'తెలంగాణ పోలీసులు నెంబర్‌వన్'
హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్‌గా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పోలీసుల పెట్రోలింగ్‌తో రాష్ట్రంలో నేరాలు తగ్గాయన్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ, ఏసీపీ పోలీసు స్టేషన్‌లను హోంమంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు సమర్థతంగా పని చేస్తుండటంతోనే దొంగతనాలు తగ్గాయని వెల్లడించారు.
పోలీసు వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత మంచిపేరు వస్తుందన్నారు. పోలీసులకు అవసరమైన వాహనాలను సీఎం తక్షణమే మంజూరు చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ ఆఫీసుల తరహాలో పీఎస్‌లు ఉండాలని సీఎం నిర్ణయించారని.. అందుకు అనుగుణంగానే పీఎస్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. పోలీసుల స్టేషన్ల ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.