
సాక్షి, హైదరాబాద్: పెగాసస్ వ్యవహారంలో మోదీ, కేసీఆర్ తోడు దొంగలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఛలో రాజ్‌భవన్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం అని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెగాసస్ స్పైవేర్ నిఘాపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంలో దోషులు బయటపడే వరకు పోరాటం చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment