
'రేవంత్ కేసులో ఎవరితోనూ లాలూచీ పడలేదు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇస్తూ పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు విషయంలో తాము ఎవరితోనూ లాలూచీ పడలేదని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కారు రాజీ పడిందనే ఆరోపణలపై నాయిని పై విధంగా స్పందించారు.
ఆ కేసు విషయంలో తాము లాలూచీ పడే అంశమే లేదన్నారు. ఏసీబీ తనపని తాను చేసుకుపోతుందని.. ఈ కేసులో ఎంతటి వారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా నాయిని తెలిపారు.