'ఆ గొంతు బాబుదే' | in audio tapes voice is chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఆ గొంతు బాబుదే'

Published Tue, Jun 9 2015 2:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

'ఆ గొంతు బాబుదే'

'ఆ గొంతు బాబుదే'

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముడుపుల వ్యవహారంలో బయటపడిన ఆడియో టేపుల్లోని గొంతు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో సూత్రధారి ఆయనేనని చెప్పారు. ఎమ్మల్యేలను కొనుగోలు చేసే విషయంలో చివరికి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు.

వైఎస్సార్సీపీ నేతలను కొనేందుకు కూడా చంద్రబాబు బేరాలాడారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. అసలు విషయం బయటకు పొక్కడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టుకుందని, ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement