హైదరాబాద్: రేవంత్ ఎపిసోడ్లో ప్రధాన సూత్రధారైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఈ సందర్భంగా వీహెచ్ హెచ్చరించారు. రేవంత్ ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. వాటితో పాటుగా మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయో విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.