదితర వివరాలకు సంబంధించి గన్మెన్ల వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీంతోపాటు రేవంత్‌రెడ్డి అరెస్టుకు ముందు వారం రోజులకు సంబంధించిన కాల్ డేటాను ఏసీబీ విశ్లేషించింది. ఈ ఫోన్ సంభాషణలో దాదాపు 70 సార్లు చంద్రబాబు ప్రస్తావన ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. ఇక రేవంత్‌తోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహ ఫోన్లకు వచ్చిన కాల్స్‌పైనా అధికారులు ఆరా తీశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న దాదాపు 20 మంది కాల్‌డేటాను ఏసీబీ సేకరించింది. -
సూత్రధారి బాసే!
⇒ అడ్డంగా దొరికిన చంద్రబాబు ⇒ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో టేపు బట్టబయలు ⇒ ఎమ్మెల్యేల బేరసారాల సూత్రధారి ఏపీ ముఖ్యమంత్రే ⇒ రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడతామని స్పష్టమైన హామీ ⇒ కంగారు పడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చిన ఏపీ సీఎం ⇒ ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ⇒ ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసిన సీఎం కేసీఆర్ ⇒ చంద్రబాబు పాత్రకు సంబంధించి ఏసీబీ వద్ద మరిన్ని ఆధారాలు ⇒ టీడీపీ అధినేత అరెస్టుకు అవకాశం ఉందంటున్న ఉన్నతాధికారవర్గాలు సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ నీతి నిజాయితీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిజ స్వరూపం బట్టబయలైంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చేసిన కుట్ర తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబే అన్నది స్పష్టంగా తేలిపోయింది. ‘బాస్’ పంపితే వచ్చానన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాటల్లోని ‘బాస్’ చంద్రబాబే అని మీడియాకు అందిన ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వెల్లడైంది. స్టీఫెన్‌సన్‌తో ఆ ‘బాస్’ చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల అయ్యాయి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి సరిపోయే బలం తెలంగాణ టీడీపీకి లేకపోయినా చంద్రబాబు పార్టీ తరఫున అభ్యర్థిని బరి లోకి దింపారు. ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అన్ని అడ్డదారులు తొక్కారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. నిధుల సేకరణకు పారిశ్రామికవేత్తలను ఉపయోగించుకున్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసే బాధ్యతను తెలంగాణ టీడీపీ నేతలకు అప్పగిం చారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు అంటే మే 31న (ఆదివారం) సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలులంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లేకపోతే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి కచ్చితంగా 20 ఓట్లు వచ్చి ఉండేవి. హైదరాబాద్‌లో రేవంత్ పట్టుబడటంతోనే ఇతర ఎమ్మెల్యేలకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చేందుకు తీసుకెళుతున్న డబ్బు మూటలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. అప్పటికే అడ్వాన్స్ తీసుకున్న ఎమ్మెల్యేలు వాటిని తిప్పిపంపారు. ఇలా ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన రికార్డులే కాకుండా ఇతరత్రా ఆధారాలను కూడా ఏసీబీ ఇప్పటికే సేకరించింది. ఏక్షణంలోనైనా ఆయనకు నోటీసులు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సూత్రధారి అయిన చంద్రబాబును ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనైనా ఆయనకు నోటీసులు జారీచేసే అవకాశముంది. చంద్రబాబును విచారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను ఏసీబీ ఇప్పటికే సేకరించి పెట్టుకుంది. రేవంత్ ఇవ్వజూపిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు కూడా ఏసీబీ దగ్గర ఉన్నాయి. మంగళవారం (9వ తేదీన) విచారణకు హాజరు కావాల్సిందిగా చంద్రబాబుకు నోటీసులు జారీచేసే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎమ్మెల్యేల కొనుగోలుకు పార్టీ నేతలను ప్రోత్సహించిన ఘటనలు దేశంలో ఇప్పటిదాకా లేవు. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు చంద్రబాబు సాగించిన అక్రమాల పర్వంలో మరిన్ని ఆధారాలు కూడా త్వరలో బయటపడతాయని... ఈ బేరసారాల్లో ప్రధాన పాత్ర వహించిన టీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణ టీడీపీ కీలక నేత ఒకరిని కూడా విచారించే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్పాయి. చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంతో పాటు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌కు వివరించిన కేసీఆర్.. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు బేరసారాల నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకునే విషయాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బాబును విచారించేందుకు ఏ క్షణంలోనైనా నోటీసు జారీ చేస్తారని తెలియజేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర అవతరణ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్‌తో వేదిక పంచుకున్న కేసీఆర్.. ఉత్సవాలు ముగిసిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. రూ.5 కోట్లు ఇస్తామన్న రేవంత్.. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ కావడానికి ముందు స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారు. రూ.2 కోట్ల వరకు ఇచ్చేందుకు తనకు అనుమతి ఉందని, రూ.5 కోట్లు కాబట్టి ‘బాస్’తో మాట్లాడిస్తానని చెప్పారు. ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ గుర్తించి ఇబ్బంది పెడితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. రేవంత్ ఇచ్చిన ఈ హామీలన్నింటికీ తాను కట్టుబడి ఉన్నట్లు స్టీఫెన్సన్కు చంద్రబాబు స్వయంగా భరోసా ఇచ్చారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ చంద్రబాబు అనుచరుడు: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ.. బి ఆన్ ద లైన్ (హలో బ్రదర్. బాబు గారు మీతో మాట్లాడతారు. లైన్లో ఉండండి) స్టీఫెన్సన్: యా.. చంద్రబాబు: హలో.. స్టీఫెన్సన్: సార్... గుడ్ ఈవెనింగ్ సార్.. చంద్రబాబు: గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ (మీరు ఎలా ఉన్నారు..?) స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్ చంద్రబాబు: మన వాళ్లు బ్రీఫ్డ్ మి.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్ (మనవాళ్లు నాకు అంతా వివరిం చారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిందేమీ లేదు) స్టీఫెన్సన్: యస్ సార్.. రైట్ సార్ (మంచిది సర్) చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్... విల్ ఆనర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం) స్టీఫెన్సన్: యస్ సార్.. రైట్ సార్ చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాంటి సమస్యా లేదు) స్టీఫెన్సన్: ఓకే సార్.. (మంచిది సార్) చంద్రబాబు: దటీజ్ అవర్ కమిట్మెంట్.. వియ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ.. మనం కలసి పనిచేద్దాం) స్టీఫెన్సన్: రైట్.. థాంక్యూ సార్.. చంద్రబాబు: థాంక్యూ -
'ఆ సంభాషణ చంద్రబాబుది కాదు'
-
ఆ సంభాషణ చంద్రబాబుది కాదు: పరకాల
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ముడుపుల వ్యవహారంలో తాజాగా బహిర్గతమైన ఆడియో టేపుల్లోని సంభాషణ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. అసలు ఈ ఆడియో ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అక్కడక్కడ మాట్లాడిన మాటలన్నీ కలిపి టెక్నాలజీ సాయంతో ప్రజలను నమ్మించేందుకే సృష్టించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేరం అని, కావాలనే ట్యాప్ చేశారేమో చెప్పాలని పరకాల డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టబోమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ప్రభాకర్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు.. *ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలు చంద్రబాబువి కావు *ఈ సంభాషణ ఎక్కడ్నుంచి వచ్చింది.. టెలిఫోన్ ట్యాపింగ్ నేరం *అక్కడక్కడ మాట్లాడిన మాటలను పేర్చి ఆడియో టేపులను తయారు చేశారు *ఇది మామాలుగా విడిచిపెట్టే వ్యవహారం కాదు..దీని అంతు చూస్తాం. *మా సీఎంను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు *మాకు నోటీసులు రాలేదు, పంపే ధైర్యం చేయరు *రేపు తాము నిర్వహించే మహాసంకల్ప దీక్షను ప్రజలు దిగ్విజయం చేయాలి * మా సభను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తాం *మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే కుట్ర *తెలంగాణ హోంమంత్రి టేపులున్నాయని ముందే చెప్పారు *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా? *ఇదంతా తమపై కుట్ర కాదా? * మహాసంకల్ప దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర *రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తున్నారు *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పని కాదా? *ఇది ఎలా తీసుకొచ్చారో చెప్పండి.. * ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేశామని చెప్పగలరా? *దీనిపై అన్నిరకాలుగా ఫైట్ చేస్తాం *ఇది చాలా నీచమైన పని.. కుట్రపూరితమైన పని *బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పనికాదు *అన్నీ టేపులు కోర్టుకు సమర్పించామన్నప్పుడు మరి ఈ టేపులు ఎక్కడివి? -
చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతం
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో టేపులు తాజాగా బహిర్గతం అయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని తాను తప్పకుండా నెరవేరుస్తానని స్టీఫెన్సన్ కు చంద్రబాబు ఇచ్చిన హామీలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు చంద్రబాబుకు ఏ క్షణంలోనూనా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. స్టీఫెన్సన్ తో చంద్రబాబు సంభాషణ ఈ విధంగా సాగింది.. చంద్రబాబు తరపు మనిషి:హలో బ్రదర్.. బాబుగారు మీతో మాట్లాడతారు.. లైన్ లో ఉండండి ఎమ్మెల్యే స్టీఫెన్సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్ చంద్రబాబు:గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్ చంద్రబాబు:మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేనుంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్ చంద్రబాబు:అన్నింటికీ మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్ చంద్రబాబు:మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు స్టీఫెన్సన్:ఒకే సార్ చంద్రబాబు:అది మా హామీ.. మనం కలిసి పనిచేద్దాం స్టీఫెన్సన్:రైట్.. థాంక్యూ సార్.. చంద్రబాబు:థాంక్యూ స్టీఫెన్సన్ తో రేవంత్ మాట్లాడిన సంభాషణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: -
బాబుపై ఏసీబీ విచారణ!
-
బాబుపై ఏసీబీ విచారణ!
* రేవంత్ కేసులో ఏపీ సీఎంపై ఆధారాలు సిద్ధం.. * వారంలో నోటీసులిచ్చే అవకాశం * ఎమ్మెల్యేలతో నేరుగా చంద్రబాబు బేరసారాలు * మధ్యవర్తి సెబాస్టియన్ ఫోన్ ద్వారా మాట్లాడిన ఏపీ సీఎం * ఏసీబీ వద్ద ఆడియో రికార్డులు * రేవంత్ సంభాషణల్లోనూ పలుమార్లు బాబు పేరు * ఈ ఆధారాలతో బాబును విచారించనున్న అధికారులు * మరో ‘నలుగురు’ ఎమ్మెల్యేలనూ ప్రశ్నించే అవకాశం * రేవంత్ ఇవ్వజూపిన రూ. 50 లక్షల సొమ్ముపైనా ఆరా * ఏ బ్యాంకు నుంచి, ఎవరు తెచ్చారనే అంశాలపై పరిశీలన ఈ కేసులో సూత్రధారి ఒక ముఖ్యమంత్రి. అందువల్ల ఏ చిన్న సమాచారం కూడా లీక్ కాకుండా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేము. కోర్టుకు ఇచ్చే ప్రతి సమాచారం కూడా అన్ని ఆధారాలతో కూడినదై ఉండాలన్నదే మా అభిమతం.. - ఏసీబీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలంటూ ముడుపులు ఇవ్వజూపిన కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని విశ్వసిస్తున్న ఏసీబీ అధికారులు... ఆయనను విచారించేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అత్యున్నత వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏసీబీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాల్సిందిగా కోరనుంది. ఈ వారం చివరలో లేదా వచ్చే వారం మొదట్లో ఆ నోటీసులిచ్చే అవకాశముందని సమాచారం. నోటీసుకు చంద్రబాబు స్పందించిన అనంతరం ఏసీబీ అధికారుల బృందం ఆయన నివాసానికే వెళ్లి విచారించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం ఐదుగురు ఎమ్మెల్యేలను కొనే యత్నంలో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇలా ప్రలోభపెట్టే క్రమంలో రేవంత్‌తో పాటు మధ్యవర్తిగా ఉన్న సెబాస్టియన్ ఫోన్ ద్వారా చంద్రబాబు ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు సమాచారం. దానికి సంబంధించిన ఆడియో రికార్డులను ఏసీబీ ఇప్పటికే పరిశీలించి ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. ఎప్పుడు, ఏ సమయంలో, ఎవరితో, ఎవరి ఫోన్ ద్వారా మాట్లాడారన్న వివరాలతో సహా నివేదిక అందించినట్లు విశ్వసనీయ సమాచారం. బాస్ చెపితే వచ్చానని కొన్నిసార్లు, బాబుగారు అని మరికొన్ని సార్లు, చంద్రబాబు అన్ని రెండు మార్లు రేవంత్ సంభాషణల్లో స్పష్టంగా వినిపించింది. ఈ ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో గవర్నర్ నరసింహన్‌కు కూడా ఓ నివేదిక అందింది. ఎమ్మెల్యేలతో చంద్రబాబు బేరసారాలు చేసినట్లు తమ వద్ద ఆడియో రికార్డులు ఉన్నాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం వరంగల్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సూత్రధారి చంద్రబాబే.. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ అనుమానిస్తోంది. దీనికి తగినట్లుగా ఉన్న కొన్ని ఆధారాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచుకుంది. ఈ వివరాలను ఆధారం చేసుకుని చంద్రబాబును ఏసీబీ విచారించనుంది. అయితే ఈ ఆధారాలతో బాబును విచారించాలన్న నిర్ణయం తీసుకోవడానికి ముందే ఏసీబీ న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కోరినట్లు తెలిసింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ అత్యంత గోప్యంగా సాగుతోంది. ‘ఈ కేసులో సూత్రధారి ముఖ్యమంత్రి. అందువల్ల ఏచిన్న సమాచారం కూడా లీక్ కాకుండా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేము. కోర్టుకు ఇచ్చే ప్రతి సమాచారం కూడా అన్ని ఆధారాలతో కూడినదై ఉండాలన్నదే మా అభిమతం..’ అని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. అవసరాన్ని బట్టి లంచం తీసుకుని ఓటేసేందుకు సిద్ధపడ్డ మరో నలుగురు ఎమ్మెల్యేలను కూడా ఏసీబీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో మొత్తం ఫోన్ సంభాషణలను ఒకచోట క్రోడీకరించిన ఏసీబీ... నేడు లేదా రేపు కోర్టుకు అందజేయనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఇవ్వజూపిన రూ.50 లక్షల సొమ్మును కూడా కోర్టుకు స్వాధీనం చేయనుంది. ఆ తరువాతే ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగుతుందని, ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేస్తుందని ఉన్నతాధికారవర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. -
'చంద్రబాబు సంభాషణలూ ఉన్నాయి'
-
చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి: వీహెచ్
హైదరాబాద్: రేవంత్ ఎపిసోడ్లో ప్రధాన సూత్రధారైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఈ సందర్భంగా వీహెచ్ హెచ్చరించారు. రేవంత్ ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. వాటితో పాటుగా మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయో విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
'చంద్రబాబు ఫోన్ సంభాషణలు మా దగ్గరున్నాయి'
వరంగల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే క్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణలు తమ దగ్గర ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని నాయిని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరమాడారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు (ఫోన్ సంభాషణలు) కూడా తమ దగ్గర ఉన్నాయని నాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తారుమారు కానున్నాయని ఆయన అన్నారు. త్వరలోనే ఆధారాలన్నీ బయట పెడుతామని నాయిని నరసింహారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. -
రేవంత్ కేసు స్పెషల్ పీపీగా సురేందర్‌రావు
కార్పొరేట్ చికిత్స కావాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఎరచూపిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. తాను గుండె సంబంధమైన వ్యాధి లక్షణంతో బాధపడుతున్నందున కార్పొరేట్ ఆస్పత్రికి పంపి చికిత్స చేయించేలా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి లక్ష్మీపతి మంగళవారం తోసిపుచ్చారు. రేవంత్‌కు జైలు వైద్యుడితో పరీక్ష లు చేయించి, తదనుగుణంగా తదుపరి చర్య లు చేపట్టాలంటూ సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ పూర్తి ఆరోగ్యం తో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారని, ఈ తర హా జబ్బు లక్షణంతో బాధపడుతున్నట్టు అరెస్టుకు ముందు ఆయన ప్రస్తావించలేదని ఏసీ బీ తరఫున స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు న్యాయస్థానానికి నివేదించారు. ఇక రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 5వ తేదీకి వాయి దా పడింది. దీనిపై కౌంటర్ దాఖలుకు గడు వు కావాలన్న ఏసీబీ అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ కేసు నిందితులను రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెం డెంట్ కోరారు. దాంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు రేవంత్‌తో పాటు సెబాస్టియన్ హారీ, ఉదయ్ సింహాలను మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఎస్కార్ట్‌తో చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైల్లో రేవంత్‌కు రిమాండ్ ఖైదీ నంబర్ 4170 కేటాయించి పటిష్ట బందోబస్తుతో కూడిన గంగ బ్యారక్ లో ఉంచారు. స్పెషల్ పీపీగా వి.సురేందర్‌రావు రేవంత్ కేసు విచారణకు ప్రత్యేక పీపీగా వి.సురేందర్‌రావును ప్రభుత్వం నియమించింది. క్రిమినల్ లాయర్‌గా మంచిపేరున్న సురేందర్‌రావు జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులోనూ స్పెషల్ పీపీగా పనిచేశారు. ఈ కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి సహా ఇతర నిందితులకు ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించడం తెలిసిందే.