‘ధరణి’ని బంగాళాఖాతంలో కలుపుతాం | TPCC President Revanth Reddy Comments On CM KCR | Sakshi
Sakshi News home page

‘ధరణి’ని బంగాళాఖాతంలో కలుపుతాం

Published Thu, Jul 7 2022 11:00 AM | Last Updated on Thu, Jul 7 2022 11:16 AM

TPCC President Revanth Reddy Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ కవాడిగూడ: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళా ఖాతంలో కలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ సర్కారు ధరణి పేరుతో పేద రైతుల భూములను లాక్కుంటూ వారిని రోడ్డుపాలు చేస్తోందని, ఆ పోర్టల్‌ రద్దయ్యే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ధరణిపై రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు.
చదవండి: కాంగ్రెస్‌లో ‘కుర్చీ’లాట!

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రాజెక్టుల పేరుతో లాక్కోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో భూమే ఆత్మగౌరవంగా రైతులు బతుకుతున్నారన్నారు. టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ నిరంకుశ పాలన చేస్తోందని ఆరోపించారు. కోట్ల విలువైన భూముల ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొల్లగొడుతోందని మండిపడ్డారు.

వైఎస్‌ సర్కార్‌ పంచి పెడితే..
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి, గిరిజనులకు ఐదు లక్షల ఎకరాల భూములను పంచిపెడితే ఇప్పుడు ఆ భూములను లాక్కునే ప్రయత్నాలు సాగుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేద ప్రజల ఆత్మగౌరవమైన భూమిని గుంజుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. భూమిపై హక్కు కలిగి ఉన్న రైతులకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కబ్జా చేస్తున్న వైనాన్ని రైతులు ప్రశ్నిస్తే వారిపై పాశవికంగా దాడులు చేసి, మహిళలను.. చంటిపిల్లలను సైతం జైలుకు పంపిస్తున్న నీచమైన ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, వారి భూములను కాపాడే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
చదవండి: ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు

రికార్డులు మాయం
సచివాలయాన్ని కూలగొట్టి రెవెన్యూ రికార్డులన్నీ మాయం చేశారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్‌ మాయమాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. లక్ష్మాపూర్‌ గ్రామంలో 800 మందికి పట్టాలు ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పార్టీ కొట్లాడి 200 మందికి పట్టాలు ఇప్పించిందన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ సభలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ధరణిని వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ రికార్డులను ప్రజల వద్ద ఉంచాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు భూమిపై హక్కు కల్పించాలని తీర్మానాలు చేశారు. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అ ధ్యక్షుడు అవినాష్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించ గా.. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పార్టీ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్, వి. హను మంతరావు, మధుయాïష్కీ, సీతక్క, రాములు నాయక్, విజయారెడ్డి, తంగిశెట్టి జగదీశ్వర్‌రావు, నల్లబెల్లి అంజిరెడ్డి, సూర్యప్రకాశ్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement