రేవంత్ కేసు స్పెషల్ పీపీగా సురేందర్‌రావు | surenderrao as public proseacuter to revanth case | Sakshi
Sakshi News home page

రేవంత్ కేసు స్పెషల్ పీపీగా సురేందర్‌రావు

Published Wed, Jun 3 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

surenderrao as public proseacuter to revanth case

కార్పొరేట్ చికిత్స కావాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఎరచూపిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. తాను గుండె సంబంధమైన వ్యాధి లక్షణంతో బాధపడుతున్నందున కార్పొరేట్ ఆస్పత్రికి పంపి చికిత్స చేయించేలా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి లక్ష్మీపతి మంగళవారం తోసిపుచ్చారు.

రేవంత్‌కు జైలు వైద్యుడితో పరీక్ష లు చేయించి, తదనుగుణంగా తదుపరి చర్య లు చేపట్టాలంటూ సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ పూర్తి ఆరోగ్యం తో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారని, ఈ తర హా జబ్బు లక్షణంతో బాధపడుతున్నట్టు అరెస్టుకు ముందు ఆయన ప్రస్తావించలేదని ఏసీ బీ తరఫున స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు న్యాయస్థానానికి నివేదించారు. ఇక రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 5వ తేదీకి వాయి దా పడింది. దీనిపై కౌంటర్ దాఖలుకు గడు వు కావాలన్న ఏసీబీ అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఏసీబీ కేసు నిందితులను రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెం డెంట్ కోరారు.  దాంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు రేవంత్‌తో పాటు సెబాస్టియన్ హారీ, ఉదయ్ సింహాలను మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఎస్కార్ట్‌తో చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైల్లో రేవంత్‌కు రిమాండ్ ఖైదీ నంబర్ 4170 కేటాయించి పటిష్ట బందోబస్తుతో కూడిన గంగ బ్యారక్ లో ఉంచారు.
 
స్పెషల్ పీపీగా వి.సురేందర్‌రావు
రేవంత్ కేసు విచారణకు ప్రత్యేక పీపీగా వి.సురేందర్‌రావును ప్రభుత్వం నియమించింది. క్రిమినల్ లాయర్‌గా మంచిపేరున్న సురేందర్‌రావు జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులోనూ స్పెషల్ పీపీగా పనిచేశారు. ఈ కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి సహా ఇతర నిందితులకు ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement