
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బీజేపీకి మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌ను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతును నిలువరించేందుకే కేసీఆర్, మోదీలు థర్డ్‌ఫ్రంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే థర్డ్‌ఫ్రంట్‌ను మోదీయే వెనుక నుంచి నడిపిస్తున్నట్లుగా ఉందన్నారు. కేసీఆర్ పెట్టిన కష్టాలను తెలంగాణ ప్రజలు 4 ఏళ్లపాటు భరించారని, ఇక ఎంత మాత్రం ఆయన్ను విశ్వసించరని చెప్పారు. ఈ ఏడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment