
అలాంటప్పుడు సీఎం, హోంమంత్రి ఎందుకు ?
హైదరాబాద్: గవర్నర్కే అధికారాలు అంటూ కేంద్రం వెలువరించిన ఉత్తర్వులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. కేంద్రం వెలువరించిన ఉత్తర్వుల పట్ల వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్కే అధికారాలు ఇస్తున్నప్పుడు సీఎం, హోంమంత్రి ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు. గవర్నర్, సీఎంలకు వేర్వేలు ఆలోచనలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాంటప్పుడు టీఎస్సీఎం, హోం మంత్రి ఏం చేయాలని అన్నారు. సెటిలర్లకు ఇబ్బంది కలిగే సమయంలో... అంటే అత్యవసర పరిస్థితుల్లోనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని వీహెచ్ వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుంటే ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంటుందని వీహెచ్ అన్నారు.