v.hanumantha rao
-
ఇవాంకకు లేఖ రాశా.. జీఈఎస్ ఖర్చు ఎంత..?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్ షో గా నడిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంకాకు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు. జీఈఎస్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి :షబ్బీర్ అలీ డిమాండ్ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రభు త్వం పెట్టిన ఖర్చు ఎంత, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కొత్తగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయో శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలిసి గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రపం చ పారిశ్రామికవేత్తలు హైదరాబా ద్ కు వచ్చిన సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకోసం ఆకర్షించడంలో, హామీలను సాధించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వంత ప్రచారం తప్ప పెట్టుబడులను సాధించుకోవాలని, తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలనే చిత్తశుద్ధి లేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. -
కేసీఆర్‌కు డబ్బు పిచ్చి పట్టింది: వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు డబ్బు పిచ్చి పట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. అవసరం లేకున్నా బైసన్ పోలో గ్రౌండ్ కోసం యత్నిస్తుస్తున్నారని, అక్కడ కొత్త సచివాలయం కడితే మంచిదని చిన్నజీయార్ స్వామి చెప్పడం వల్లే సీఎం ఈ పనికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన వీహెచ్.. సీఎంకు సెక్రటేరియేట్‌కు వచ్చే ఉద్దేశం లేనప్పుడు కొత్త సెక్రటేరియేట్ అవసరమా? అని ప్రశ్నించారు. స్వామీజీలను కలవడానికి సీఎంకు సమయం ఉంటుందికానీ రైతులను కలిసేందుకు ఉండదా? అని అన్నారు. మొన్నటి ప్రెస్మీట్లో సీఎం అనుచిత వాఖ్యలు చేశారని, నేరేళ్ల ఘటనలో దళితులపై కేసులు పెట్టడం కాదు.. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై కేసులు పెట్టాలని వీహెచ్ మండిపడ్డారు. ప్రతి నెల ఇంత కలెక్షన్ రావాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు షరతు పెట్టడం వల్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. -
పోలీసుల సంగతి చూస్తాం: వీహెచ్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానకర్ణుడిలా దానధర్మాలు చేస్తుంటే.. ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నును రెట్టింపు చేశారు. గతంలో రూ. 800 ఉన్న ఇంటి పన్ను ఇప్పుడు రూ. 1600లకు పెంచారు. గుళ్లు గోపురాలకు, కుల సంఘాలకు కోట్లకు కోట్లు దానం చేస్తున్న సీఎం.. పన్నులు ఎందుకు పెంచుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉద్యమ నాయకుడని చెప్పుకునే కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తేస్తారా.. ఇదేమన్నా నియంత రాజ్యమా? ఉద్యమాలు వస్తాయని కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే ధర్నా చౌక్ ఎత్తేస్తున్నారని మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. సభ నడుస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అనుమతి లేదని పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో.. వీహెచ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రిగా మాట్లాడితే తప్పేంటి?.. పోలీసుల వ్యవహారం బాగోలేదు. డీజీపీ పోలీసు రాజ్యం చేస్తున్నారు. ప్రభుత్వమే మందు అమ్మిస్తోంది. తాగి బయటకు వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నోట్ల రద్దు.. అరాచక, రాక్షస చర్య: వీహెచ్
హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిలు చూస్తుంటే.. ఇందిరా గాంధీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ప్రజలు మేక్ ఇండియా కోసం కాదు.. పొట్ట కూటి కోసం బ్యాంకు లైన్లలో నిలబడుతున్నారని విమర్శించారు. ప్రజల కరెన్సీ కష్టాలను బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంలో కేసీఆర్ విఫలమయ్యారని.. నోట్ల రద్దు అరాచక, రాక్షస చర్య అని దుయ్యబట్టారు. -
గవర్నర్‌ను రికాల్ చేయాలి: వీహెచ్
ఆర్టీఐని మాఫీయా అని అభవర్ణించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ను వెంటనే రికాల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. సమాచార హక్కు చట్టం గురించి అవమానకరంగా మాట్లాడిని గవర్నర్ నరసింహన్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
'ముద్రగడకు కేంద్రం రక్షణ కల్పించాలి'
- రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ విజ్ఞప్తి - కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినట్లు వెల్లడి - బాబుతో పాటు కేంద్రానిదీ బాధ్యతేనన్న వీహెచ్ కిర్లంపూడి (తూర్పుగోదావరి జిల్లా) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఏమైనా జరిగితే చంద్రబాబుతో పాటు కేంద్రమూ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఆయనకు ఎలాంటి హాని జరగముందే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడను, కుటుంబ సభ్యులను గురువారం వీహెచ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్‌రంగాను కొన్ని దుష్ట శక్తులు హత్య చేశాయన్నారు. ముద్రగడకు కూడా జరగరానిది జరిగితే కాపు జాతి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉద్యమనేతగా ముద్రగడకు హాని జరిగే అవకాశమున్నందున భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. ముద్రగడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారన్నారు. తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని స్వగృహంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబసభ్యుల పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు పాశవికమన్నారు. కాపు ఓట్లతోనే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పదవి చేపట్టాక కాపులను అణగదొక్కేందుకు చూస్తున్నారని, దీనిలో భాగంగానే ముద్రగడను అణచివేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్ జాతి కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పట్ల ప్రభుత్వం దౌర్జన్యం చేసినా కనీసం నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో కాపుల కోసం ముద్రగడ ఉద్యమం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీఓ 30ని అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి రావడం కోసం కాపులను బీసీల్లో చేర్చుతానని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనే ముద్రగడ ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో ముద్రగడకు హాని తలపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముద్రగడకు రక్షణ కల్పించాలన్నారు. వీహెచ్ వెంట జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, వైఎస్సార్ సీపీ నాయకుడు జి.వి.రమణ, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జి.వి.శ్రీరాజ్, వరిగేటి చరణ్ ఉన్నారు. -
వి.హనుమంతరావుకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
-
రేవంత్‌కు గవర్నర్ ప్రశంసలా?
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విరుచుకుపడ్డారు. తన పాలనలో అవినీతి లేదన్న గవర్నర్...సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డికు గవర్నర్ ప్రశంసలా అని వీహెచ్ ఎద్దేవా చేశారు. కాగా రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ ప్రతినిధులతో కలిసి సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రేవంత్ ధైర్యవంతుడంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో తన కుర్చీలాగిన ఘటనను గుర్తు చేస్తూ గవర్నర్ ఈ మాటలు అన్నారు. దీనిపై టీడీపీ నాయకులు గవర్నర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా. రేవంత్ గురించి నాకు బాగా తెలుసంటూ గవర్నర్ వారించారు. -
ఖమ్మంలో కాంగ్రెస్ ధర్నా, ఉద్రిక్తత
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కేంద్రంలో శనివారం ఆందోళనకు దిగింది. బస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వీహెచ్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే అంజన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. -
కాంగ్రెస్ ధర్నా..వీహెచ్ అరెస్ట్
నిజామాబాద్: ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీరుకు నిరసనగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని బోర్గాం బ్రిడ్జీపై ధర్నా చేసిన నాయకులు వాహనాలను అడ్డుకోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న వి. హనుమంతరావుతో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేశారు. -
సోనియాతో వీహెచ్ భేటీ, తాజా పరిస్థితులపై వివరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా పీసీసీ మాజీ చీఫ్ డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశంతో పాటు, తాజా పరిస్థితులపై వివరిస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నయవంచకుడని, కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్లో చేరతానని ఆయన చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. -
కాంగ్రెస్ సమావేశంలో రసాభాస
హైదరాబాద్: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. స్థానికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఎంపీ వి. హనుమంతరావుకు చుక్కెదురైంది. ఆ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు మాట్లాడుతుండగా.. వీహెచ్ అడ్డుకున్నారు. దాంతో వీహెచ్ తీరును నిరసిస్తూ ఆదం వర్గీయులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య కాసేపు రసాభాస నెలకొంది. -
చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి: వీహెచ్
హైదరాబాద్: రేవంత్ ఎపిసోడ్లో ప్రధాన సూత్రధారైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఈ సందర్భంగా వీహెచ్ హెచ్చరించారు. రేవంత్ ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. వాటితో పాటుగా మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయో విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
'బీసీ కులాలను తొలగించటం అన్యాయం'
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం 26 బీసీ కులాలను తొలగించటం అన్యాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కొన్ని బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విభేదాల వల్ల రెండు రాష్ట్రాల మధ్య కొన్ని బీసీ కులాలు నలిగిపోతున్నాయని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారమే కేసీఆర్ సర్కార్ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలని వీహెచ్ అన్నారు. -
వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే!
హైదరాబాద్ : కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమేనని ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఉద్రేకంలో జరిగిన గొడవను ఇద్దరూ మర్చిపోయి పార్టీ కోసం పనిచేయాలని ఆయన శనివారమిక్కడ సూచించారు. బీజేపీ వరుసగా హిందుత్వ అంశాలను చేపడతూ ప్రజలను రెచ్చగొడుతోందని వీహెచ్ ఆరోపించారు. ముస్లింలను హిందువులుగా మార్చాలన్నదే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ అజెండానా? అని ఆయన ప్రశ్నించారు. హిందూ దేశంగా మార్చాలని బీజేపీ ఆలోచిస్తోందని... బీజేపీకి అధికారం ఇచ్చింది అందుకేనా? అంటూ వీహెచ్ మండిపడ్డారు. -
'వలసలకు పీసీసీ, సీఎల్పీ నేతలదే బాధ్యత'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్లడానికి పీసీసీ, సీఎల్పీ నేతలే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోని నేతల వలసలను పసిగట్టడంలో పార్టీ సమన్వయ కమిటీ విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవశ్యకతను వీహెచ్ ఈ సందర్భంగా విశదీకరించారు. బలోపేతం చేసే క్రమంలో తరచుగా సమావేశం కావాలని పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు వీహెచ్ సూచించారు. -
అలాంటప్పుడు సీఎం, హోంమంత్రి ఎందుకు ?
హైదరాబాద్: గవర్నర్‌కే అధికారాలు అంటూ కేంద్రం వెలువరించిన ఉత్తర్వులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) శనివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. కేంద్రం వెలువరించిన ఉత్తర్వుల పట్ల వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌కే అధికారాలు ఇస్తున్నప్పుడు సీఎం, హోంమంత్రి ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు. గవర్నర్, సీఎంలకు వేర్వేలు ఆలోచనలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు టీఎస్సీఎం, హోం మంత్రి ఏం చేయాలని అన్నారు. సెటిలర్లకు ఇబ్బంది కలిగే సమయంలో... అంటే అత్యవసర పరిస్థితుల్లోనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని వీహెచ్ వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుంటే ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంటుందని వీహెచ్ అన్నారు. -
స్పెషల్ చిల్డ్రన్కు స్పెషల్ ఎడ్యుకేటర్
అప్‌కమింగ్ కెరీర్ : నవమాసాలు నిండగానే పూర్తి ఆరోగ్యంగా ఉన్న పండంటి బిడ్డకు జన్మనివ్వాలని తల్లి ఆరాటపడుతుంది. పుట్టిన శిశువును చూసుకొని మురిసిపోతుంది. బిడ్డ ఎదుగుదలలో ప్రతిక్షణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంది. తుళ్లుతూ కేరింతలు కొట్టాల్సిన తన కలలపంట పెరుగుదల సరిగ్గా లేకపోతే ఆ తల్లి మనసు విలవిలలాడుతుంది. అలాంటి శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను అనుక్షణం కనిపెట్టుకొని చూసి, వారికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే.. స్పెషల్ ఎడ్యుకేటర్లు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా లేని కెరీర్.. స్పెషల్ ఎడ్యుకేటర్. దేశ విదేశాల్లో అవకాశాలు.. సెరిబ్రెల్ పాల్సీ, ఆటిజం, ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్, ఫిజికల్ డిజబిలిటీస్, ఆడిటరీ ఇంపెయిర్మెంట్, మెంటల్ అండ్ బిహేవియరల్ డిజార్డర్స్ వంటి వాటి వల్ల కొందరు చిన్నారుల్లో ఎదుగుదల ఉండదు. వీరు సాధారణ పిల్లల్లా ఆడుతూపాడుతూ గడపలేరు. ఇలాంటి వారి అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి. తగిన శిక్షణ ఇస్తే వీరు కూడా మామూలుగానే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. చదువు కూడా చక్కగా నేర్చుకుంటారు. స్పెషల్ చిల్డ్రన్కు విద్యాబుద్ధులు నేర్పాలంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎడ్యుకేటర్లు అవసరం. ఇలాంటి ఎడ్యుకేటర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రస్తుతం నగరాలతోపాటు పట్టణాల్లోనూ స్పెషల్ లెర్నింగ్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్లకు వీటిలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఆసక్తితోపాటు తగిన వనరులు ఉంటే సొంతంగా లెర్నింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్లకు మనదేశంతోపాటు విదేశాల్లోనూ అధిక అవకాశాలు లభిస్తున్నాయి. అనుభవం ఉన్నవారికి భారీ వేతనాలు అందుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలోనూ వీరిని నియమిస్తున్నారు. ఆకర్షణీయమైన శాలరీ ఆఫర్ చేస్తున్నారు. స్పెషల్ ఎడ్యుకేటర్‌గా వృత్తిలో మెరుగ్గా రాణించాలంటే ఓపిక, సహనం ఉండాలి. పిల్లల పరిస్థితి గురించి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అర్హతలు: మనదేశంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌పై డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీయెట్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ కూడా చేస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. హోమ్‌సైన్స్, సైకాలజీ కోర్సులను చదివినవారు కూడా స్పెషల్ ఎడ్యుకేటర్లుగా పనిచేయొచ్చు. వేతనాలు: స్పెషల్ ఎడ్యుకేటర్లు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. శిక్షణ పొందిన, గ్రాడ్యుయేట్ టీచర్లకు నెలకు రూ.30 వేల వేతనం లభిస్తుంది. సర్వ శిక్షా అభియాన్ పథకం కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్‌కు నెలకు రూ.9 వేలు ఇస్తున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లు రూ.35 వేలకు పైగానే వేతనం చెల్లిస్తున్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటల్లీ హ్యాండీక్యాప్డ్-సికింద్రాబాద్ వెబ్సైట్: www.nimhindia.org ఏ లేడీ ఇర్విన్ కాలేజీ-న్యూఢిల్లీ, వెబ్సైట్: ఠీఠీఠీ.్చఛీడజీటఠీజీ.్ఛఛీఠ.జీ ఏ అమర్‌జ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్, వెబ్సైట్: www.amarjyotirehab.org సంతృప్తి, సేవల కలబోత ‘‘కన్నవారు కూడా గుర్తించలేని అమాయక నవ్వుల ఆవేదనను అర్థం చేసుకుని స్పందించి మార్గదర్శనం చేసే అవకాశం ఈ కెరీర్లో లభిస్తుంది. గతంతో పోల్చితే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అభ్యసించేందుకు యువతీయువకులు ముందుకొస్తున్నారు. చిన్నారులకు సేవ చేస్తున్నామనే సంతృప్తిని ఇచ్చే ఉద్యోగం స్పెషల్ ఎడ్యుకేటర్. వైద్యం, విద్య రెండింటినీ ఇక్కడ నేర్చుకోవచ్చు. కెరీర్ పరంగా మంచి అవకాశాలున్నాయి. సొంతంగా విద్యాసంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక విద్యనభ్యసించిన వారిని ప్రభుత్వం ఇటీవల టీచర్లుగా నియమిస్తోంది. ఓర్పు, సేవ చేయాలనే ఆశయం ఉన్నవారికి ఇది మంచి కెరీర్. సీనియార్టీ పెరిగే కొద్దీ రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ వేతనం లభిస్తుంది. విదేశాల్లోనూ మంచి అవకాశాలున్నాయి’’ - డాక్టర్ పి.హనుమంతరావు, స్వీకార్-ఉప్కార్ వ్యవస్థాపకులు -
అధిపత్యం కోసం దేశాలు ఆరాటం
అమెరికాతోనో, రష్యా, చైనాలతోనో, లేకపోతే కొరియాతోనో పోలిస్తే మన రక్షణ సంస్థల స్వావలంబన తేలిక అనిపించవచ్చు. కానీ అలా పోల్చి చూడడం సమంజసం కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఏ దేశానికీ తీసిపోని సాంకేతిక సామర్థ్యాన్ని మనం చూపించిన మాట నిజం. రక్షణశాఖలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచిన మోడీ ప్రభుత్వం యూపీఏ -3 ప్రభుత్వమేనని రుజువు చేసుకుంది. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ రంగంలోనే ఉంటాయని చెప్పిన మూడు కీలక శాఖలలో రక్షణ ఒకటి. రక్షణ రహస్యాలను ప్రభుత్వేతర సంస్థలతో, ఇతర దేశాలతో పంచుకోవడమంటే శత్రువుతో పంచుకోవడమే. నిజానికి రక్షణ శాఖ స్వావలంబన సాధించాలి. ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి తయారీ మన చేతులలోనే ఉండాలని ప్రథమ ప్రధాని నెహ్రూ కొన్ని సంస్థ లను ఏర్పాటు చేశారు. క్రమేణా మరికొన్ని సంస్థలు వృద్ధి చెందాయి. అవి పరిశోధనలు చేసి రక్షణ సామగ్రి, పరికరాలను రూపొందిస్తు న్నాయి. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా ముం దు ఉన్నాయి. కోట్లు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ఆధునిక సామగ్రిని రూపొందించుకుంటున్నాయి. ఉదా హరణకు ఎయిరో ఇంజన్ల తయారీకి అవసరమైన పరిశోధనలకే పది సంవత్సరాలు పట్టింది. మన శాస్త్రవేత్తలు కూడా తమ మేధాశక్తితో గణనీయమైన ఫలితాలు సాధించారు. వేధించే ప్రశ్నలు ఎన్నో! మనకు అతి పెద్ద సైన్యం, నౌకాదళం, వైమానికదళం ఉన్నాయి. యాభై పై చిలుకు రక్షణ పరిశోధక సంస్థలు ఉన్నాయి. హెచ్ఏ ఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎమ్ఎల్ వంటి రక్షణ శాఖ పరిశ్ర మలు ఉన్నాయి. హిందుస్థాన్ షిప్‌యార్డ్, గోవా షిప్‌యార్డ్ వంటి నౌకా నిర్మాణ కేంద్రాలూ ఉన్నాయి. కానీ ఇక్కడ తయారైన పరికరాలకు సంబం ధించి భయం కలిగించే వార్తలు వింటూ ఉంటాం. యుద్ధనౌకలలో ప్రమా దాలు, జలాంతర్గాములలో పేలుళ్లు, విమానాల పతనం, రాడార్లు మొరా యించడం వంటి వార్తలవి. నిజానికి మనకు కావలసిన ఏ చిన్న విడిభా గమైనా విదేశాల నుంచి తెచ్చుకోవలసిందేనని, ఇంకా చెప్పాలంటే మన రక్షణ పరికరాలన్నీ అక్కడ తయారైనవేనని కూడా వింటూ ఉంటాం. ఇంకా, మన రక్షణ సామర్థ్యమంతా బడా విదేశీ బహుళజాతి ఆయుధ తయారీ సంస్థల చేతులలోనే ఉందనీ వింటాం. ఎందుకలా జరిగింది? దాదాపు 70 ఏళ్ల నుంచి స్వావలంబన కోసం మనం చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైనట్టేనా? దీనికి ఎవరు బాధ్యులు? దేశ క్షేమం పట్ల శ్రద్ధ కలిగిన ప్రతి పౌరుడు వేసే ప్రశ్న ఇది. అణ్వాయుధరంగంలో భారత్ విస్మరించరాని ఒక శక్తి. కొన్నే అయినప్ప టికీ మన విమానాలు మనమే నిర్మించుకుంటున్నాం. భారీ మిలటరీ ట్రక్కు లను తయారు చేసుకోగలుగుతున్నాం. రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇక్కడే రూపకల్పన జరిగి, ఇక్కడే రూపొందుతున్నట్టు వింటున్నాం. సుదూర లక్ష్యాలను తాకగల క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్టు కూడా విన్నాం. అంతరిక్ష ప్రయోగాలు, చంద్రయాన్ సరేసరి. అయితే ఈ విషయా లన్నీ నిజం కాదా? మనది రక్షణ వ్యవస్థలో విజయగాథే అవుతుందా? ఇది మరో దృక్కోణం, ఆశావహ దృక్కోణం. వాస్తవం ఆ రెండింటి మధ్యనే ఉంది. అమెరికాతోనో, రష్యా, చైనాలతోనో, లేకపోతే కొరియాతోనో పోలిస్తే మన రక్షణ సంస్థల స్వావలంబన తేలిక అనిపించవచ్చు. కానీ అలా పోల్చి చూడడం సమంజసం కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఏ దేశానికీ తీసిపోని సాంకేతిక సామర్థ్యాన్ని మనం చూపించిన మాట నిజం. ముందంజ వేసినా వీడని భయాలు ఎలక్ట్రానిక్ పరికరాల రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ మన త్రివిధ దళ వ్యవ స్థల అవసరాలను చాలావరకు తీర్చగలుగుతున్నది. తాను ఉత్పత్తి చేసే పరి కరాలలో మూడు వంతులు మనం రూపకల్పన చేసుకున్నవే. పావు వంతు మాత్రం విదేశీ పరిజ్ఞానం ఆధారంగా తయారవుతున్నవి. అలాగని ఆయా పరికరాలలో ఉండే సమస్త సూక్ష్మ పరికరాలు, కాంపోనెంట్లు ఇక్కడివేనని అనుకోరాదు. అనేక కారణాల వల్ల అన్నీ మనం తయారు చేసుకోలేకపోతు న్నాం. అయితే ముందు చూపుతో రక్షణ విభాగానికి చె ందిన ఎలక్ట్రానిక్ పరిక రాల రూపకల్పన, ఉత్పత్తుల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ స్థాపించుకున్నాం. అప్పటికే మొదలైన విమానాల ఉత్పత్తి సంస్థను హిందుస్థాన్ ఎయిరోనా టిక్స్గా మలచుకొని యుద్ధ విమానాల తయారీలో ముందంజ వేశాం. క్షిపణి రంగంలో భారత్ డైనమిక్స్, భారీ మిలటరీ వాహనాల కోసం భారత్ ఎర్త్ మూవర్స్, యుద్ధ నౌకల కోసం షిప్‌యార్డులు - ఇవన్నీ 40 ఏళ్ల క్రితమే మనుగడలోకి వచ్చాయి. ప్రగతిని సాధిస్తున్నాయి. ఇవేవీ యాభై దశకంలో తెలియనివే. రాడార్లు కూడా అంతే. ఇప్పుడు వీటిని కూడా మనమే రూపకల్పన చేసుకుంటున్నాం. రాత్రివేళలో శత్రువుల ఉనికిని పసిగట్టే నైట్‌విజన్ పరికరాలను వేల సంఖ్యలో నిర్మించుకుంటున్నాం. మరి ఎందుకీ విమర్మలూ, భయం? రెండు మూడు కారణాలు. అగ్ర రాజ్యం సరసన గాక వెనుక నిలబడి ఉండడం ఒకటి. ఆ వెనుకబడడాన్ని మనం మహా ఉపద్రవంలా పరిగణించటం రెండోది. సూక్ష్మ పరికరాలు, కాంపోనెంట్ల దిగుమతిని స్వావలంబనతో ముడిపెట్టి, మన రాడార్లు, నెట్ వర్కుల్లో అధిక శాతం విదేశీ వస్తువులున్నప్పుడు వాటిని మనవే అని ఎలా అనగలం? అన్న అమాయకపు గడుసు ప్రశ్న ఒక కారణం. ఎల్లప్పుడూ గ్లాసును సగం ఖాళీగా చూచే వారి మనస్తత్వం మరో కారణం. మన దేశం కొంత యుద్ధ సామాగ్రికి టెండర్లు పిలిచి, ఒక టెండరును ఎంపిక చేస్తే, తమకు లభించలేదనే కక్షతో ఆమోదించిన టెండర్లో ఫలానా ఫలానా లొసుగులున్నాయని రక్షణ రంగం విషయాలు అంతగా తెలియని విలేకరు లను పట్టుకొని వారి ద్వారా దుష్పచారం చేయించడం జరుగుతోంది. లేదా లంచం తీసుకొని, ఆ టెండర్‌నే ఎంపిక చేశారా అనేది మరో కోణం. మన దేశం స్వావలంబన దిశగా ఎదగడాన్ని ‘అంగీకరించని’ దేశాలు చేసే ప్రచారం మరో కారణం. ఇలా ఎన్నో. ఆశావహంగానే ఉండాలి ఇక యుద్ధ విమానాలకు వద్దాం? మనం రూపకల్పన చేసినవి తక్కువ. విదేశీ పరిజ్ఞానంతో నిర్మించుకొన్నవి ఎక్కువ. వాస్తవమే. కానీ, ఆయా సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవటం, ఆయా విమానాల మరమ్మతు, ఓవర్‌హాల్ - అన్నీ సమస్యే. కానీ, ఓ కథ చెపుతారు. అప్పుడెప్పుడో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు వాళ్లకు మన విమానాల కన్నా మరింత సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన విమానాలున్నాయట. కానీ అవి కనుక మొరా యిస్తే మరమ్మతు చేసే శక్తి లేకపోవటం వల్ల యుద్ధరంగంలో అవి కర్ణుడి అస్త్రాలయ్యాయట. మనకా దుస్థితి లేదు, ఉండదు. మన సాంకేతిక సామ ర్థ్యం రెండు రకాలుగా చూడవచ్చు. విజయం, విఫలం. ఉదాహరణకు మనకు శత్రు విమానాల జాడ పసిగట్టగల రాడార్ల శ్రేణి సరిహద్దుల్లో మోహ రించి ఉంది. వాటి రూపకల్పన, ఉత్పత్తీ ఇక్కడివే. విఫల వాదులంటారూ, ‘అబ్బే! అది ‘60లలో మొదలైన ప్రాజెక్టు. నత్తనడకన నడిచి యాభై ఏళ్ల తర్వాతే యుద్ధ రంగంలో మోహరించటం గొప్పేనా!’ అని. కానీ అదైనా ‘విజయమే’! సమయం సంగతి ఎలా వున్నా అలాంటి సామర్థ్యం ఉన్న రాడార్లు ఉన్న అతికొద్ది దేశాల్లో మనదీ ఒకటి. మన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలోనే అలసత్వం, నిర్వ్యాపరత్వం, జవాబుదారీతనం లేకపోవటం, ఫలితాల పట్ల పట్టుదల లేకపోవటం, అంకితభావం లేకపోవటం ఉన్నాయి. ఇలాంటి చెట్టుకు కాసిన కాయలు సంపూర్ణ ఫలాలుగా ఉండాలని ఆశించటం సమంజసం కాదు. కానీ ఇదే రక్షణ విభాగపు ప్రయోగశాలల వ్యవస్థకు ఏపీజే అబ్దుల్‌కలాం లాంటి నాయకులు లభించినప్పుడు తాత్కాలికంగా అయినా, ప్రపంచ స్థాయి ఫలితాలు అందాయి. నాయకత్వం బలహీనమైనప్పుడు ప్రయోగశాలలు అనే ఏముంది, దేశమే నత్తనడక నడుస్తుంది. కానీ మనకున్న సాంకేతిక పరిజ్ఞానంలో సైతం జంకకుండా రాడార్లను మరమ్మతు చేసే అంకితభావం, విదేశీ డిజైనర్లను సైతం చకితులను చేసే పరికరాల రూపకల్పనా సామర్థ్యం ఉన్నాయి. ఇవి మన స్వంతం. అవి మన స్వావలంబనకు పునాదిరాళ్లు. (జీవిత కాలం రక్షణ సంస్థలలో పని చేసి, దేశాభ్యుదయాన్నీ, స్వయం పోషకత్వాన్నీ వాంఛించిన ఒక మిత్రునితో చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా.) (వ్యాసకర్త ఆర్థికాంశాల విశ్లేషకులు) - వి.హనుమంతరావు -
నల్లధనంపై తెల్లముఖం!
కరెన్సీ నోట్ల మార్పిడికి ఇచ్చిన గడువును ఆర్బీఐ ఎందుకు పొడిగించింది? దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటకు కక్కించడమే ఈ నోట్ల మార్పిడి వెనుక ఉన్న లక్ష్యమని అంతా అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలూ నల్లధనాన్ని మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతున్న సందర్భంలో ఈ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) సర్వ స్వతంత్రమైన సంస్థా? లేక పాలక పార్టీకి తాబేదారు సంస్థా? ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తప్పకుండా ఈ అనుమానం కలుగుతుంది. 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లు చెల్లుబాటు కావనీ, వాటిని బ్యాంకులలో సరెండర్ చేసి కొత్త నోట్లను తీసుకోవచ్చనీ ఆర్బీఐ ఆ మధ్య ప్రకటించింది. ఇలా చెప్పిన నెలన్నరకే నిర్ణీత గడువును వచ్చే జనవరిదాకా పొడిగించడానికి వెనుక కారణం ఏమిటి? ఇలా పాత కరెన్సీ నోట్ల స్థానే కొత్త నోట్లను జారీచేయడం భద్రత కారణాలరీత్యా అన్ని దేశాలలోనూ సర్వసాధారణంగా జరిగే పరిణామమే కాబట్టి ఇక్కడ కూడా జరుగుతోందని సరిపెట్టుకుందామా? దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటకు కక్కించడమే ఈ నోట్ల మార్పిడి వెనుక ఉన్న లక్ష్యమని సర్వదా అంతా అనుకుంటున్నారు. అసలు లక్ష్యం అదే అయితే ఆహ్వానించదగిందే. కాని ప్రజలు పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసుకునేందుకు గడువును ఆర్బీఐ ఎందుకు పొడిగించిన ట్టు? నల్లధనం గుట్టలుగుట్టలుగా కొద్దిమంది చేతుల్లో, ముఖ్యంగా బడా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద పేరుకుపోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో వందమంది అత్యంత ధనవంతుల పేర్లనూ, వారి ఆస్తుల విలువనూ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక 2014 మార్చి1న ప్రచురించింది. అదేవిధంగా 2012, 2013లో వీరి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించింది. తొలి ముగ్గురి స్థానాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఒక సంవత్సరంలో, అందులోనూ ఆర్థిక మాం ద్యంలో దేశం కొట్టుమిట్టాడుతున్న సంవత్సరంలో వీరి ఆస్తుల విలువ ఎలా పెరిగిందో గమనించాలి. ఈ వందమంది కుబేరులకు చెందిన కంపెనీల షేర్లను అమ్మేస్తే దాని మొత్తం విలువ రూ. 12,02,364 కోట్లు అవు తుంది. అంటే మన బడ్జెట్ లోటు ఈ సంవత్సరం రూ. 5,24,539 కోట్లను భర్తీ చేయడమే కాకుండా వచ్చే ఏడాది లోటు అంచనా రూ. 5,28,631 కోట్లను కూడా భర్తీ చేయవచ్చు. ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుంది. ఈ భారత కుబేరులు దేశానికి సేవ చేసిన వారవుతారు. ఇంకా వారి వద్ద రూ. 1,50,000 కోట్లు మిగులు ఉంటుంది. అందుకనే ఒక బ్రిటిష్ పౌరుడు మన దేశాన్ని సందర్శించిన తర్వాత ‘‘భారతదేశం ధనికదేశమేగానీ, భారతీయులు మాత్రం పేదవారు’’ అని అభివర్ణించారు. పారిశ్రామికవేత్త 2012 2013(రూ.కోట్లలో) ముకేశ్ అంబానీ 1,11,464 1,17,161 అజీమ్ ప్రేమ్‌జీ 69,322 94,667 సునీల్ మిట్టల్ 82,733 85,662 ఇవి ప్రకటించిన ఆస్తులైతే, ఇక ప్రకటించకుండా దాచిన ఆస్తులు, నల్లధనం ఎంత ఉందో, స్విస్ బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో ఎంత మూలుగుతోందో తెలియదు. సంపన్నుల వద్ద నల్లధనం బంగారం వస్తువుల రూపంలోగానీ, పుత్తడి ముద్దల రూపంలోగానీ ఉంటుంది. నోట్ల రూపంలో దాచుకోరు. అది ఆర్బీఐ లెక్కల్లోకి రాదు. కరెన్సీ నోట్ల మార్పిడికి ఇచ్చిన గడువును ఆర్బీఐ ఎందుకు పొడిగించింది? సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడింది. అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్షపార్టీ, వివిధ స్థాయిలో ఉన్న ఆయా పార్టీల నాయకులు ఓట్ల కొనుగోలు కోసం నల్లధనాన్ని మంచినీళ్లప్రాయంగా ఉపయోగిస్తున్నారు. ఇది రహస్యమేమీ కాదు. అంత ధనాన్ని మార్చేందుకు బ్యాంకుల వద్దకు పోతే గుట్టురట్టవుతుంది. ఓట్లు రాలవు. ఓడిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దేశంలోని బడా కార్పొరేట్లు తమ వద్దనున్న నల్లధనాన్ని ప్రభుత్వం నుంచి తమకు కావల్సిన పనులు చేయించుకోడానికి ఉపయోగిస్తారు. అవినీతి ఇప్పటికే కంపు కొడుతూంది. అవినీతిని నిరోధించడం కోసమే పార్లమెంట్లో బిల్లు పెట్టామని చెప్పుకుంటున్న పాలకపార్టీ ఓట్ల కొనుగోలు కోసం నల్లధనాన్ని వినియోగిస్తుందనేది రహస్యమేమీ కాదు. ప్రముఖ ఆర్థికవేత్త, హిందూ-బిజినెస్‌లైన్ పత్రికలో రెగ్యులర్‌గా ఆర్థికాంశాలపై రాసే కాలమిస్ట్ సీపీ చంద్రశేఖర్ ఇటీవల రాసిన వ్యాసంలో ఒక మాట చెప్పారు. కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ఇపుడు చేస్తున్నది ఒక విలువ కలిగిన నోట్లను పూర్తిగా తొలగించడమో లేదా రద్దు చేయడమో కాదు. కేవలం ఆ పాత నోట్లకు బదులు కొత్త నోట్లను మార్పిడి చేయడమేనని అన్నారు. ‘‘అనేక దేశాల్లో ఇటువంటి పద్ధతి అమల్లో ఉంది. పైగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు నకిలీ తయారు చేయకుండా నివారించగల, మరిత మెరుగైన భద్రతా లక్షణాలు కలిగిన నోట్లు చలామణిలో ఉండేలా చూడడమే ఈ చర్యల వెనుక లక్ష్యం. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా ఆర్బీఐ బయటపెట్టాలి. లేనిపక్షంలో నల్లధనం దాచుకున్న వారివద్ద ఉన్న లెక్కలోకి రాని ఆదాయం, సంపదకు రహస్య క్షమాభిక్షగా మాత్రమే ఈ పథకం ఉపయోగపడుతుంది.’’ అని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఇప్పుడు గడువును ఇంకా పొడిగించడం చూస్తే క్షమాభిక్ష మాత్రమే కాదు, అలాంటి నల్లధనాన్ని ఓట్ల కొనుగోలుకు వినియోగించుకోవలసిందిగా నేరుగా చెప్పడమే. అవినీతికి నారువేసి నీరుపోసి పెంచడమే అవుతుంది. రిజర్వు బ్యాంకును పాలకపార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే అవుతుంది. ఈ నల్లధనం ఎన్నికలలో ఓటర్లకు పంచిపెడితే సులువుగా చలామణి అయిపోతుంది. ఓటర్ల చేతుల్లోకి వెళ్లిన అదనపు ధనం వారి నిత్యావసరాలకు వినియోగించడం కన్నా తాగుడుకు ఖర్చయిపోతుందని అనుభవం చెబుతుంది. మద్యం అమ్మకందారుల పంటపండుతుంది. పేదకుటుంబాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇది భారతదేశంలోని ఒకవైపు చిత్రం. రూపాయికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే దేశానికి రెండో వైపు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదాహరణకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలోనే శంషాబాద్ మండల పరిధిలోని కవ్వగూడ గ్రామపంచాయితీలో 350 కుటుంబాలు ఎలా నివసిస్తున్నాయో చూడండి. ఏ వీధిలోనూ మురుగుకాల్వలు లేకపోవడంతో మురుగునీరు ఏరులై పారుతోంది. రోడ్లన్నీ అధ్వానంగా పడిఉన్నాయి. రైతులకు, మత్స్యకారులకు రుణాలు లభిం చడం లేదు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఇక్కట్ల పాలవుతున్నారు. గ్రామంలో కంప్యూటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గ్రామానికి ఇండిపెండెంట్ సర్పంచ్ ఎన్నికైనప్పటికీ అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇలాంటి దేశాన్ని అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారా? తిరిగి అధికారంలోకి పంపించాలనుకుంటున్నారా? ఆలోచించండి. (వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు) వి. హనుమంతరావు -
ఫ్లాప్ షో..!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ జిల్లాలలో ‘ఇందిరమ్మ విజయ యాత్ర ’ సాగిస్తున్న రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు(వీహెచ్)కు అడుగడుగునా నిరాదరణే ఎదురవుతోంది. ఆయన యాత్ర (రోడ్ షో) ఆదివారం ‘ఫ్లాప్ షో’గా మారింది. ఆయన యాత్రను అశ్వారావుపేటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకుంటారన్న భయంతోరూట్ మార్పు.. ‘యాత్ర మా వద్దకు వస్తే అడ్డుకుంటా’మని పోలవరం ముంపు ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులే హెచ్చరించడంతో వీహెచ్ యాత్ర రూటు మారింది. భద్రాచలంలో యాత్ర ముగించుకున్న వీహెచ్.. ఆదివారం బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పర్యటించి అశ్వారావుపేట మండలానికి చేరుకోవాల్సుంది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడినప్పటి నుంచి.. ముంపు గ్రామాలను తరలించొద్దన్న డిమాండుతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కుక్కునూరులో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. వీహెచ్ యాత్రకు సహకరించాలన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా.. కుక్కునూరు మండల కాంగ్రెస్ నాయకులు నిరాకరించారు. అంతేకాదు.. ‘వీహెచ్ యాత్ర ఇక్కడకు వస్తే అడ్డుకుంటాం’ అని తెగేసి చెప్పేశారు. ఈ పరిస్థితిలో, కుక్కునూరు మండలంలోకి యాత్ర వెళితే అభాసుపాలవుతామనే భయంతో వీహెచ్ యాత్రను అటుగా వెళ్లనీయలేదు. బూర్గంపాడు మండలం ఇబ్రహీంపేట దాటిన తర్వాత కుక్కునూరు మండలం బంజరగూడెం మీదుగా అశ్వారావుపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించాల్సుంది. యాత్రను స్వపక్షీయులే అడ్డుకుంటే పరువు పోతుందన్న భయంతో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే కలిసి రాత్రికి రాత్రే రూటు మార్చేశారు. స్పందన కరువు... వీహెచ్ రోడ్ షో(విజయ యాత్ర)కు జనం కరువుయ్యారు. శనివారం రాత్రి పాల్వంచలో బస చేసిన వీహెచ్.. ఆదివారం ముల్కలపల్లి మండలం పూసుగూడెం చేరుకున్నారు. అక్కడ ఆయన యాత్రకు జనం రాకపోవడంతో వాహనం ఆగలేదు. ముల్కలపల్లిలో గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆయన పూలమమాలలు వేశారు. ఇక్కడ కూడా జనం లేకపోవడంతో ప్రసంగించకుండా వెళ్లిపోయారు. జగన్నాధపురం మీదుగా దమ్మపేట మండలంలోకి ఆయన యాత్ర ప్రవేశించింది. దమ్మపేట మండలంలోనూ కార్యకర్తలు, ప్రజలు పట్టుమని పదిమంది కూడా లేకపోవడంతో ఆయన మొహం చిన్నబోయింది. అక్కడి నుంచి అశ్వారావుపేటకు యాత్ర చేరుకుంది. వెలవెలబోయిన సభ.. వీహెచ్ యాత్రకు అశ్వారావుపేటలో ఏమాత్రం స్పందన కనిపించలేదు. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో ఆయన సభకు కనీసంగా 50మంది కూడా రాలేదు. ఇక్కడ జరిగిన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు 30 మంది; మొత్తం పోలీసధికారులు, సిబ్బంది కలిసి 60మంది; 10 మంది మీడియా ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు సభ అనంతరం, ముందుకు కదులుతున్న వీహెచ్ వాహనాన్ని, కాన్వాయ్‌ని స్థాని క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘పోలవరం ముంపు గ్రామాల తరలింపునకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడ లేదు’ అని, వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల వ రం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని సోనియాను కోరతానని వీహెచ్ చెప్పడంతో కాంగ్రెస్ వారు పక్కకు తప్పుకున్నారు. -
'సీఎం పదవి నీ అయ్య జాగీరు కాదు, సోనియా భిక్ష'
మెదక్: సీఎం పదవి నీ అయ్య జాగీరు కాదు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భిక్ష'' అంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడో అయిపోయిందని, ఇప్పుడు క్రీజులో ఎవరూ లేరని, నువ్వొక్కడివే ఆడుకుంటున్నాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయితే సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ అన్నం పెట్టినవాళ్లకు సున్నం పెట్టే రకమని అన్నారు. ఇద్దరూ సొంత మామలకే వెన్నుపోటు పొడిచారని వీహెచ్ విమర్శలు గుప్పించారు. -
కిరణ్ హీరో కాదు జీరోనే: వీహెచ్
రాష్ట్ర విభజన అడ్డుకుని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలలో హీరో కావాలని చూస్తున్నారని, కానీ ఆయన జీరో కాక తప్పదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. సీఎం ఎన్ని ప్రయత్నాలు చేసిన తెలంగాణ రాష్ట్రం మాత్రం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి ఓటు వేసి ఆ రుణం తీర్చుకుంటారన్నారు. విభజన బిల్లు భోగి మంటల్లో వేయాలన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై వి.హన్మంతరావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల సహనాన్ని అశోక్‌బాబు పరీక్షిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కామారెడ్డి నుంచి ప్రారంభిస్తామన్నారు. -
అంతమాత్రానికే సభాహక్కుల నోటీసా: వీహెచ్
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని, చర్చ మాత్రమే ఉంటుందని దిగ్విజయ్ చెప్పడానికి ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమే కారణమని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. అంతమాత్రానికే టీడీపీ ఎమ్మెల్యేలు దిగ్విజయ్ సింగ్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సరికాదని ఆయన చెప్పారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడును లౌకికవాదులంటే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. టీడీపీ-బీజేపీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా వాటికి ఆశించిన ఫలితం దక్కదని వీహెచ్ జోస్యం చెప్పారు. -
భవిష్యత్తులో బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని భవిష్యత్తులో ఏదో ఓ రోజు వెనకబడిన కులస్థులు(బీసీ)లకు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) జోస్యం చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తున్న దశలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదేపదే డిమాండ్ చేయడం సరికాదని ఆయన వాఖ్యానించారు. తమకు హైదరాబాద్, భద్రచలంతో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాని రాయల్ తెలంగాణను తాము ఎప్పటికి ఒప్పుకోనే ప్రసక్తి లేదని వీహెచ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది... ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజన అడ్డుకుంటామని ఆ క్రమంలో అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వీహెచ్ ఈ సందర్బంగా ఖండించారు. అశోక్ బాబు చేసిన వ్యాఖ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలను ఈ సందర్బంగా వీహెచ్ ప్రశ్నించారు. -
తెలంగాణ తీర్మానం ఓడిపోతుంది:వీ.హెచ్
ఢిల్లీ: అసెంబ్లీకి తెలంగాణ విభజన తీర్మానం వస్తే ఓడిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. కాగా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు సీమాంధ్ర ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణాలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే, సీమాంధ్రలో 170 మందికి పైగా ఎమ్మెల్యేలున్నారన్నారు. ఒకవేళ తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిపోవడం ఖాయమని తనదైన శైలిలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ , బీజేపీలు అనుకూలంగా ఉన్నందున పార్లమెంట్ టీ.బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు టీ.తీర్మానాన్ని ఓడించడం అసెంబ్లీలో సాధ్యపడే అంశమేనన్నారు. కాగా, రాష్ట్ర ఏర్పాటు అనేది అసెంబ్లీ ప్రాతిపదికన జరుగుతుందని తాను అనుకోవడం లేదని వీ.హెచ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని టీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని వీ.హెచ్ ధీమా వ్యక్తం చేశారు. -
మన్మోహనామిక్స్ ‘మంటలు’
విశ్లేషణ: అమెరికా మాటకు తలొగ్గి మన్మోహన్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తూ, డాలర్లను చెల్లించాల్సిన చమురు వైపు మొగ్గు చూపారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటే స్థితికి తెచ్చారు. ఇరాన్ నుంచి మరో 1.1 కోట్ల టన్నుల చమురును దిగుమతి చేసుకుంటే 850 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని మొయిలీ తెలిపారు. ఇది మన్మోహన్ చమురు దిగుమతుల విధానం దివాళాకోరుతనాన్ని చెప్పకనే చెబుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలను గతవారంలో మళ్లీ పెంచి మన్మో హన్ ప్రభుత్వం మరో మారు దేశ ప్రజల చెంప చెళ్లుమనిపిం చింది. కిరోసిన్, గ్యాస్ ధరలు కూడా పెరగనున్నాయని హెచ్చరించింది. మన దేశ చమురు, గ్యాస్ అవసరాలలో 70 శాతానికి విదేశాల నుంచి చేసుకునే దిగుమతులే ఆధారమనీ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి కాబట్టి ధరలను పెంచక తప్పడం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. అమెరికా డాలర్ విలువ పెరిగి, రూపాయి విలువ రోజురోజుకూ తరిగిపోతున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచకపోతే దేశం తీవ్ర విదేశీ మారకద్రవ్య సంక్షోభంలో పడుతుందని కూడా చెబుతున్నారు. ప్రభుత్వ వాదనలో కొంత వాస్తవమున్నమాట నిజమే. కానీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడల్లా అదే స్థాయిలో మన్మోహన్ సర్కారు మన మార్కెట్లో ధరలను ఎందుకు తగ్గించలేదనే ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పరు. అందుకే పెట్రో ఉత్పత్తుల విషయంలో మన్మో హన్ సర్కారు దివాళాకోరు విధానాలను పరిశీలించడం అవసరం. మొత్తంగా ఆయన ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ విధానాలు సాగుతున్న దిశను ఆ పరిశీలనే స్థూలంగా సూచించగలుగుతుంది. అరబ్బుదేశాల్లో చమురు గనులు అపారంగా ఉన్నాయి. చమురు మార్కెట్ ప్రధానంగా వారి దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది. ఆ దేశాధిపతులను నయానా, భయానా లొంగదీసుకుని అమెరికా ప్రపంచ చమురు మార్కెట్ మీద పట్టును సంపాదించింది. అమెరికాలో చమురు నిక్షేపాలున్నా, ప్రపంచ ఆధిపత్యానికి సాధనంగా అది చమురు కంపెనీల మీద పెత్తనం నెరపుతోంది. తమ దేశ అవసరాలను తీర్చుకోవడమేగాక, ప్రపంచ మార్కెట్టులో చమురు ఉత్పత్తుల ధరలను కూడా నియంత్రిస్తోంది. అరబ్బు ప్రపంచంలో ఒక్క ఇరాన్ మాత్రమే అమెరికా శాసనాన్ని ధిక్కరిస్తోంది. దాని అభీష్టానికి వ్యతిరేకంగా అణు విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచుకుంటోంది. ఇరాన్ అణు కార్యక్రమం అణ్వస్త్ర తయారీకేనని ఆరోపిస్తూ అమెరికా తన సహచర సంపన్న దేశాలతో కలిసి ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను అమలు చేస్తోంది. అణ్వస్త్రాల గుట్టలను దాచుకున్న అమెరికా తదితర సంపన్న దేశాలు తప్ప మరెవరూ అణ్వస్త్రాలను తయారు చేయరాదని అది హుకుం జారీ చేసింది. ఇరాన్‌లోని భారీ చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసమే అది ఆ దేశంలోని ఇస్లామిక్ ప్రభుత్నాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోంది. ఆ లక్ష్యంతోనే ఆ దేశంతో ఎవరూ వ్యాపార సంబంధాలు పెట్టుకోరాదని శాసించింది. ఇరాన్ నుంచి చమురు కొనరాదంటూ మన దేశంపైన కూడా అది తీవ్రమైన ఒత్తిడిని తెచ్చింది. ఆ ఒత్తిడికి లొంగిపోయిన మన్మో హన్ ప్రభుత్వం గతమూడేళ్లుగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తూ వచ్చింది. ఇరాన్ భారత్‌కు రూపాయలలో చమురును అమ్ముతోంది. ఇతర దేశాలకైతే మనం డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. 1991లో తీవ్ర విదేశీ మారక ద్రవ్య సంక్షోభం కారణంతో ఆర్థిక సంస్కరణల పేరిట అమెరికా కనుసన్నల్లో నడిచే ప్రపంచ బ్యాంకు విధానాలకు మన్మోహన్ తలుపులు బార్లా తెరిచారు. ఆనాటి నుంచి అమెరికా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పెత్తనం చేయటం ప్రారంభించింది. అమెరికా మాటకు తలొగ్గి మన్మోహన్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తూ, డాలర్లను చెల్లించాల్సిన చమురు వైపు మొగ్గు చూపారు. మళ్లీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటే స్థితికి దేశ ఆర్థిక వ్యవస్థను ఈడ్చారు. 2008-09లో ఇరాన్ నుంచి మన దేశం 2.12 కోట్ల టన్నుల చమురును దిగుమతి చేసుకోగా, అది 2012-13 నాటికి 1.4 కోట్ల టన్నులకు తగ్గిపోయింది. అంటే ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలంలో, మన ఎగుమతులు క్షీణిస్తూ కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతున్న కాలంలో డాలర్లు చెల్లించి మాత్రమే ముడి చమురును కొనాలని నిర్ణయించారు. మన్మోహన్‌లాంటి ఆర్థిక నిపుణుని విధానమది! అందుకే ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులు దాదాపు సగానికి పడిపోయాయి. ఇరాన్ నుంచి మరో 1.1 కోట్ల టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది 850 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని వీరప్ప మొయిలీ తన తాజా ప్రతిపాదనలో వెల్లడి చేశారు. ఆ ప్రతిపాదన మన్మోహన్ గత నాలుగేళ్లుగా అమలు చేస్తున్న చమురు దిగుమతుల విధానం దివాళాకోరు తనాన్ని చెప్పకనే చెబుతోంది. ఒకపక్క డాలర్ల కొరతతో జుట్టుపీక్కుంటూ, పడిపోతున్న రూపాయి విలువను నిలపలేక నానా తంటాలుపడుతున్న మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరాలకు మొయిలీ ప్రతిపాదన ఇంకా మింగుడుపడ లేదు. అమెరికా పట్ల వారి స్వామిభక్తి అంత గొప్పది మరి. మన పెట్రో సంక్షోభానికి ఇది మొదటి కారణం మాత్రమే. మరోవంక మన్మోహన్ సర్కారు స్వదేశంలో ఎవరి పట్ల స్వామి భక్తిని కనబరుస్తోందో కూడా చూస్తే సమస్య మొత్తం విశదమవుతుంది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీ ఎంతో వ్యయప్రయాసలకోర్చి కనుగొన్న కృష్ణా-గోదావరి బేసిన్లో బావుల తవ్వకాన్ని రియలన్స్‌కు అప్పగించడమేగాక, ఆ బావుల నుంచి అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదంటూ అది చూపిన సాకును గుడ్డిగా నమ్మి, ధరను రెట్టింపు చేయడానికి మన్మోహన్ సర్కారు అనుమతించింది. ధరలు పెంచిన వెంటనే కొత్త బావి కనుగొన్నామంటూ రిలయన్స్ తిరిగి ఉత్పత్తిని పెంచింది. రిలయన్స్ కుటిల నీతిని చూస్తూ చేతులు ముడుచుకు కూచున్న మన్మోహన్ పెట్రో ధరల పెంపుదలకు అంతర్జాతీయ మార్కెట్లే పూర్తిగా కారణమనడం వంచన గాక ఏమవుతుంది? 2008లో అమెరికాలో బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితిలో కూడా మన దేశం నిలదొక్కుకోగలిగింది. ఆ తర్వాత, ముఖ్యంగా 2010 తర్వాత మన దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటం ప్రారంభమై, వృద్ధి మందగించడం మొదలైంది. సంస్కరణలు ప్రారంభమైన రెండు దశాబ్దాలకు మళ్లీ 1990-91 నాటికే, అంటే ఎక్కడ ప్రారంభించామో అక్కడికే చేరుకున్నాం. దేశంలో పెట్టుబడులు సన్నగిల్లాయి. రుణభారం పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్లేగాక రక్షణ శాఖతో సహా పలు రంగాల్లో విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తూ తలుపులు బార్లా తెరిచాం. అయినా 2010-11లో 9.3 శాతంగా ఉన్న స్థూల దేశీయాదాయం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో నాలుగు శాతానికి దిగజారింది. ద్రవ్యోల్బణం చిల్లర ధరల ప్రకారం పది శాతం పెరిగింది. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంటు లోటు ఆర్థిక వ్యవస్థను నిత్యం పట్టిపీడిస్తుస్తూనే ఉన్నాయి. ద్రవ్యలోటు మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ)లో 5 నుంచి 6.5 శాతం వరకు ఉంటూ వస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది చాలా ఎక్కువే. నిర్దిష్టంగా చెప్పాలంటే 2008-09లో రూ.3.5 లక్షల కోట్లు ఉన్న ద్రవ్యలోటు 2013- 14 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.5.5 లక్షల కోట్లు. ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో అప్పులు తెచ్చి లేదా అటువంటి ఇతర వనరుల ద్వారా సమకూర్చుకున్న భాగాన్ని ఈ ద్రవ్యలోటు తెలియజేస్తుంది. 2013-14లో మొత్తం బడ్జెట్ ఖర్చు రూ.16.65 కోట్లు కాగా ఇందులో ద్రవ్యలోటు రూ.5.5 లక్షల కోట్లు అంటే సుమారు మూడో వంతు బడ్జెట్‌ను అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్నారన్న మాట. ఫలితం? ప్రభుత్వ రుణాలు పెరిగిపోవటం, వడ్డీలు, రుణాల చెల్లింపు భారం రోజురోజుకూ పెచ్చుపెరగడం, 2013-14 బడ్జెట్లో రుణాల చెల్లింపు రూ.1.67 లక్షల కోట్లు కాగా, వడ్డీల చెల్లింపు రూ.3.70 లక్షల కోట్లు! అంటే రూ.10.56 లక్షల కోట్ల ప్రభుత్వ రాబడిలో రుణాలు, వడ్డీల చెల్లింపులకే రూ.5.38 లక్షల కోట్లు ఖర్చవుతున్నది. ప్రభుత్వ ఆదాయంలో 51 శాతం రుణాల చెల్లింపులకే పోతోంది. పైగా దాదాపు రుణాల చెల్లింపులతో సమానంగా ప్రభుత్వం కొత్త అప్పులు చేస్తోంది. పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు, ఆ కొత్త ఆప్పులను తీర్చడానికి వచ్చే ఏడాది సరికొత్త అప్పు... ఇదీ మన్మోహన్ సర్కారు బతుకు! అమెరికాయే పీకల్లోతు రుణాల ఊబిలో ఇరుక్కుపోయి ఊపిరాడక గిలగిలా కొట్టుకులాడుతుండగా, అదే అమెరికాను పట్టుకొని మన్మోహన్సింగ్ వేళ్లాడుతుంటే మన ఆర్థిక పరిస్థితి ఇలా కాక మరెలా ఉంటుంది? అమెరికా తన ప్రయోజనాల కోసం ముందుకు తెచ్చిన ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను అమలుచేసిన వర్థమాన దేశాలన్నీ ఇలాగే రుణ సుడిగుండంలో, సంక్షోభంలో కొట్టుకులాడుతున్నాయి. ఆ విధానాలకు స్వచ్ఛందంగా తలుపులు తెరచిన మన్మోహన్ నేటికీ అమెరికా విధేయతను వీడలేదు. - వి. హనుమంతరావు, సీనియర్ పాత్రికేయులు