
'సీఎం పదవి నీ అయ్య జాగీరు కాదు, సోనియా భిక్ష'
సీఎం పదవి నీ అయ్య జాగీరు కాదు, సోనియా గాంధీ భిక్ష'' అంటూ వి.హన్మంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మెదక్: సీఎం పదవి నీ అయ్య జాగీరు కాదు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భిక్ష'' అంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడో అయిపోయిందని, ఇప్పుడు క్రీజులో ఎవరూ లేరని, నువ్వొక్కడివే ఆడుకుంటున్నాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయితే సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ అన్నం పెట్టినవాళ్లకు సున్నం పెట్టే రకమని అన్నారు. ఇద్దరూ సొంత మామలకే వెన్నుపోటు పొడిచారని వీహెచ్ విమర్శలు గుప్పించారు.