తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు డబ్బు పిచ్చి పట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు డబ్బు పిచ్చి పట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. అవసరం లేకున్నా బైసన్ పోలో గ్రౌండ్ కోసం యత్నిస్తుస్తున్నారని, అక్కడ కొత్త సచివాలయం కడితే మంచిదని చిన్నజీయార్ స్వామి చెప్పడం వల్లే సీఎం ఈ పనికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన వీహెచ్.. సీఎంకు సెక్రటేరియేట్‌కు వచ్చే ఉద్దేశం లేనప్పుడు కొత్త సెక్రటేరియేట్ అవసరమా? అని ప్రశ్నించారు. స్వామీజీలను కలవడానికి సీఎంకు సమయం ఉంటుందికానీ రైతులను కలిసేందుకు ఉండదా? అని అన్నారు. మొన్నటి ప్రెస్‌మీట్‌లో సీఎం అనుచిత వాఖ్యలు చేశారని, నేరేళ్ల ఘటనలో దళితులపై కేసులు పెట్టడం కాదు.. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై కేసులు పెట్టాలని వీహెచ్ మండిపడ్డారు. ప్రతి నెల ఇంత కలెక‌్షన్ రావాలని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు షరతు పెట్టడం వల్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.